గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 13 అక్టోబరు 2023 (18:49 IST)

ఆలయంలో ఇచ్చే ప్రసాదం ఎందుకు తీసుకోవాలి..?

ప్రసాదం అంటేనే స్వచ్ఛత అని అర్థం. భక్తితో రోజువారీ పూజలు చేస్తూ భగవంతుడిని దర్శనం చేసుకుంటే మనశ్శాంతి కలుగుతుంది. భగవంతునికి సమర్పించే నైవేద్యం ప్రసాదంగా మారుతుంది. దానిని ప్రసాదంగా స్వీకరించడం ద్వారా సర్వశుభాలు చేకూరుతాయి. కొంతమంది ప్రసాదం అంటే భగవంతుని కోసం ప్రత్యేకంగా చేసే ఆహారం అని భావించారు. 
 
ప్రసాదం అందించడం ఎందుకు?
ఒకరు ఆహారాన్ని ఉడికించినప్పుడు అది సాధారణ ఆహారంగా ఉంటుంది. అదే భగవంతునికి సమర్పించినప్పుడు ప్రసాదంగా అంటే పవిత్రత పొందుతుంది. ఇదే విధమైన సాధారణ గుణాలతో మానవుడు, భగవంతుని వద్ద తనకు అప్పగించునప్పుడు అతని మనస్సు నిర్మలంగా మారుతుంది. మానవుని జీవితం పవిత్రతను పొందాలంటే భక్తులు ఆలయాల్లో స్వామిని సమర్పించిన నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. 
 
ప్రసాదానికి జీవన విధానానికి సంబంధం..
సాధారణంగా ఆలయానికి వెళ్ళినప్పుడు.. తాను ఇష్టపడే ఆహారం ప్రసాదంగా లభిస్తుందని ఎవరూ అనుకోరు. ఆలయంలో ఏమి ఇస్తున్నారో దానిని ప్రసాదంగా, భక్తితో అంగీకరిస్తాం. అదే విధంగా జీవితంలో భగవంతుడు మనకు ఇచ్చిన ప్రతిదానిని కృతజ్ఞతతో, భక్తితో స్వీకరించి జీవించాలి. 
 
ఇది భగవంతుడు నాకు ఇచ్చాడు. భగవంతుని కృపతో నాకు దొరికింది.. అని అనుకున్నప్పుడు జీవితం  ఆనందంగా మారుతుంది. 
 
శరీరం భగవంతుడు ఇచ్చిన బహుమతి. దానికి తగిన గౌరవం ఇవ్వాలి. దీన్ని తెలియజేయడం కోసం ప్రతి ఒక్కసారి తినడానికి ముందు దేవునికి కృతజ్ఞత తెలిపి తీసుకోవడం అలవాటు చేసుకోవాలి.