సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్

చంద్రబాబు ఆరోగ్యంపై భువనేశ్వరి ఆందోళన - 5 కేజీల బరువు తగ్గారంటూ ట్వీట్

bhuvaneswari
రాజమండ్రి జైలులో ఉంటున్న తన భర్త, టీడీపీ అధినేత నారా చంద్రబాబు ఆరోగ్యంపై ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఆందోళన వ్యక్తం చేశారు. తన భర్త ఐదు కేజీల బరువు తగ్గిపోయారన్నారు. తన భర్త జీవితానికి తక్షణ ముప్పు సృష్టించేలా ఉన్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్తకు తగిన వైద్యాన్ని సకాలంలో అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. 
 
ఆయన ఇప్పటికే ఐదు కేజీల బరువు తగ్గారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా ఆయన బరువు తగ్గితో అది కిడ్నీలపై ప్రభావం చూపుతుందని చెప్పారు. ఓవర్‌హెడ్ వాటర్ ట్యాంకులు అపరిశుభ్రంగా ఉండటంతో చంద్రబాబు ఆరోగ్యానికి తీవ్ర ముప్పు వాటిల్లుతుందని, ఈ భయంకరమైన పరిస్థితులు తన భర్త జీవితానికి తక్షణం హానికలిగించేలా ఉన్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
 
మరోవైపు, పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు కూడా ప్రభుత్వానికి ఓ హెచ్చరిక చేశారు. చంద్రబాబు ఆరోగ్యానికి ఏమైనా హాని జరిగితే దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. చంద్రబాబును తక్షణం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో వైద్యం అందించాలని ఆయన కోరారు. ఆయనకు పూర్తి స్థాయిలో వైద్యం చేయడంతో పాటు సరైన వైద్యం అందించాలని ఆయన డిమాండ్ చేశారు.