బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 2 అక్టోబరు 2023 (12:07 IST)

రాజమండ్రి వేదికగా ప్రారంభమైన నారా భువనేశ్వరి సత్యాగ్రహ దీక్ష

bhuvaneswari
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా సోమవారం సత్యాగ్రహ దీక్షకు తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చింది. ఇందులోభాగంగా అధినేత చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెట్రల్ జైలులోనే సత్యమేవ జయతే దీక్షను ప్రారంభించారు. అలాగే చంద్రబాబు సతీమణి భువనేశ్వరి రాజమండ్రిలో దీక్షను మొదలుపెట్టారు. అంతకుముందే ఢిల్లీలో టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ సత్యాగ్రహ దీక్షను చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నేతలు సత్యగ్రహ దీక్షలో కూర్చుకున్నారు. ఈ దీక్ష సాయంత్రం 5 గంటల వరకు సాగనుంది.
 
ఇదిలావుంటే, ఇటు హైదరాబాద్ నగరంలోని ఎన్టీఆర్ భవన్‌లో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర, ఎన్టీఆర్ కుటుంబసభ్యులు దీక్షలో కూర్చున్నారు. ఎన్టీఆర్ కుమార్తె గారపాటి లోకేశ్వరీ, తారకరత్న సతీమణి అలేఖ్య రెడ్డి, ఎన్టీఆర్ మనమడు గారపాటి శ్రీనివాస్, చలసాని చాముండేశ్వరీ, నందమూరి జయశ్రీ, నారా రోహిత్ తల్లి నారా ఇందిరా తదితరులు దీక్షలో కూర్చున్నారు. టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, అర్వింద్ కుమార్ గౌడ్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సాయంత్రం 5 గంటల వరకు నిరాహార దీక్ష కొనసాగనుంది.