శుక్రవారం, 1 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : బుధవారం, 18 అక్టోబరు 2023 (17:18 IST)

గురుహోరలో గురువారం గురుపూజ చేస్తే..?

Guru Bhagavan
గురుదోషంతో చాలా ఇబ్బందులు తప్పవు. గురుదోషం నుంచి విముక్తి పొందాలంటే.. ముందుగా తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వాలి. గురువులందరికీ నమస్కరించడం ద్వారా గురుదోషం నుంచి బయటపడవచ్చు. 
 
అరటి మొక్కను పూజించడం ద్వారా గురు దోషాలను నివృత్తి చేసుకోవచ్చు. గురువారం గురు హోరలో గురుపూజ అంటే మీరు ఎవరైతే గురువుగా భావిస్తారో వారిని ప్రార్థించి పూజించడం చేయాలి. గురుపూజ గురుపూర్ణిమ రోజున మాత్రమే కాకుండా వారంలోని ముఖ్యమైన రోజుల్లో గురువారం పూట శెనగలు నైవేద్యంగా సమర్పించవచ్చు. 
 
బృహస్పతి మంత్రాన్ని జపించండి. దీంతో గురు అనుగ్రహం లభిస్తుంది. ప్రతి గురువారం ఈ మంత్రాన్ని 108 సార్లు పఠించండి. మీ జాతకంలో గురు దోషం ఉంటే తొలగిపోతుంది. అలాగే, పసుపు బట్టలు, పసుపు వస్తువులను దానం చేయడం ద్వారు గురు దోషాలు తొలగిపోతాయి.