సూర్యాష్టకం-సూర్యస్తోత్రము
ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర
దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే||
సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజమ్ |
శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్||
లోహితం రథమమాఢం సర్వలోకపితామహమ్ |
మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ ||
త్రైగుణ్యం చ మహాశూరం బ్రహ్మవిష్ణుమహేశ్వరమ్ ||
మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ |
బృంహితం తేజసాం పుంజం వాయురాకాశమేవ చ|
ప్రభుస్త్వం సర్వలోకానాం తం సూర్యం ప్రణమామ్యహమ్ ||
బంధూకపుష్పసంకాశం హారకుండల భూషితమ్ |
ఏకచక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ ||
విశ్వేశం విశ్వకర్తారం మహాతేజః ప్రదీపకమ్|
మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ |
శ్రీ విష్ణుం జగతాంనాథం జ్ఞానం విజ్ఞాన మోక్షదమ్ |
మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ |
సూర్యాష్టం పఠేన్నిత్యం గ్రహపీడా ప్రణాశనమ్|
అపుత్రాల్లభతే పుత్రో దరిద్రోధనవా భవేత్|
ఆ మిషం మధుపానం చ యఃకరోతి రవేర్దినే|
సప్తజన్మ భేవేద్రోగే జన్మజన్మ దరిద్రతా |
స్త్రీ తైలమధుమాంసాని యేత్యజంతి రవేర్దినే |
న వ్యాధిశోకదారిద్ర్యం సూర్యలోకం స గచ్ఛత్రి |
ఈ సూర్యాష్టకాన్ని ప్రతినిత్యం పారాయణం చేస్తూంటే నవగ్రహ భూతగ్రహాదుల వల్ల కలిగే పీడలు తొలగిపోతాయి. ఆదివారం నాడు స్త్రీ సంభోగం చేయరాదు. తలకు నూనెపూసుకోరాదు. తలంటు స్నానం చేయరాదు. మద్యపానం చేయరాదు. మాంసము తినరాదు. ఈ చేయరాని పనులు చేస్తే వీటి దుష్ర్పభావము ఏడు జన్మలు వెంటనే వస్తాయని పండితులు అంటున్నారు. వీటిని విడుచువారు. సమస్తబాధలు తొలగి వ్యాధులు దగ్గరికి రాక దుఃఖాలను అనుభవించక దారిద్ర్యబాధలేక ఐహికసుఖాలు అనుభవించి కడపటికి సూర్యలోకం చేరుతారని ఈ సూర్యాష్టక అర్థం.