సంపదను ఆకర్షించాలంటే.. ధనాదాయం పొందాలంటే ఈ దీపం చాలు
ఒకరి జీవితంలోకి డబ్బును ఆకర్షించడానికి, సంపదను పొందడానికి కొన్ని గ్రహాలు, దేవతలు అధిదేవతగా పరిగణిస్తాయి. ఈ రెండింటినీ సక్రమంగా పూజిస్తే, ప్రయోజనాలు లభిస్తాయని నమ్ముతారు. దీనికోసం గొప్ప గొప్ప పనులు చేయాల్సిన అవసరం లేదు. బ్రహ్మ ముహూర్తం, అభిజిత్ ముహూర్తంలో ఒక్క నెయ్యి దీపం వెలిగించి పూజిస్తే చాలు. అన్నీ రకాల ప్రయోజనాలు చేకూరుతాయి.
సంపదకు అధిపతులు శుక్రుడు, బృహస్పతి. శుక్రుడు ధనాదాయం ప్రసాదిస్తాడు. అలాగే గురుగ్రహం ప్రభావంతో శుభఫలితాలు చేకూరుతాయి. అలాంటి గురువుకు శుభప్రదమైన గురువారం నాడు నేతి దీపం వెలిగించి పూజిస్తే ఆదాయం పెరుగుతుందని విశ్వాసం. అలాగే శుక్రుని శుక్రవారంలో శుక్రహోరలో నేతి దీపం వెలిగిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి.
అలాగే గురువారం నాడు, ఉదయం 6-7 గంటల మధ్య లేదా మధ్యాహ్నం 1-2 గంటల మధ్య గురు భగవానుడిని నెయ్యి దీపం వెలిగించి పూజించాలి. సూర్యుడు ఉదయిస్తున్న సమయంలో దీపం వెలిగిస్తేనే మంచి ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు. వారానికి ఒకసారి కేవలం ఒక గంట సేపు నెయ్యి దీపం వెలిగిస్తే, జీవితంలో సానుకూల మార్పులను గమనించవచ్చు.