సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : గురువారం, 7 డిశెంబరు 2023 (20:34 IST)

ఉత్పన్న ఏకాదశి.. రాత్రంతా దీపం వెలిగితే.. ఆరిపోకుండా..?

కార్తీకమాసంలో ఉత్పన్న ఏకాదశి శుక్రవారం కార్తీక మాసంలోని కృష్ణ పక్షంలో అంటే ఈ ఏడాది డిసెంబర్ 08వ తేదీన శుక్రవారం నాడు వచ్చింది. డిసెంబర్ 8వ తేదీన శుక్రవారం నాడు ఉదయం 05:06 గంటలకు ఏకాదశి తిథి ప్రారంభమవుతుంది. డిసెంబర్ 9వ తేదీ శనివారం ఉదయం 6:31 గంటలకు ముగుస్తుంది. 
 
ఉత్పన్న ఏకాదశి రోజున విష్ణువును పసుపు బట్టలు ధరించి పూజించాలని నియమం ఉంది. అలాగే ఈ రోజున పసుపు పువ్వులు, అరటిపండు, నెయ్యి, పసుపు మొదలైన వాటిని నైవేద్యంగా సమర్పించాలి. ఈ రోజున రాత్రి ప్రధానంగా దీపం వెలిగించడం దానిని రాత్రంతా జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. 
 
అదేవిధంగా, ఈ రోజు 108 సార్లు తప్పకుండా లక్ష్మీ జపం చేయాలి. ఉత్పత్తి ఏకాదశి రోజున, ఒక కుండ నీటిలో కొంత చక్కెరను కలిపి, పుష్పించే చెట్టుకు నైవేద్యంగా ఉంచి, ఆవాల నూనె దీపాన్ని వెలిగించాలి. తర్వాత అదే రోజు సాయంత్రం నెయ్యి దీపం వెలిగించాలి.  
 
మార్గశిర మాసంలో కృష్ణ పక్షంలోని ఏకాదశికి చాలా విశిష్టత ఉంది. ఈ రోజునే ఏకాదశి ఉద్భవించిందని పురాణాలు చెప్తున్నాయి. అందుకే దీనిని ఉత్పన్న ఏకాదశి అంటారు. 
 
ఉత్పన్న ఏకాదశి రోజున శ్రీ మహా విష్ణువును, లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి విష్ణు సహస్ర నామాలను, లక్ష్మీ అష్టోత్తర స్తోత్రాలను చదవాలి. ఇవి చదవడానికి వీలు కాలేని వారు ఈ మంత్రాలను పఠించాలి. అలాగే ఈ ఉత్పన్న ఏకాదశి రోజున శివకేశవుల పూజ విశిష్ట ఫలితాలను ఇస్తుంది. 
 
ఓం భగవతే వాసు దేవాయ నమః
ఓం నమో నారాయణయ నమః
ఓం శ్రీ మహాలక్ష్మీయే నమః
ఈ మంత్రాలను పఠించడం వల్ల ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి.