CPI Narayana: పవన్ ఎందుకు విడాకులు ఇచ్చాడు.. ఫామ్ హౌస్‌లో ఆ పని చేశాడు.. అరెస్ట్ చేయాలి? (video)
సనాతన ధర్మంపై సీపీఐ నారాయణ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మం అరాచకం అంటూ నారాయణ ఫైర్ అయ్యారు. సనాతన ధర్మాన్ని సమర్ధించే పవన్ కల్యాణ్‌ను అరెస్ట్ చేయాలని సీపీఐ నారాయణ డిమాండ్ చేశారు. సనాతన ధర్మం క్రూరమైనది, అరాచకమైనదని.. దానిని సమర్థించేవాళ్లను అరెస్ట్ చేయాలని నారాయణ డిమాండ్ చేశారు.
సనాతన ధర్మంలో విడాకులు ఉండవని నారాయణ అన్నారు. అలాంటిది సనాతన ధర్మాన్ని పాటించే పవన్ కళ్యాణ్.. ఎలా విడాకులు తీసుకున్నాడని ప్రశ్నించారు. సనాతన ధర్మంలో భర్త చనిపోతే భార్యను కూడా అతనితో పాటుగా తగలబెట్టే ఆచారాలు ఉన్నాయని గుర్తు చేశారు.
అలాంటి ధర్మాన్ని పాటించడమంటే మళ్లీ వెనక్కి వెళ్లడమేనంటూ సీపీఐ నారాయణ తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఎంతో మందిని తన ఫార్మ్ హౌస్‌లో రేప్ చేసి పవన్ బ్లాక్ మెయిల్ చేశాడంటూ నారాయణ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అతను బయట వుంటే ఎంతో మంది అమ్మాయిలు అబ్బాయిలు జీవితాలు నాశనం చేస్తాడని నారాయణ మండిపడ్డారు.