బుధవారం, 1 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : గురువారం, 15 ఆగస్టు 2024 (20:48 IST)

వరలక్ష్మీ వ్రతం.. బంగారు రంగు చీర ధరిస్తే.. గణపతిని పూజించాకే..?

Varalakshmi Vratham
Varalakshmi Vratham
శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం.. వరలక్ష్మీ శుక్రవారం. ఆ రోజు మహిళలంతా ఆష్టలక్ష్ముల అనుగ్రహం కోసం వరలక్ష్మీ వ్రతాన్ని భక్తి శ్రద్దలతో ఆచరిస్తారు. శ్రీలక్ష్మికి బంగారు రంగు చీర అంటే మహా ప్రీతి. అందుకే వరలక్ష్మి వ్రతం ఆచరించే వారు బంగారు రంగు చీరను ధరించడం ఉత్తమం. 
 
ఈ చీరను ధరించి వరలక్ష్మీ వ్రతం ఆచరిస్తే సంపూర్ణంగా ఆ అమ్మవారి అనుగ్రహం పొంద వచ్చునని జోతిష్య పండితులు పేర్కొంటున్నారు. అలాగే పచ్చరంగు, గులాబీ రంగు చీరలను కూడా ధరించవచ్చు. అయితే ఈ వ్రతమాచరించే వేళ.. నలుపు, నీలం, బూడిద రంగుల్లో ఉండే చీరలు మాత్రం ధరించవద్దని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. 
 
వరలక్ష్మీ వ్రతం చేసే వారు వ్రత నియమాలను పాటించాలి. పూజా సామాగ్రి, పసుపు గణపతిని, అక్షింతలను, తోరాలను ముందే సిద్ధం చేసుకొని పూజకు ఉపక్రమించాలి. అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించి, అమ్మవారికి ఇష్టమైన పిండివంటలను నైవేద్యంగా సమర్పించాలీ. పూజ ముగిశాక ముత్తయిదువులకు పసుపు, కుంకుమలను ఇచ్చి, పండు తాంబూలంతో ఆశీర్వాదం తీసుకుని పూజను పూర్తి చెయ్యాలి. 
 
ఎప్పుడూ వరలక్ష్మీ వ్రత కలశాన్ని వెండి ప్లేట్‌లో కానీ, రాగి ప్లేట్లలో కానీ ఏర్పాటు చేసుకోవాలి. ఏ పూజకైనా గణపతే మొదలు, అలాగే ఇక వరలక్ష్మీ వ్రతం నాడు ముందు పసుపు గణపతిని పూజ చేసిన తర్వాతనే, లక్ష్మీదేవి పూజ చెయ్యాలని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.