బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Raman
Last Modified: శనివారం, 7 అక్టోబరు 2017 (22:21 IST)

8-10-2017 నుంచి 14-10-2017 వరకూ మీ వార రాశి ఫలితాలు (వీడియో)

కర్కాటకంలో రాహువు, సింహంలో శుక్ర, కుజులు, కన్యలో రవి, బుధులు, తులలో బృహస్పతి, వృశ్చికంలో శని, మకరంలో కేతువు, మేష, వృషభ, మిథున, కర్కాటకంలో చంద్రుడు. 9, 13న కుజుడు కన్య యందు, బుధుడు తుల యందు ప్రవేశం. 9 సంకటహర చతుర్థి. 12 నుంచి గురు మౌఢ్యమి ప్రారంభం.

కర్కాటకంలో రాహువు, సింహంలో శుక్ర, కుజులు, కన్యలో రవి, బుధులు, తులలో బృహస్పతి, వృశ్చికంలో శని, మకరంలో కేతువు, మేష, వృషభ, మిథున, కర్కాటకంలో చంద్రుడు. 9, 13న కుజుడు కన్య యందు, బుధుడు తుల యందు ప్రవేశం. 9 సంకటహర చతుర్థి. 12 నుంచి గురు మౌఢ్యమి ప్రారంభం. 
 
మేషం : అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం.  
ఈ వారం వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. ఆత్మీయులకు చక్కని సలహాలిస్తారు. మీ శ్రీమతి వైఖరి సంతోషపరుస్తుంది. ఆర్థికస్థితి గతం కంటె మెరుగ్గా ఉంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. రసీదులు, పత్రాలు జాగ్రత్త. ఎవరినీ అతిగా నమ్మవద్దు. కొంతమంది తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. కార్యసాధనకు ఓర్పుతో శ్రమించాలి. సమర్థతకు నిదానంగా గుర్తింపు లభిస్తుంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. వేడుకల్లో పాల్గొంటారు. బంధువుల అతిథి మర్యాదలు ఆకట్టుకుంటాయి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులు వుండవు. శుభకార్యానికి యత్నాలు ప్రారంభిస్తారు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు.  
పెట్టుబడులపై దృష్టి సారిస్తారు. రుణ బాధలు తొలగిపోతాయి. ఖర్చులు సామాన్యం. మానసికంగా కుదుటపడతారు. గృహ వాతావరణం సంతృప్తినిస్తుంది. పెద్దమొత్తం నగదు సాయం క్షేమం కాదు. ఆత్మీయుల సలహా పాటించండి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆది, సోమవారాల్లో పనుల సానుకూలతకు మరింతగా శ్రమించాలి. ఆహ్వానాలు అందుకుంటారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారులకు హోదా మార్పు, పనిభారం. సహోద్యోగులతో జాగ్రత్త. కిట్టని వారు ఇబ్బంది పెట్టే ఆస్కారం ఉంది. వృత్తుల వారికి సామాన్యం. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. భాగస్వామిక చర్చలు ఫలిస్తాయి. దైవదీక్షలు స్వీకరిస్తారు. ప్రయాణం సజావుగా సాగుతుంది. 
 
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు 
అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మొహమ్మాటాలు, ఒత్తిళ్లకు లొంగవద్దు. మీ ఇష్టాయిష్టాలను సున్నితంగా వ్యక్తం చేయండి. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. పదవులు, టెండర్లు దక్కకపోవచ్చు. ఆశాభావంతో యత్నాలు సాగించండి. నేటి కంటె రేపు అనుకూలం. పరిచయం లేని వారితో జాగ్రత్త. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. బుధవారాల్లో కావలసిన వ్యక్తుల కలయిక అనుకూలించదు. పనులు హడావుడిగా సాగుతాయి. గృహ మార్పులు, చేర్పులకు అనుకూలం. సంతానం అత్యుత్సాహం చికాకు పరుస్తుంది. సౌమ్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. వ్యాపారాల్లో ఆటంకాలను ధీటుగా ఎదుర్కొంటారు. సరుకు నిల్వలో జాగ్రత్త. పారిశ్రామిక రంగాల వారికి ప్రోత్సాహకరం. స్థిరాస్తి క్రయ విక్రయంలో పునరాలోచన అవసరం. క్రీడాకారులకు ఆశాభంగం.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష 
దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ వహిస్తారు. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. శుభకార్యం నిశ్చయమవుతుంది. పనులు సానుకూలమవుతాయి. వ్యతిరేకులు చేరువవుతారు. గురు, శుక్రవారాల్లో ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలబడదు. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. విలువైన వస్తువులు జాగ్రత్త. ఉద్యోగస్తులకు యూనియన్‌లో గుర్తింపు లభిస్తుంది. సహోద్యోగులతో ఉల్లాసంగా గడుపుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి. ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. వాగ్ధాటితో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. ఆస్తి వివాదాలు కొలిక్కివస్తాయి.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం.  
ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఖర్చులు భారమనిపించవద్దు. పనులు సకాలంలో పూర్తి కాగలవు. కుటుంబ, ఆర్థిక ఇబ్బందులు సర్దుకుంటాయి. ఆందోళన తొలగుతుంది. సమర్థతతో రాణిస్తారు. గృహమార్పు యత్నం సత్ఫలితాన్నిస్తుంది. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. శనివారం నాడు వాగ్వాదాలకు దూరంగా వుండాలి. అయిన వారే మీ వైఖరిని తప్పుపడతారు. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. ఆత్మీయుల రాక సంతోషపరుస్తుంది. వేడుకల్లో ప్రముఖంగా పాల్గొంటారు. ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ప్రతి విషయం స్వయంగా తెలుసుకోవాలి. వ్యాపారాభివృద్ధికి పథకాలు అమలు చేస్తారు. పెట్టుబడులు లాభిస్తాయి. వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త.
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు. 
ఖర్చులు అంచనాలను మించుతాయి. ఇతరులతో పోల్చుకుని నిరుత్సాహం చెందుతారు. కష్టపడినా ఫలితం ఉండదు. ఓర్పుతో వ్యవహరించాలి. ఆది, సోమవారాల్లో గత తప్పిదాలు పునరావృతమయ్యే సూచనలున్నాయి. పనులు హడావుడిగా సాగుతాయి. శుభకార్యాల్లో మొక్కుబడిగా పాల్గొంటారు. ఆలోచనలు పలు విధాలుగా వుంటాయి. సన్నిహితుల కలయిక ఉపశమనం ఇస్తుంది. దంపతుల మధ్య అకారణ కలహం, చికాకులు తలెత్తుతాయి. ఆరోగ్యం నిలకడగా వుంటుంది. బంధువుల వ్యాఖ్యలు ఆలోచింపచేస్తాయి. వ్యాపారాభివృద్ధికి మరింతగా శ్రమించాలి. పెట్టుబడుల విషయంలో తొందరపాటు తగదు. టెండర్లు, ఏజెన్సీల వ్యవహారాల్లో ప్రతికూలతలెదుర్కుంటారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు ఏమంత సంతృప్తినీయవు.
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు.  
శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. మీ మాటే నెగ్గాలనే పంతం తగదు. మీ శ్రీమతి సలహా పాటించండి. లౌక్యంగా వ్యవహరించాలి. ఆత్మీయుల ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. అవసరాలు వాయిదా వేసుకుంటారు. మంగళ, బుధవారాల్లో పట్టుదలతో శ్రమించిన గాని పనులు పూర్తి కావు. సంతానం భవిష్యత్తుపై మరింత శ్రద్ధ అవసరం. పూర్వ విద్యార్థులను కలుసుకుంటారు. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు. అధికారులకు బాధ్యతల మార్పు, ఆకస్మిక స్థానచలనం. ప్రకటనలను విశ్వసించవద్దు. వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి నెలకొంటుంది. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట. 
మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. ముందుచూపుతో తీసుకున్న నిర్ణయం ఫలిస్తుంది. శుభకార్యానికి ముమ్మరంగా యత్నాలు సాగిస్తారు. ఒక వ్యవహారం ఆదాయంపై ప్రభావం చూపుతుంది. ధననష్టం, మానసిక అశాంతి నెలకొంటాయి. ఆర్థిక నిపుణులతో సంప్రదింపులు జరుపుతారు. ఆది, గురువారాల్లో పనుల సానుకూలతకు మరింతగా శ్రమించాలి. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. స్థిరాస్తి క్రయ విక్రయంలో పునరాలోచన అవసరం. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. సొంత పరిజ్ఞానంతో మందులు వేసుకోవద్దు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆకర్షణీయమైన పథకాలతో ఆకట్టుకుంటారు. విలువైన వస్తువులు జాగ్రత్త. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. సభ్యత్వాలు, దైవదీక్షలు స్వీకరిస్తారు. ప్రయాణం సజావుగా సాగుతుంది.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం.  
అన్ని రంగాల వారికీ ఆశాజనకమే. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఖర్చులు పెరిగినా ధనానికి ఇబ్బంది ఉండదు. ఆత్మీయులకు ముఖ్య సమాచారం అందిస్తారు. కొన్ని పనులు ఆకస్మికంగా పూర్తవుతాయి. అవగాహన లేని విషయాలకు దూరంగా ఉండాలి. ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. మంగళ, బుధవారాల్లో భేషజాలు, మొహమ్మాటాలకు పోవద్దు. గత తప్పిదాలు పునరావృతమయ్యే సూచనలున్నాయి. కుటుంబీకుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. పరిచయాలు ఉన్నతికి దోహదపడతాయి. పదవులు, బాధ్యతలు స్వీకరిస్తారు. ఉద్యోగస్తులు శుభవార్త వింటారు. నిరుత్సాహం వీడి ఉద్యోగయత్నం సాగించండి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. సన్మాన, సాహిత్య సభల్లో పాల్గొంటారు.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు.
వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. ఎదుటివారి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి. శుభకార్యాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. బంధువుల ఆదరణ సంతృప్తినిస్తుంది. విలువైన కానుకలు చదివించుకుంటారు. ఖర్చులు విపరీతం. అవసరాలు, కోరికలు నెరవేరుతాయి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. శ్రీమతి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. కొత్త సమస్యలు ఎదురయ్యే సూచనలున్నాయి. గురు, శుక్రవారాల్లో అప్రమత్తంగా వ్యవహరించండి. ప్రకటనల పట్ల అవగాహన ప్రధానం. దళారులను విశ్వసించవద్దు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. గృహ నిర్మాణాలు వేగవంతమవుతాయి. వృత్తి ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. అధికారులకు మీపై గురి కుదురుతుంది. జూదాలు, బెట్టింగ్‌లకు దూరంగా వుండాలి.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు. శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు.  
వేడుకలను ఘనంగా చేస్తారు. మీ ఉన్నతిపై కొంతమంది అపోహపడే ఆస్కారం ఉంది. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. ఒక వ్యవహారంలో ధనం అందుతుంది. పనులు సకాలంలో పూర్తవుతాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. కుటుంబీకుల మధ్య అవగాహన నెలకొంటుంది. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. వ్యవహారాలతో హడావుడిగా ఉంటారు. తొందరపడి హామీలివ్వవద్దు. కొంతమంది మీ ఆలోచనలను నీరుగార్చేందుకు యత్నిస్తారు. గుట్టుగా యత్నాలు సాగించండి. శనివారం నాడు ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. వ్యాపారాల్లో లాభాలు, అనుభవం గడిస్తారు. పెట్టుబడులు, పొదుపు పథకాలు లాభిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. సాంకేతిక, వైద్య, న్యాయ రంగాల వారికి ఆశాజనకం. కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు.
 
మీనం : పూర్వాభాద్ర 4వ పాదం. ఉత్తరాభాద్ర, రేవతి. 
ఈ వారం ఖర్చులు విపరీతం. ధనమూలక సమస్యలు ఎదురవుతాయి. చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. ఆప్తుల సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. శ్రమాధిక్యత మినహా ఫలితం ఉండదు. ఎదుటి వారి వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. విజ్ఞతతో వ్యవహరించండి. విమర్శించిన వారే మీ ఔన్నత్యాన్ని గుర్తిస్తారు. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఒక ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. పోగొట్టుకున్న పత్రాలు తిరిగి పొందుతారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. ఆరోగ్యం సంతృప్తికరం. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. పెద్ద మొత్తం సరకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. సన్మాన, సాహిత్య సభల్లో పాల్గొంటారు. 
 
వీడియో చూడండి...