మిథునంలో శుక్రుడు, కర్కాటకంలో రవి, కుజులు, సింహంలో రాహువు, బుధులు, కన్యలో బృహస్పతి, వృశ్చికంలో వక్రి శని, కుంభంలో కేతువు. ధనస్సు, మకర, కుంభ, మీనంలో చంద్రుడు. 7న శ్రావణ పూర్ణిమ, చంద్ర గ్రహణం. శ్రవణా నక్షత్రం, మకర రాశి నందు గ్రహణం ఏర్పడుతున్నందున మకర రాశివారు ఈ గ్రహణాన్ని వీక్షించకుండా వుండటం మంచిది.
మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
ఆర్థిక లావాదేవీల్లో మెలకువ వహించండి. ఒకేసారి అనేక పనులతో సతమతమవుతారు. నోటీసులు, పత్రాలు అందుకుంటారు. శుభకార్యానికి ముమ్మరంగా యత్నాలు సాగిస్తారు. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. కుటుంబీకులతో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి. శనివారం నాడు ఆధిపత్యం ప్రదర్శించవద్దు. ఖర్చులు విపరీతం, ధనానికి ఇబ్బంది ఉండదు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాల నుంచి బయటపడతారు. సరకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగయత్నంలో నిరుత్సాహం తగదు. అధికారులకు కొత్త బాధ్యతలు, స్థానచలనం. విద్యార్థులకు ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. పదవులు, సభ్యత్వాల నుంచి తప్పుకుంటారు. వ్యవసాయ పనులు చురుకుగా సాగుతాయి. సామూహిక కార్యక్రమంలో పాల్గొంటారు.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు
సంప్రదింపులు కొలిక్కి వస్తాయి. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. స్వయంకృషితో రాణిస్తారు. బంధువులతో సంబంధాలు బలపడతాయి. సన్నిహితులకు ముఖ్య సమాచారం అందిస్తారు. ఆది, సోమవారాల్లో అనేక పనులతో సతమతమవుతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. సౌమ్యంగా బాకీలు వసూలు చేసుకోవాలి. ఎవరినీ నిందించవద్దు. దంపతుల మధ్య దాపరికం తగదు. మీ నుంచి విషయ సేకరణకు కొంతమంది యత్నిస్తారు. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. ప్రకటనలు, దళారుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలు, ఆటంకాలను ధీటుగా ఎదుర్కొంటారు. టెండర్లు, ఏజెన్సీలకు అనుకూలం. నిరుద్యోగులకు ఉపాధి పథకాలు కలిసివస్తాయి. శుభకార్యానికి హాజరవుతారు.
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2,3 పాదాలు
శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. మీ అతిథి మర్యాదలు ఆకట్టుకుంటాయి. మీ స్థితిగతులపై కొంతమంది అపోహపడే ఆస్కారం ఉంది. విమర్శలకు ధీటుగా స్పందిస్తారు. ఆదాయ, వ్యయాలు సంతృప్తికరం. దైవ, సేవా సంస్థలకు సాయం అందిస్తారు. అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. పనులు సకాలంలో పూర్తి కాగలవు. నగదు, వస్తువులు, పత్రాలు జాగ్రత్త. మంగళ, బుధవారాల్లో ఒక వ్యవహారంలో మీ జోక్యం అనివార్యం. పెట్టుబడులకు అనుకూలం. విదేశీ విద్యాయత్నం ఫలిస్తుంది. ఎరువుల వ్యాపారులకు ఆశాజనకం. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు ధనప్రలోభం తగదు. పరిచయం లేని వారితో జాగ్రత్త. వివాదాల పరిష్కార దిశగా సాగుతాయి. వైద్య, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి.
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. ఆహ్వానం అందుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. సంప్రదింపులు ఫలిస్తాయి. యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలు కలిసివస్తాయి. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. గృహమార్పు అనివార్యమవుతుంది. దంపతుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. ఖర్చులు సంతృప్తికరం. సకాలంలో వాయిదాలు చెల్లిస్తారు. ఆది, గురువారాల్లో నగదు స్వీకరణలో జాగ్రత్త. బాధ్యతలు, విద్యార్థులకు అత్యుత్సాహం తగదు. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. వ్యాపారాభివృద్ధికి పథకాలు అమలు చేస్తారు. చిరు వ్యాపారులకు ఆశాజనకం. వృత్తి నైపుణ్యం పెంచుకోవటానికి యత్నించండి.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఖర్చులు విపరీతం. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. కావలసిన వ్యక్తుల కలయిక సాధ్యం కాదు. ఆత్మీయుల ఆహ్వానం సందిగ్ధానికి గురిచేస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. అప్రమత్తంగా వ్యవహరించాలి. ఎవరి సాయం ఆశించవద్దు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. మంగళ, శనివారాల్లో ఎవరి సహాయం ఆశించవద్దు. విద్యార్థులకు ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. వృత్తి ఉపాధి పథకాలు అంతంత మాత్రంగా సాగుతాయి. వ్యాపారాల్లో నిలదొక్కుకుంటారు. భాగస్వామిక చర్చలు కొలిక్కి వస్తాయి. పారిశ్రామిక రంగాల వారికి ప్రోత్సాహకరం. వివాదాలు కొత్త మలుపు తిరుగుతాయి. న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతారు.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ప్రేమానుబంధాలు బలపడతాయి. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. కార్యసాధనకు అవిశ్రాంతంగా శ్రమించాలి. ఆందోళన కలిగించిన విషయం సద్దుమణుగుతుంది. మానసికంగా కుదుటపడతారు. గురు, శుక్రవారాల్లో పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. విలువైన పత్రాలు, నగదు జాగ్రత్త. ఒక సంఘటన తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. సంతానం భవిష్యత్తు పట్స శ్రద్ధ అవసరం. వేడుకల్లో పాల్గొంటారు. విత్తన, ఎరువుల వ్యాపారులకు పురోభివృద్ధి. ఉద్యోగయత్నంలో నిరుత్సాహం తగదు. మీ కృషి ఫలించే త్వరలోనే ఉంది. అధికారులు, ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. పరిచయం లేని వారితో జాగ్రత్త.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఖర్చులు సంతృప్తికరం. విలాసాలకు బాగా వ్యయం చేస్తారు. మీ మాటకు స్పందన వస్తుంది. పరిచయాలు, వ్యాపకాలు బలపడతాయి. బాధ్యతలు, వ్యవహారాలు స్వయం చూసుకోవాలి. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. కావలసిన పత్రాలు కనిపించక ఇబ్బంది పడతారు. శనివారం నాడు పనులు ముగింపు దశలో మందకొడిగా సాగుతాయి. పెట్టుబడుల విషయంలో నిర్ణయానికి రాగలుగుతారు. వ్యాపారుల లాభసాటిగా సాగుతాయి. ఆటంకాలను ధీటుగా ఎదుర్కొంటారు. వృత్తి నైపుణ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగయత్నంలో నిరుత్సాహం తగదు. అధికారులకు హోదా మార్పు, స్థానచలనం. దైవకార్య సమావేశాలు, వేడుకల్లో పాల్గొంటారు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట
ఈ వారం యత్నాలకు పరిస్థితులు అనుకూలిస్తాయి. ముఖ్యమైన వ్యక్తులను కలుసుకుంటారు. పనులు హడావుడిగా సాగుతాయి. వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. సముచిత నిర్ణయం తీసుకుంటారు. పెట్టుబడులకు అనుకూలం. శుభకార్యాలకు హాజరవుతారు. మీ రాక బంధువులకు సంతోషాన్నిస్తుంది. ఖర్చులు అంచనాలను మించుతాయి. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. కార్యక్రమాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. ఉద్యోగ బాధ్యతల్లో ఆటంకాలు తొలగిపోతాయి. సహోద్యోగులతో జాగ్రత్త. వృత్తుల వారికి ప్రజాసంబంధాలు బలపడతాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. విదేశీ విద్యాయత్నంలో మెలకువ వహించండి. ప్రకటనలు, దళారులను విశ్వసించవద్దు.
ధనస్సు : మూల, పూర్వాషాఢ 1వ పాదం
ఆహ్వానాలు అందుకుంటారు. పనుల సానుకూలతకు మరింతగా శ్రమించాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. సంతానం అత్యుత్సాహాన్ని అదుపు చేయండి. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. సోదరీ సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి వ్యాఖ్యలు మనస్తాపం కలిగిస్తాయి. ఓర్పుతో మెలగండి. ఎవరినీ నిందించవద్దు. ఆక్షేపించిన వారే మీ ఔన్నత్యాన్ని గుర్తిస్తారు. ఖర్చులు అధికం. ప్రయోజనకరం. ధనానికి ఇబ్బంది ఉండదు. పరిచయస్తులు ధనసహాయం అర్ధిస్తారు. పెద్ద మొత్తం సాయం శ్రేయస్కరం కాదు. ఉద్యోగయత్నం ఫలిస్తుంది. వ్యాపారాల్లో ఆటంకాలను ధీటుగా ఎదుర్కొంటారు. మార్కెట్ రంగాల వారికి మార్పులు అనుకూలిస్తాయి. దైవ, పుణ్యకార్యాల్లో పాల్గొంటారు. ప్రయాణంలో అవస్థలు తప్పవు.
మకరం : ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ధనమూలక సమస్యలెదురవుతాయి. సాయం చేసేందుకు అయిన వారే సందేహిస్తారు. ఆత్మీయుల సాయం అందుతుంది. మానసిక కుదుటపడతారు. పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించండి. తొందరపాటు వల్ల నష్టపోయే ఆస్కారం ఉంది. పనులు అనుకున్న విధంగా సాగవు. మంగళ, బుధవారాల్లో అనవసర విషయాల్లో జోక్యం తగదు. పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. గృహమార్పునకు యత్నాలు సాగిస్తారు. శుభకార్యంలో బంధువుల వైఖరి కష్టమనిపిస్తుంది. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ప్రస్తు వ్యాపారాలే శ్రేయస్కరం. వృత్తి నైపుణ్యం పెంచుకోవడానికి యత్నంచండి. సాంకేతిక రంగాల వారికి చికాకులు అధికం.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు
కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెందుతారు. స్థిమితంగా ఉండేందుకు యత్నించండి. అతిగా ఆలోచించవద్దు. పనులు ముగింపు దశలో మందకొడిగా సాగుతాయి. ఖర్చులు విపరీతం. అదనపు రాబడిపై దృష్టి సారిస్తారు. మంగళ, బుధవారాల్లో అనవసర విషయాల్లో జోక్యం తగదు. బంధువుల వ్యాఖ్యలు మనస్తాపం కలిగిస్తాయి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. అవివాహితుల్లో ఉత్సాహం నెలకొంటుంది. శుభకార్యాలకు హాజరవుతారు. విదేశీ విద్యాయత్నం ఫలిస్తుంది. వ్యాపారాభివృద్ధికి మరింతగా శ్రమించాలి. మీ పథకాలు, ప్రణాళికలు మునుముందు సత్ఫలితాలిస్తాయి. ఉద్యోగయస్తులకు ఒత్తిడి, పనిభారం. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
మీనం : పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
శుభకార్య యత్నం ఫలిస్తుంది. నిశ్చితార్థాల్లో మెలకువ వహించండి. స్థోమతకు మించి హామీలివ్వవద్దు. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. పరిచయాలు, బంధుత్వాలు మెరుగుపడతాయి. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ధనానికి ఇబ్బంది వుండదు. ఆత్మీయులకు సాయం అందిస్తారు. గురు, శుక్రవారాల్లో తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. కార్యక్రమాలు వాయిదా పడతాయి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. ఉద్యోగ ప్రకటనల వల్ల అవగాహన ప్రధానం. తొందరపడి చెల్లింపులు జరుపవద్దు. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకోండి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. పెట్టుబడులు, పొదుపు పథకాలకు అనుకూలం. వీడియో...