మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : శనివారం, 28 సెప్టెంబరు 2019 (17:25 IST)

29-09-2019 నుంచి 05-10-2019 వరకు మీ రాశి ఫలితాలు(Video)

మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. కొత్త పరిచయాలేర్పడతాయి. విమర్శలకు దీటుగా స్పందిస్తారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. ఖర్చులు విపరీతం. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆది, సోమ వారాల్లో పనులు మందకొడిగా సాగుతాయి. గృహం సందడిగా ఉంటుంది. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. ఆసక్తికరమైన విషయాలు తెలుసు కుంటారు. అవకాశాలు కలిసివస్తాయి. సంప్రదింపులకు అనుకూలం. మీ అభిప్రాయాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. ఒత్తిళ్లు, మొహమ్మాటాలకు లొంగవద్దు. పెద్దల సలహా పాటించండి. సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ అవసరం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పెట్టుబడులపై దృష్టి పెడతారు. ఉద్యోగస్తులకు ధనలాభం. అధికారులకు హోదా మార్పు. దైవదర్శనంలో అవస్థలు తప్పవు.
 
వృషభం: కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు.
ఆర్థిక లావాదేవీలతో తీరిక ఉండదు. వ్యవహారానుకూలత ఉంది. అనుకున్నది సాధిస్తారు. గృహమార్పు కలిసివస్తుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. పనులు సకాలంలో పూర్తి కాగలవు. ఖర్చులు అంచనాలను మించుతాయి. పొదుపు ధనం గ్రహిస్తారు. డబ్బు డ్రా చేసేటపుడు జాగ్రత్త. బుధవారం నాడు కొత్తవారిని విశ్వసించవద్దు. ఆరోగ్యం కుదుటపడుతుంది. దంపతులకు కొత్త ఆలోచనలొస్తాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. ముఖ్యుల కలయిక సాధ్యం కాదు. కార్యక్రమాల్లో మార్పులుంటాయి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. దీక్షలు స్వీకరిస్తారు. ఆత్మీయుల కలయికు ఉత్సాహాన్నిస్తుంది. ఉద్యోగస్తులకు శుభయోగం. పట్టుదలతో ఉద్యోగయత్నం సాగించండి. వ్యాపారాల్లో ఆటంకాలను దీటుగా ఎదుర్కుంటారు. హోల్‌సేల్ వ్యాపారులకు ఆదాయాభివృద్ధి.
 
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు. 
అనుకూలతలున్నాయి. లక్ష్యాన్ని సాధిస్తారు. ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఉత్సాహంగా గడుపుతారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. విలాసాలకు వ్యయం చేస్తారు. ధనసహాయం తగదు. మీ అభిప్రాయాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. ఎవరినీ తక్కవ అంచనా వేయొద్దు. గురు, శుక్ర వారాల్లో ఊహించని సంఘటనలెదురవుతాయి. పరిచయంలేని వారితో జాగ్రత్త. వ్యవహాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. సన్నిహితులకు చక్కని సలహాలిస్తారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఆధ్యాత్మికభావం పెంపొందుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి. అధికారులకు ఒత్తిడి, పనిభారం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నిర్మాణాలకు అనుమతులు మంజూరవుతాయి. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు.
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష.
గృహమార్పు కలిసివస్తుంది. అనుకున్నది సాధిస్తారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. రుణ సమస్యలు కొలిక్కి వస్తాయి. మానసికంగా కుదుటపడతారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. పనుల్లో ఒత్తిడి అధికం. మొండిగా వ్యవహరిస్తారు. బంధువులతో విభేదాలు తలెత్తుతాయి. శనివారం నాడు మాటతీరు అదుపులో ఉంచుకోవాలి. ఎవరినీ నొప్పించవద్దు. సౌమ్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. సంతానానికి ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు సంభవం. ప్రముఖులను కలుసుకుంటారు. ప్రారంభోత్సవాలకు అనుకూలం. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. కొనుగోలుదారులను ఆకట్టుకుంటారు. ఉద్యోగస్తులకు యూనియన్‌లో గుర్తింపు లభిస్తుంది. ప్రశంసలు, సత్కారాలు అందుకుంటారు.
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం.
సమస్యలకు తాత్కాలిక పరిష్కారం లభిస్తుంది. ఆందోళన తొలగి కుదుటపడతారు. అవకాశాలు కలిసివస్తాయి. మాటతీరుతో ఆకట్టుకుంటారు. పరిచయాలు బలపడతాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. ఆది, సోమ వారాల్లో పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. దంపతుల మధ్య దాపరికం తగదు. ఖర్చులు విపరీతం. అవసరాలు అతికష్టంమ్మీద నెరవేరుతాయి. సంతానం అత్యుత్సాహాన్ని అదుపు చేయండి. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. ఆశించిన పదవులు దక్కకపోవచ్చు. ఓర్పుతో వ్యవహరించండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. వ్యాపారాల్లో ఆటంకాలను అధిగమిస్తారు. మీ పథకాలు సత్ఫలితాలిస్తాయి. నిరుద్యోగులకు నిరుత్సాహం. ఉద్యోగస్తులకు పనిభారం. దైవ దర్శనాలు సంతృప్తినిస్తాయి.
 
కన్యారాశి : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు. 
పట్టుదలతో యత్నాలు సాగించండి. నిరుత్సాహం తగదు. సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది. మనోధైర్యంతో వ్యవహరించాలి. అవకాశాలు చేజారినా ఒకందుకు మంచిదే. త్వరలో స్థిరంగా ఉంటుంది. పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు సాగవు. మీపై శకునాల ప్రభావం అధికం. ఆత్మీయుల హితవు మీపై మంచి ప్రభావం చూపుతుంది. సంతానం విజయం ఉత్సాహాన్నిస్తుంది. వ్యాపకాలు సృష్టించుకుంటారు. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి కలుగుతుంది. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. చిరువ్యాపారులకు ఆదాయాభివృద్ధి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. వేడుకలు, వినోదాల్లో పాల్గొంటారు. కళాకారులకు ప్రోత్సాహకరం.
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు.
కొత్త సమస్యలెదురవుతాయి. అప్రమత్తంగా ఉండాలి. ఆలోచనలు నిలకడగా ఉండవు. సన్నిహితులతో సంప్రదింపులు జరుపుతారు. ఏకపక్ష నిర్ణయాలు తగవు. ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. పనులతో సతమతమవుతారు. ఆత్మీయుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. దంపతుల మధ్య అవగాహన లోపం. చీటికి మాటికి అసహనం చెందుతారు. ఈ ఇబ్బందులు తాత్కాలికమే. క్రమంగా పరిస్థితులు మెరుగుపడతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి కలుగుతుంది. దీక్షలు స్వీకరిస్తారు. నిర్మాణాలు ఊపందుకుంటాయి. వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధిగమిస్తారు. ఉద్యోగస్తులకు అనుకూల ఫలితాలున్నాయి. ఏజెన్సీలు, కాంట్రాక్టులు దక్కకపోవచ్చు. వాహన చోదకులకు అత్యుత్సాహం తగదు. ప్రయాణంలో చికాకులు తప్పవు.
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట.
ఈ వారం పరిస్థితులు మెరుగుపడతాయి. ధనలాభం ఉంది. సమర్థతను చాటుకుంటారు. పరిచయాలు బలపడతారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. దైవకార్యాలకు వ్యయం చేస్తారు. మీ జోక్యం అనివార్యం. ఆప్తులకు చక్కని సలహాలస్తారు. పనులు ముగింపు దశలో హడావుడిగా సాగుతాయి. ప్రముఖుల సందర్శనం సాధ్యపడదు. పోగొట్టుకున్న పత్రాలు సంపాదిస్తారు. సంతానం విదేశీ విద్యాయత్నం ఫలించదు. వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. పెట్టుబడులపై దృష్టి పెడతారు. ధనసహాయం తగదు. ఉద్యోగస్తులకు పదవీయోగం. ధనలాభం, ప్రశంసలు, పురస్కారాలు అందుకుంటారు. వ్యాపారాల్లో పురోభివృద్ధి, అనుభవం గడిస్తారు. కళాకారులకు ప్రోత్సాహకరం. 
 
ధనస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. 
మనోధైర్యంతో వ్యవహరిస్తారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. సలహాలు, సాయం ఆశించవద్దు. ఊహించిన ఖర్చులే ఉంటాయి. ధనానికి ఇబ్బంది ఉండదు. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. బంధువులు ధనసాయం అర్థిస్తారు. కొంత మొత్తం సాయం అందించండి. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ ఇష్టాయిష్టాలను కచ్చితంగా తెలియజేయండి. ఆరోగ్యం మందగిస్తుంది. విశ్రాంతి అవసరం. అతిగా శ్రమించవద్దు. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సమాచారం నిరుత్సాహపరుస్తుంది. పత్రాలు, వస్తువులు జాగ్రత్త. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. దైవదర్శనంలో అవస్థలు తప్పవు. కళాకారులకు సన్మానయోగం.
 
మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు.
ఆర్థికస్థితి సంతృప్తికరం. కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఆందోళన తొలగి కుదుటపడతారు. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. పనులు సానుకూలమవుతాయి. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. చెల్లింపుల్లో జాగ్రత్త. గురు, శుక్ర వారాల్లో ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. బాధ్యతగా వ్యవహరించాలి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. ఆంతరింగిక విషయాలు గోప్యంగా ఉంచండి. విమర్శలు, అభియోగాలకు దీటుగా స్పందిస్తారు. పొదుపు పథకాలు లభిస్తాయి. పెట్టుబడులకు అనుకూలం. ప్రారంభోత్సవాలకు అనుకూలం. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు సంతృప్తినీయవు. న్యాయ, సేవా రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. సేవా, పుణ్య కార్యంలో పాల్గొంటారు.
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు.
శ్రమాధిక్యత మినహా ఫలితం ఉండదు. అవకాశాలు చేజారిపోతాయి. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. మనోధైర్యంతో ముందుకు సాగండి. యత్నాలు విరమించుకోవద్దు. సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది. శనివారం నాడు అనేక పనులతో సతమతమవుతారు. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు. నోటీసులు అందుతాయి. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. ఊహించిన ఖర్చులే ఉంటాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. రశీదులు జాగ్రత్త. శంకుస్ధాపనలు, ప్రారంభోత్సావాలకు అనుకూలం. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. సహోద్యోగుల సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. వ్యాపారాల్లో ఆటంకాలు తొలుగుతాయి. వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు. దైవదర్శనం సంతృప్తినిస్తుంది. వాహనం నడిపేటపుడు జాగ్రత్త.
 
మీనం: పూర్వాభాద్ర 4వ పాదం. ఉత్తరాభాద్ర, రేవతి.
ప్రతికూలతలు అధికం. మీ నమ్మకం నిరుత్సాహపరుస్తుంది. పనులు ముందుకు సాగవు. పెద్ద ఖర్చు తగిలే సూచనలున్నాయి. పొదుపు ధనం గ్రహిస్తారు. ఆది, సోమ వారాల్లో దంపతుల మధ్య సఖ్యత లోపం. ఆలోచనలు నిలకడగా ఉండవు. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు అభ్యంతరాలెదురవుతాయి. ఓర్పుతో వ్యవహరించాలి. పెద్దల ప్రమేయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. ఆత్మీయులను కలుసుకుంటారు. సంతానం భవిష్యత్తుపై మరింత శ్రద్ధ అవసరం. ఆరోగ్యం సంతృప్తికరం. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. సరుకు నిల్వలో జాగ్రత్త. పెట్టుబడులకు తరుణం కాదు. మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి అధికం. ఉద్యోగయత్నంలో నిరుత్సాహం తగదు. దైవదర్శనంలో అవస్థలెదుర్కుంటారు. కళాకారులకు ప్రోత్సాహకరం.