ఆదివారం, 26 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Modified: శనివారం, 11 మే 2019 (19:08 IST)

12-05-2019 నుంచి 18-05-2019 వరకూ మీ వార రాశి ఫలితాలు(Video)

మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం 
ఈ వారం ఆశాజనకం. కష్టం ఫలిస్తుంది. ఆందోళన తగ్గి కుదుటపడతారు. ఆహ్వానం అందుకుంటారు. ఖర్చులు విపరీతం. ధనానికి ఇబ్బంది ఉండదు. ఊహించిన ఖర్చులే ఉంటాయి. ఓర్పుతో పనులు పూర్తి చేస్తారు. సంప్రదింపులు ఫలిస్తాయి. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. పరిచయం లేని వారితో జాగ్రత్త. ఆర్థిక విషయాలు వెల్లడించవద్దు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. పరిచయాలు బలపడతాయి. సంతానం చదువులపై దృష్టి పెడతారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. అధికారులకు పనిభారం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి. బెట్టింగ్‌ల జోలికి పోవద్దు. ప్రయాణంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు.
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు 
అప్రమత్తంగా వుండాలి. కొత్త సమస్యలు తలెత్తుతాయి. ఖర్చులు అధికం. రాబడిపై దృష్టి పెడతారు. సన్నిహితుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. పనులు హడావుడిగా సాగుతాయి. ముఖ్యమైన పత్రాలు సమయానికి కనిపించవు. స్థిమితంగా వుండేందుకు యత్నించండి. మీ అశక్తతను కుటుంబీకులు అర్థం చేసుకుంటారు. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. ఆశావహ దృక్పథంతో ప్రయత్నాలు సాగించండి. త్వరలో శుభవార్తలు వింటారు. సంతానం పై చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలు భర్తీ చేసుకుంటారు. చిరువ్యాపారులకు ఆదాయాభివృద్ధి. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు. పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి.
 
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు 
సంప్రదింపులు నిరుత్సాహపరుస్తాయి. ఓర్పు, ఏకాగ్రత ప్రధానం. పంతాలకు పోవద్దు. లౌక్యంగా పనులు చక్కబెట్టుకోవాలి. ఖర్చులు అదుపులో వుండవు. సాయం చేసేందుకు అయిన వారే సందేహిస్తారు. అవసరాలు అతికష్టంమీద తీరుతాయి. సోమ, మంగళవారాల్లో ముఖ్యుల సందర్శన వీలుకాదు. ఆప్తుల కలయికతో కుదుటపడతారు. ఒక ఆహ్వానం ఆలోచింప చేస్తుంది. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి అవకాశమివ్వవద్దు. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. కొన్ని విషయాలపై ఆసక్తి కలుగుతుంది. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం, సహోద్యోగులతో వేడుకల్లో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సరుకు నిల్వలో జాగ్రత్త. విద్యార్థులకు అత్యుత్సాహం తగదు. వాహనం ఇతరులకిచ్చి ఇబ్బందులెదుర్కుంటారు.
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష 
శుభకార్యం నిర్విఘ్నంగా పూర్తవుతుంది. బంధుత్వాలు బలపడతాయి. సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు. గృహం సందడిగా ఉంటుంది. ఆందోళన తొలగి కుదుటపడతారు. నగదు, ఆభరణాలు జాగ్రత్త. బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు. వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. బుధ, గురువారాల్లో అవాంతలెదురవుతాయి. పట్టుదలతో ముందుకు సాగండి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. మీ సలహా ఎదుటివారికి అనుకూలిస్తుంది. ఆరోగ్యం జాగ్రత్త. సంతానం దూకుడును అదుపు చేయండి. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. హోల్‌సేల్ వ్యాపారులకు ఆదాయాభివృద్ధి. వృత్తుల వారికి సామాన్యం. స్టాక్ మార్కెట్ రంగాల వారికి ఆశాజనకం. షేర్ల క్రయ విక్రయాలకు అనుకూలం. 
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం 
ఆదాయానికి తగినట్లు ఖర్చులుంటాయి. వాగ్ధాటితో రాణిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. సమర్థతకు మంచి గుర్తింపు లభిస్తుంది. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. శుక్ర, శనివారాల్లో అప్రమత్తంగా వుండాలి. సందేశాలను విశ్వసించవద్దు. ఆంతరంగిక విషయాలు గోప్యంగా వుంచండి. గృహమార్పు కలిసి వస్తుంది. వేడుకల్లో పాల్గొంటారు. మీ రాక అయిన వారికి సంతృప్తినిస్తుంది. దంపతులకు కొత్త ఆలోచనలు వస్తాయి. స్థిరాస్తి కొనుగోలు దిశగా యత్నాలు సాగిస్తారు. చెల్లింపుల్లో మెలకువ వహించండి. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో మార్పులుంటాయి. అధికారులకు పనిభారం, విశ్రాంతి లోపం. వ్యాపారాలు పురోగతిన సాగుతాయి. కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ప్రముఖులకు వీడ్కోలు పలుకుతారు.
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. కొత్త ప్రయత్నాలు ప్రారంభిస్తారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. ఆరోగ్యం పట్ల అశ్రద్ధ తగదు. సోమవారాల్లో పనులు ఆగవు. ఆశావహ దృక్పథంతో మెలగండి. పోగొట్టుకున్న పత్రాలు సంపాదిస్తారు. ఒక ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. పరిచయాలు బలపడతాయి. ఖర్చులు అధికం. ప్రయోజనకరం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పత్రాలు, రశీదులు జాగ్రత్త. సంతానం విజయం ఉత్సాహాన్నిస్తుంది. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. ఆత్మీయుల రాకతో కుదుటపడకారు, వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. ఉపాధ్యాయులకు ఒత్తిడి, శ్రమ అధికం. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ప్రయాణాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు 
 
తుల: చిత్త 3, 4 పాదాలు. స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు.
కుటుంబ విషయాల పట్ల శ్రద్ధ వహించాలి. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. బంధువులతో విబేధిస్తారు. మీ మాటతీరు అదుపులో వుంచుకోవాలి. ఖర్చులు అధికం. రుణాలు, చేబదుళ్లు స్వీకరిస్తారు. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. ఓర్పుతో యత్నాలు సాగించండి. మంగళ, బుధవారాల్లో ప్రతికూలతలు, చికాకులు అధికం. ఆప్తుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. సంతానం విజయం సంతృప్తినిస్తుంది. శుభకార్యానికి హాజరవుతారు. దంపతుల మధ్య అవగాహన నెలకొటుంది. పరిచయాలు బలపడతాయి. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు అనుకూలం. ఉపాధ్యాయులకు ఒత్తిడి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. బెట్టింగుల జోలికి పోవద్దు. ఆత్మీయులకు వీడ్కోలు పలుకుతారు. 
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 
ఆర్థికస్థితి సంతృప్తికరం. రుణ విముక్తులవుతారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. మాట నిలబెట్టుకుంటారు. గౌరవమర్యాదలు పెంపొందుతాయి. పనులు మొండిగా పూర్తిచేస్తారు. గురు, ఆదివారాల్లో అప్రమత్తంగా వుండాలి. బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు. సంతానం చదువులపై శ్రద్ధ వహిస్తారు. గృహం ప్రశాంతంగా వుంటుంది. పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు. లైసెన్సుల రెన్యువల్ అలక్ష్యం తగదు. ఆరోగ్యం మందగిస్తుంది. విశ్రాంతి అవసరం. కార్యక్రమాలు వాయిదా పడతాయి. సంతానం వైఖరి అసహనం కలిగిస్తుంది. అనునయంగా మెలగాలి. వేడుకల్లో పాల్గొంటారు. వృత్తుల వారికి సామాన్యం. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ప్రయాణాల్లో ఇబ్బందులు తప్పవు.
 
ధనస్సు: మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం.  
ఆదాయ వ్యయాలకు పొంతన వుండదు. ఖర్చులు విపరీతం. రాబడిపై దృష్టి పెడతారు. ఆలోచనలు పలు విధాలుగా వుంటాయి. ఆత్మీయుల హితవు మంచి ప్రభావం చూపుతుంది. శుక్ర, శనివారాల్లో పనులు మందకొడిగా సాగుతాయి. ప్రముఖుల కలయిక ఏమంత ఫలితం ఇవ్వదు. ఓర్పుతో యత్నాలు సాగించండి.  మీ కృషి త్వరలో ఫలిస్తుంది. పెట్టుబడుల సమాచారం సేకరిస్తారు. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. ఒక ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. షాపు పనివారలతో జాగ్రత్త. ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. స్పెక్యులేషన్ రంగాల వారికి ఆశాజనకం. షేర్ల విక్రయాలు లాభిస్తాయి. 
 
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు.  
వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. మీ సలహా ఎదుటివారిని ఆకట్టుకుంటుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఏజెన్సీలను విశ్వసించవద్దు. ప్రతి విషయం స్వయంగా తెలుసుకోవాలి. ఊహించిన ఖర్చులే వుంటాయి. పొదుపు ధనం అందుతుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ఆది, సోమవారాల్లో పనులు సాగవు. ఆప్తుల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. వేడుకల్లో పాల్గొంటారు. బంధువుల ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. వ్యాపార విస్తరణలకు అనుకూలం. భాగస్వామిక చర్చలు ఫలిస్తాయి. ఉద్యోగస్తుల సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. సాంకేతిక, రవాణా రంగాల వారికి పురోభివృద్ధి. వాహనం ఇతరులకు ఇవ్వడం క్షేమం కాదు. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు.
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు. శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు. 
కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. వ్యవహారానుకూలత వుంది. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. విమర్శలకు ధీటుగా స్పందిస్తారు. మీ మాటతీరు ఆకట్టుకుంటుంది. పనులు వేగవంతమవుతాయి. మంగళ, బుధవారాల్లో అనవసర జోక్యం తగదు. ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. ప్రియతముల ఆరోగ్యం కుదుటపడుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. ఉద్యోగస్కులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. సహోద్యోగులతో సత్సంబంధాలు నెలకొంటాయి. వృత్తుల వారికి సామాన్యం. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. సంస్థల స్థాపనకు అనుకూలం. సంతానం విజయం ఉత్సాహాన్నిస్తుంది. ప్రయాణం తలపెడతారు.
 
మీనం: పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి 
కార్యసాధనలో జయం. వ్యవహారానుకూలత ఉంది. అవకాశాలు కలిసివస్తాయి. ఖర్చులు అదుపులో వుండవు. విలాసాలకు వ్యయం చేస్తారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. గురు, శుక్రవారాల్లో నగదు, ఆభరణాలు జాగ్రత్త. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. బంధువులు మరింత చేరువవుతారు. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. సంతానం పై చదువులపై దృష్టి పెడతారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. సన్నిహితులతో సంప్రదింపులు జరుపుతారు. వృత్తి వ్యాపారాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. చిరు వ్యాపారులకు ఆదాయాభివృద్ధి. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. పుణ్యకార్యంలో పాల్గొంటారు.