మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Modified: శనివారం, 6 ఏప్రియల్ 2019 (21:42 IST)

07-04-2019 నుంచి 13-04-2019 వరకూ మీ వార రాశి ఫలితాలు(Video)

మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
శుభవార్త వింటారు. కష్టం ఫలిస్తుంది. ఆలోచనలు కార్యారూపం దాల్చుతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. ధనలాభం ఉంది. సంప్రదింపులకు అనుకూలం. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. గురు, శుక్ర వారాల్లో అప్రమత్తంగా ఉండాలి. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. సంతానం చదువులపై దృష్టి పెడతారు. పరిచయాలు అధికమవుతాయి. విద్యా ప్రకటనలను విశ్వసించవద్దు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. మీ జోక్యం అనివార్యం. ఆప్తులకు సాయం అందిస్తారు. ఉద్యోగ బాధ్యతల్లో మెళకువ వహించండి. ఒత్తిళ్లకు లొంగవద్దు. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పెట్టుబడులు, వ్యాపారాల విస్తరణలకు అనుకూలం. సాంకేతిక, వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు
అన్నిరంగాల వారికి ఆశాజనకమే. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. సలహాలు, సహాయం ఆశించవద్దు. శని, ఆది వారాల్లో పనులు హడావుడిగా సాగుతాయి. ముఖ్యమైన వ్యక్తులను కలుసుకుంటారు. ఆహ్వానం, పత్రాలు అందుతాయి. ఖర్చుల్ అధికం, సంతృప్తికరం. దైవకార్యాలకు విరాళాలు అందిస్తారు. శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. పెద్దల ఆరోగ్యం సంతృప్తికరం. సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతలు అధికమవుతాయి. ఉపాధ్యాయులకు ఒత్తిడి, శ్రమ అధికం. నిరుత్సాహం వీడి ఉద్యోగయత్నం సాగించండి. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. భాగస్వామిక చర్చలు ఫలిస్తాయి. వ్యాపారాల్లో పురోభివృద్ధి అనుభవం గడిస్తారు. సరుకు నిల్వలో జాగ్రత్త. ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.
 
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. సభ్యత్వాలు, బాధ్యతలు స్వీకరిస్తారు. గౌరవ ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. విలాసాలకు వ్యయం చేస్తారు. స్థిరాస్తి విక్రయంలో పునరాలోచన అవసరం. పెద్దల సలహా పాటించండి. పనులు మొండిగా పూర్తిచేస్తారు. సోమ, మంగళ వారాల్లో ఊహించని సంఘటనలెదురవుతాయి. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. సంతానం అత్యుత్సాహాన్ని అదుపు చేయండి. ఆత్మీయుల ఆహ్వానం ఆలోచింపచేస్తుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. 
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. రుణ ఇబ్బందులు తొలగుతాయి. ఖర్చులు సంతృప్తికరం. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఏజెన్సీలు, దళారులను విశ్వసించవద్దు. బుధవారం నాడు పనులు సాగవు. కుటుంబీకులతో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. తొందరపాటు నిర్ణయాలు తగవు. రశీదులు, ఆభరణాలు జాగ్రత్త. సంతానం ఉన్నత చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆత్మీయులను కలుసుకుంటారు. ఒక ఆహ్వానం ఆలోచింపచేస్తుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్పురిస్తాయి. గృహమార్పు కలిసివస్తుంది. వస్త్ర, ఫ్యాన్సీ, పచారీ వ్యాపారాలు ఊపందుకుంటాయి. చిరువ్యాపారులకు ఆశాజనకం. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. విందులు, వినోదాల్లో మితంగా వ్యవహరించండి.   
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
వ్యవహార జయం, వస్త్రప్రాప్తి, వాహన యోగం ఉన్నాయి. ఏ సమస్యనైనా దీటుగా ఎదుర్కుంటారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. గురు, శుక్ర వారాల్లో చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. పనులు వేగవంతమవుతాయి. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. కుటుంబీకుల ఆరోగ్యం మందగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా పడుతాయి. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. వృత్తుల వారి ఆదాయం బాగుంటుంది. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులకు అత్యుత్సాహం తగదు. క్రీడా, కళాకారులకు ప్రోత్సాహకరం. 
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
మీ మాటతీరు ఆకట్టుకుంటుంది. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. ఖర్చులు విపరీతం. రాబడిపై దృష్టి పెడతారు. పనులు సానుకూలమవుతాయి. శనివారం నాడు ప్రముఖుల సందర్శనం వీలుకాదు. వివాహ యత్నం ఫలిస్తుంది. ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. స్తోమతకు మించి హామీలివ్వవద్దు. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. నిర్మాణాలు, మరమ్మత్తులు ముగింపునకొస్తాయి. వేడుకను ఘనంగా చేస్తారు. మీ ఆతిధ్యం ఆకట్టుకుంటుంది. వృత్తి, ఉపాధి పథకాలు ప్రోత్సాహకరం. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు సంతృప్తినీయజాలవు. ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం. విశ్రాంతి లోపం. అధికారులకు ఆత్మీయ వీడ్కోలు పలుకుతారు. కళాకారులకు ఆదరణ లభిస్తుంది. దైవకార్యంలో పాల్గొంటారు.    
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఆర్థికంగా కుదుటపడుతారు. వ్యవహార ఒప్పందాలకు అనుకూలం. ఊహించిన ఖర్చులే ఉంటాయి. పెట్టుబడులపై దృష్టి పెడతారు. గృహంలో స్తబ్ధత తొలగుతుంది. ఆది, సోమ వారాల్లో అప్రమత్తంగా ఉండాలి. కొత్త వ్యక్తులను విశ్వసించవద్దు. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. పనులు సకాలంలో పూర్తికాగలవు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. సన్నిహితులను విందులకు ఆహ్వానిస్తారు. సంతానం దూకుడు అదుపు చేయండి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. ఉద్యోగస్తులకు పనిభారం, విశ్రాంతి లోపం. అధికారులకు ధనప్రలోభం తగదు. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.   
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ట
కొన్ని ఇబ్బందులు తొలగి కుదుటపడుతారు. వ్యవహారాలనుకూలత ఉంది. మొండిబాకీలు వసూలవుతాయి. ఖర్చులు విపరీతం. దైవకార్యాలకు వ్యయం చేస్తారు. పనులు వేగవంతమవుతాయి. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. మంగళ, బుధ వారాల్లో ప్రముఖుల సందర్శనం వీలుకాదు. మీపై శకునాల ప్రభావం అధికం. విమర్శలు, అభియోగాలకు దీటుగా స్పందిస్తారు. మీ నిజాయితీకి గుర్తింపు లభిస్తుంది. పోగొట్టుకున్న పత్రాలు సంపాదించేందుకు శ్రమిస్తారు. సంతానం పై చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. పట్టుదలకు పోవద్దు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. చిరువ్యాపారులకు ఆశాజనకం. 
 
ధనస్సు: మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం
ఈ వారం అనుకూలమే. ఆదాయానికి లోటుండదు. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. పనులు హడావుడిగా సాగుతాయి. శుభకార్యంపై దృష్టి పెడతారు. వివాహ ఏజెన్సీలు, దళారులను విశ్వసించవద్దు. గృహం సందడిగా ఉంటుంది. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఏ విషయాన్ని తేలికగా తీసుకోవద్దు. ఎదుటివారి ఆంతర్యం తెలుసుకోండి. ఏకపక్షంగా వ్యవహరించవద్దు. అవివాహితుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. నిర్మాణాలు, మరమ్మత్తులు ముగింపునకొస్తాయి. బాధ్యతలు స్వీకరిస్తారు. ఉద్యోగస్తుల సమర్థత అధికారులకే లాభిస్తుంది. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు.  
 
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
వాగ్ధాటితో రాణిస్తారు. వ్యాపకాలు విస్తరిస్తాయి. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. వ్యవహారానుకూలత ఉంది. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. ఖర్చులు అదుపులో ఉండవు. ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి ఉంటుంది. పొదుపు ధనం గ్రహిస్తారు. గృహంలో సందడి నెలకొంటుంది. ఆరోగ్యం సంతృప్తికరం. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. పరిచయం లేని వారితో జాగ్రత్త. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. పిల్లల చదువులపై దృష్టి పెడతారు. విద్యాప్రకటనలు, దళారులను విశ్వసించవద్దు. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. భాగస్వామిక చర్చలు ఫలిస్తాయి. కాంట్రాక్టులు, ఏజెన్సీలు దక్కించుకుంటారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. దైవ దర్శనం సంతృప్తినిస్తుంది. కళాకారులకు ప్రోత్సాహకరం.
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
వ్యవహారాలను సమర్థంగా నిర్వహిస్తారు. ధనలాభం ఉంది. ఖర్చులు అదుపులో ఉండవు. విలాస వస్తువులు కొనుకోలు చేస్తారు. పనులు ముగింపు దశలో అస్తవ్యస్తంగా సాగుతాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం నిరుత్సాహపరుస్తుంది. ఆశావహ దృక్పథంతో మెలగండి. గురు, శుక్ర వారాల్లో అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. ఆరోగ్యం జాగ్రత్త. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. పెద్దల సలహా పాటించండి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. విందులు, వేడుకల్లో పాల్గొంటారు. ఆత్మీయుల ఆతిధ్యం ఆకట్టుకుంటుంది. వ్యాపారాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. విద్యార్థులకు అత్యుత్సాహం తగదు.  
 
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఎటువంటి సమస్యనైనా దీటుగా ఎదుర్కుంటారు. సంప్రదింపులు ఫలిస్తాయి. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. శనివారం నాడు పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఆహ్వానం, పత్రాలు అందుకుంటారు. గృహంలో స్తబ్ధత తొలుగుతుంది. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. సంతానంపై చదువులపై దృష్టి పెడతారు. పరిచయాలు బలపడుతాయి. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. న్యాయ, వైద్య, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ఉద్యోగస్తులకు యూనియన్‌లో గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. చిరువ్యాపారులకు ఆశాజనకం. ప్రయాణం చికాకుపరుస్తుంది. చూడండి వీడియో..