Daily Horoscope
✕

శని..శని..శని అని పిలువకూడదు... శనీశ్వరుడు అనే పిలవాలి.. ఎందుకు?

శనీశ్వరుడి ప్రభావం వద్దే వద్దు అనుకునే వారే అధికంగా ఉంటారు. ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని అనే ఈ పేర్లు వింటేనే చాలామంది వణికి పోతారు. కానీ శనీశ్వరుడు ఇచ్చే విశేషాలను గురించి తెలుసుకుంటే.. శనిప

Written By Selvi
Updated: గురువారం, 11 మే 2017 (14:38 IST)
శనీశ్వరుడి ప్రభావం వద్దే వద్దు అనుకునే వారే అధికంగా ఉంటారు. ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని అనే ఈ పేర్లు వింటేనే చాలామంది వణికి పోతారు. కానీ శనీశ్వరుడు ఇచ్చే విశేషాలను గురించి తెలుసుకుంటే.. శనిప్రభావంతో ఏర్పడే నష్టాలను చూసి జడుసుకోం. శనీశ్వరుడిని ఆరాధిస్తాం. అదెలాగంటే? ''నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం'' అంటారు. 
 
నీలాంజనం- అంటే నల్లటి కాటుక రూపంలో ఉండే వాడని, రవిపుత్రం అంటే.. సూర్యుని పుత్రుడని, యమాగ్రజం-అంటే యమునికి సోదరుడని, ఛాయా మార్తాండ  సంభూతం- ఛాయాదేవికి మార్తాండుడికి అంటే సూర్యునికి జన్మించిన వాడైన శనీకి నమస్కరిస్తున్నానని అర్థం. ఈ శ్లోకాన్ని స్మరిస్తే శనీశ్వరుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. శనీశ్వరుడిని మనం ఎప్పుడు శని శని శని అని పిలవకూడదు. "శనీశ్వరుడు" అని మాత్రమే అనాలి. 
 
ఈశ్వర శబ్ధం ఎక్కడైతే ఎక్కువగా ఉందో అక్కడ ఐశ్వర్యం ఉంటుంది. శివుడిని ఈశ్వరుడు అంటాం. మహేశ్వరుడు అని కూడా అంటాం. అలాగే వేంకటేశ్వర స్వామి వారి పేరులో కూడా వెంకట ఈశ్వరుడు అని వుంది. ఈశ్వర శబ్ధం ఉండబట్టే వెంకన్న కలియుగ దైవంగా మారాడు. కోరిన కోరికలు నెరవేరుస్తున్నాడు. అలాగే శనినామధేయంలోనూ ఈశ్వరుడు (శనీశ్వరుడు) అనే శబ్ధం రావడంతో శనీశ్వరుడు కూడా శివునిలా, వెంకటేశ్వరుడిలా మనల్ని అనుగ్రహిస్తాడని విశ్వాసం. శనీశ్వరుడంటే భయపడాల్సిన అవసరం లేదు. 
 
నవగ్రహాలను పూజించేటప్పుడు శనీశ్వరుడిని భక్తిగా నమస్కరించుకుంటే సరిపోతుంది. అలాగే ఆయనకు నీలం రంగు, నలుపు రంగు వస్త్రాలను ఎక్కువగా ధరించడం.. శనీశ్వరునికి ప్రీతికరమైన చిమ్మిలి నివేదనం చేయడం ద్వారా, శివారాధన చేయడం ద్వారా శనీశ్వరుని అనుగ్రహం పొందవచ్చు. తద్వారా శనిగ్రహ ప్రభావంతో ఏర్పడే దోషాలు.. యోగ ఫలితాలను ఇస్తాయి. శనీశ్వరుని ప్రభావంతో కొన్ని కష్టాలు కలిగినా.. ఆయనను పూజించడం, గౌరవించడం ద్వారా ఆయన అనుగ్రహం లభిస్తుంది. 
 
కానీ శనిప్రభావం రావాలని మనం కోరుకోవాలి. ఎందుకంటే శనీశ్వరుడు మిమ్మల్ని కొద్దిగా పీడించాంటే దానికి వందరెట్లు యోగాన్ని, ఐశ్వర్యాన్ని కలిగించి వెళ్తాడు. శనీశ్వరుడి  ప్రభావం వద్దనుకుంటే.. యోగం, ఐశ్వర్యం కూడా వద్దనుకోవాల్సిందే. శనీశ్వరుడిని చక్కగా నీలిరంగు పుష్పాలతో అలంకరణ చేయించి.. పూజించండి. శివారాధన చేయాలి. హనుమంతారాధన, అయ్యప్ప స్వామి ఆరాధన చేయడం ద్వారా శనీశ్వరుని అనుగ్రహం పొందవచ్చునని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. 

అన్నీ చూడండి

బీజేపీలో చేరిన భారత స్టార్ లెగ్ స్పిన్నర్ చాహల్

శ్రీవారికి 121 కేజీల బంగారు ఆభరణాలు - పేరు వెల్లడించని అజ్ఞాత భక్తుడు

చోరీ పేరుతో వచ్చి... ఆస్పత్రిలో మహిళకు లైంగిక వేధింపులు....

Weather Forecast: నవంబర్ 22, 2026న తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుంటుందంటే..?

అనిరుధ్-కావ్య మారన్ రిసెప్షన్‌కు హాజరైన మంత్రి నారా లోకేష్ కుటుంబం

అన్నీ చూడండి

22-11-2026 - ఆదివారం మీ రాశి ఫలితాలు.. స్నేహితులు లేదా సహచరుల సహకారంతో...?

గణేశుని ప్రసన్నం చేసుకునేందుకు శక్తివంతమైన బీజమంత్రం, విశిష్టతలు

22-11-2026 నుంచి 28-11-2026 వరకు వార ఫలితాలు- తొందరపడి మాట ఇవ్వవద్దు

21-11-2026-శనివారం రాశి ఫలితాలు..కొంత మొత్తాన్ని అవసరాల కోసం దాచుకోవడం మంచిది..

శబరిమలలో అరవణ ప్రసాదం కోసం వెండింగ్‌ మెషీన్‌ అందించిన సౌత్ ఇండియన్ బ్యాంక్‌

తర్వాతి కథనం
Show comments