గురువారం, 28 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : సోమవారం, 18 ఏప్రియల్ 2022 (16:43 IST)

సత్యనారాయణ వ్రతాన్ని ఏ రోజుల్లో జరుపుకోవాలి..?

Sathya Narayana
Sathya Narayana
పురాతన కాలంలో, ప్రజలు సూర్యుడిని త్రిమూర్తులుగా ఆరాధించేవారు. సూర్యుడే పురాతన కాల ప్రజలకు ఆరాధనా దైవంగా పరిగణించబడ్డాడు. కాలక్రమేణా త్రిమూర్తుల రూపాలను కొలవడం ప్రారంభించారు. అలా నారాయణ స్వామి ఆరాధన వైష్ణవ సంప్రదాయం ప్రకారం జరుపబడింది. 
 
ఇలా మహావిష్ణువుకు వ్రతాలు, ఆరాధనలు వాడుకలోకి వచ్చాయి. అలాంటి వ్రతాల్లో ఒకటే సత్యనారాయణ వ్రతం. ఈ పూజ ప్రత్యేకత ఏమిటంటే, శ్రీమహావిష్ణువు స్వయంగా నారదుడికి ఈ పూజ యొక్క గొప్పతనాన్ని స్వయంగా ప్రస్తావించడమే. భక్తులు వారి కష్టాల నుండి బయటపడటానికి ఈ పూజ ఎంతగానో ఉపకరిస్తుంది. 
 
పూజారి సహాయంతో ఈ పూజ చేయడం వల్ల ఆశించిన ఫలితలు చేకూరుతాయి. సంపన్నులు కానివారు సత్యనారాయణ పుస్తకాన్ని అనుసరించి సత్యనారాయణ పూజ చేయించుకోవచ్చు. పౌర్ణమి రోజున ఈ పూజ చేయడం విశిష్ట ఫలితాలను ఇస్తుంది. 
 
ఒక వేళ పౌర్ణమి రోజున చేయలేనివారు అమావాస్య, అష్టమి, ద్వాదశి, సంక్రాంతి, దీపావళి, ఆదివారం, సోమవారం, శుక్రవారం, శనివారాల్లో చేయించుకోవచ్చు. 
 
సాధారణంగా పౌర్ణమి రోజున సత్యనారాయణ వ్రతం జరుపుకుంటారు. ఎందుకంటే ఇది చంద్రుడి రోజు. శ్రీ సత్యనారాయణ పూజ చేసేవారికి శ్రీమహావిష్ణువు యొక్క సంపూర్ణ ఆశీస్సులు లభిస్తాయి. పేదరికం తొలగిపోయి సంపద వస్తుంది. భక్తుల కోరికలు నెరవేరుతాయని విశ్వాసం.