ఆదివారం, 5 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By TJ
Last Modified: బుధవారం, 6 సెప్టెంబరు 2017 (15:37 IST)

ఈ సమయంలో మీరు పుట్టి ఉంటే మీ మనస్తత్వం ఇదే...!

మన జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పుట్టిన సమయం చాలా కీలక పాత్ర పోషిస్తుంది. జ్యోతిష్యులను సంప్రదిస్తే పుట్టిన తేదీ, సమయం, ఘడియలు వంటి విషయాలను అడుగుతుంటారు. జ్యోతిష్యంపై నమ్మకం ఉన్నవారు ఏ సమయంలో పుట్టి ఉంటే ఎలా ఉంటారో తెలుసుకోండి.

మన జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పుట్టిన సమయం చాలా కీలక పాత్ర పోషిస్తుంది. జ్యోతిష్యులను సంప్రదిస్తే పుట్టిన తేదీ, సమయం, ఘడియలు వంటి విషయాలను అడుగుతుంటారు. జ్యోతిష్యంపై నమ్మకం ఉన్నవారు ఏ సమయంలో పుట్టి ఉంటే ఎలా ఉంటారో తెలుసుకోండి. 
 
మీరు ఉదయం 4 నుంచి 6 గంటల మధ్య పుట్టి ఉంటే ఎప్పుడూ అనారోగ్యంతో ఉంటారు. కమిట్‌మెంట్ ఇచ్చిన పనులను అస్సలు చేయలేరు. కాన్ఫిడెంట్‌ను పూర్తిగా కోల్పోతారు. కానీ భవిష్యత్తు మాత్రం ఉజ్వలంగా ఉంటుంది. ఉదయం 6 నుంచి 8 గంటల పుట్టి ఉంటే తక్కువ డబ్బును ఆశిస్తే ఎక్కువగా ఫలితం దక్కుతుంది. మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది. వీరు ఎక్కడ ఇన్విస్ట్ చేసినా మంచి రాబడి వస్తుంది. అప్పుడప్పుడు ఆలోచించి అడుగులు వేయాలి. లేదంటే అపాయంలో పడిపోతారు.
 
ఉదయం 8 నుంచి 10 గంటల మధ్య పుట్టి ఉంటే ఇలాంటి వారు ఫైనాన్షియల్‌గా బాగుంటేనే బంధువులు, స్నేహితులు వీరితో పాటు కలిసి ఉంటారు. అంతేకాదు ఇలాంటి వారిలో నిరాశ ఎక్కువగా కనిపిస్తుంది. ఇక 10 నుంచి 12 గంటల మధ్య పుట్టిన వారయితే అలాంటి వారిలో సక్సెస్ రేటు ఎక్కువగా కనిపిస్తుంది. చేతిలో పవర్ ఎప్పుడూ ఉంటుంది. అయితే వాటిని మాత్రం దుర్వినియోగం చేస్తే మాత్రం పెద్ద ప్రమాదంలో చిక్కుకుంటారు. 
 
12 నుంచి 2 గంటల మధ్య పుట్టే వారయితే అందంగా షార్ప్ మైండైండ్‌తో ఉంటారు. ఇలాంటి వారిలో దయ, జాలి వుంటాయి. అంతా బాగుందని అజాగ్రత్తగా ఉంటే మాత్రం ఇబ్బందులు తప్పవట. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య అయితే డబ్బుతో ముడిపడిన జాబ్‌లు చేస్తుంటారు ఇలాంటి వారు. వీరికి రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశాలున్నాయి. 
 
సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య పుట్టిన వారిలో అయితే మంచి విలువ, ప్రాధాన్యత ఉంటుంది. ఇలాంటి వారు జీవితంలో చాలా ప్రాధాన్యతలను తీసుకుంటారట. పెళ్ళి తరువాత వీరి జీవితంలో మార్పు కనిపిస్తుంది. లీగల్, మధ్యవర్తిత్వం లాంటి రంగాల్లో వీరు రాణిస్తారు. ఇక సాయంత్రం 6 నుంచి 8 గంటల మధ్య పుట్టిన వారయితే క్లోజ్‌గా ఉన్న ఫ్రెండ్స్‌ను బట్టి వీరి జీవితం ఆధారపడి ఉంటుంది. వీరిలో సామాజిక జీవితమే ప్రాధాన్యతగా ఉంటుంది. కష్టపడే నైజం ఉన్నతస్ధానానికి చేరుస్తుంది.
 
రాత్రి 8 నుంచి 10 గంటల మధ్యలో పుట్టిన వారయితే క్రియేటివ్ స్కిల్స్ ఉంటాయి. సక్సెస్ ఎక్కువగా వీరిలో కనిపిస్తుంది. వీళ్ళకు మంచి చెప్పినా అస్సలు వినిపించుకోరు. అందుకే ఇబ్బందులు పడుతుంటారు. రాత్రి 10 నుంచి 12 గంటల మధ్య అయితే ఆస్తుల సంపాదన చాలా కష్టంగా ఉంటుంది. విచిత్రంగా రియల్ ఎస్టేట్‌లో ఎక్కువగా రాణిస్తారు. కష్టం..సుఖం ఎప్పుడూ వీరిలో సమానంగానే ఉంటాయి. రాత్రి 12 నుంచి 2 గంటల మధ్య అయితే వీరిలో చాలా తెలివి.. సాహసించే తపన ఉంటాయి. మీడియా రిలేటెడ్ జాబ్‌లలో వీరు రాణిస్తారు. బంధువు, చుట్టుప్రక్కల వారి ప్రభావం వీరిపై ఎక్కువగా ఉంటుంది. సామాజిక జీవితాన్ని వీరు అనుభవిస్తారు. రాత్రి 2 నుంచి 4 గంటల మధ్య కుకింగ్ ఇండస్ట్రీలో వీరు సెటిల్ అవుతారు. బాగా రాణిస్తారు కూడా.