Daily Horoscope
✕

కార్తీకం హరిహరాదులకు ప్రీతికరం.. తులసీ, మారేడు దళాలతో..?!

Written By సెల్వి
Updated: గురువారం, 31 అక్టోబరు 2019 (15:39 IST)
శరదృతువులో కార్తీక మాసం రెండో మాసం. ఈ మాసంలోని పూర్ణిమనాడు చంద్రుడు కృత్తికా నక్షత్ర సమీపంలో సంచరిస్తూ ఉండడం వల్ల ఈ మాసానికి కార్తీకమాసం అని పేరు వచ్చింది. కార్తీక స్నానాన్ని ఆశ్వీయుజ బహుళ అమావాస్య అంటే దీపావళి రోజు నుంచి ప్రారంభించవలెను. నెలంతా కార్తీక స్నానం చేయడం మంచిది. వీలుకానివారు సోమవారాల్లోనూ శుద్ధ ద్వాదశి, చతుర్దశి, పౌర్ణిమ రోజుల్లోనైనా తప్పక ఆచరించవలెనని పండితులు సూచిస్తున్నారు.
 
ఈ నెలంతా శ్రీమహావిష్ణువును తులసీదళములు, జాజిపూలతో పూజించాలి. అలాగే ఈ కార్తీకంలో శివుడిని మారేడుదళములతోనూ, జిల్లేడుపువ్వులతోనూ పూజించాలి. ఈ మాసంలో కార్తీక పురాణాన్ని పారాయణం చేయడం వల్ల ఉత్తమ ఫలితాలు వస్తాయి. స్నాన, దాన, జపాలు, పూజలు, ఉపవాస వ్రతాలు, దీపాలు వెలిగించడం, వనభోజనాలు వంటి వాటిని చేయడం వల్ల జన్మజన్మల పాపాలను ప్రక్షాళన చేసి అనంతమైన పుణ్యఫలాలను ప్రసాదించే మహిమాన్వితమైన మాసం కార్తీకమాసం.
 
ఇంకా శివకేశవులకు అత్యంత ప్రీతికరమైనది కార్తీకం.. అందులోనూ సోమవారం అంటే శివుడికి ఎంతో ఇష్టం. ప్రతి యేటా దీపావళి వెళ్లిన మరుసటి రోజు నుంచి పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమవుతుంది. 
 
హరిహరాదులకు ప్రీతిపాత్రమైన ఈ మాసంలో భక్తకోటి యావత్తూ కఠిన నిష్టతో చేపట్టే నోములకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ మాసంలో పాఢ్యమి, చవితి, పౌర్ణమి, చతుర్ధశి, ఏకాదశి, ద్వాదశి తిధుల్లో శివపార్వతుల అనుగ్రహం కోసం మహిళలు విశేషంగా పూజలు చేస్తుంటారు. ఈ మాసంలో పలు ఆలయాలలో రుద్రాభిషేకాలు, రుద్రపూజ, లక్ష బిల్వదళాలతో పూజలు, అమ్మవారికి లక్షకుంకుమార్చనలు, విశేషంగా జరుపుతూ ఉంటారు.

అన్నీ చూడండి

హైదరాబాదులో అండాలను అమ్ముకుంటున్న యువతులు, పోలీసుల అదుపులో 13 మంది

ఉప్పాడ తీర ప్రాంత రక్షణ గోడ డిజైన్‌ పనులు వేగవంతం చేయండి : పవన్ కళ్యాణ్

చమోలీ జిల్లాలో కూలిన హెలికాఫ్టర్ - ఆరుగురి దుర్మరణం (వీడియో)

ముగిసిన స్థానిక ఎన్నికల ప్రచారం - నవంబరు ఒకటో తేదీన పోలింగ్

వంగవీటి రాధాకృష్ణ, పవన్ కళ్యాణ్ కలయికపై భయమెందుకు?

అన్నీ చూడండి

30-10-2026 శుక్రవారం నాటి రాశి ఫలాలు - ఆర్థిక ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది..

What Is a Pralaya: ప్రళయం అంటే ఏమిటి? ప్రపంచం నాశనమవుతుందా? ఎలా లెక్కిస్తారు?

29-10-2026 గురువారం నాటి రాశి ఫలాలు - శుభకార్యం జరిగే అవకాశం ఉంది

28-10-2026 బుధవారం నాటి రాశి ఫలాలు - కొత్త అవకాశం మీ ముందుకు రావచ్చు

ప్రయాణం చేసే ముందు ఈ మంత్రాలను జపిస్తే...? శుక బ్రహ్మ మహర్షిని?

తర్వాతి కథనం
Show comments