Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

సంబంధాలు చూస్తున్నారు... బేసిక్‌గా అబ్బాయిలంటే నాకు అసహ్యం... ఎలా?

Updated: సోమవారం, 13 మే 2019 (14:16 IST)
చాలామంది అమ్మాయిలకు అబ్బాయిలంటే బెరుకు ఉంటుంది. సాధ్యమైనంత వరకు వారితో మాట్లాడేందుకు, కలిసి తిరేగేందుకు, సాన్నిహిత్యం పెంచుకునేందుకు పెద్దగా ఆసక్తి చూపరు. దీనికి అనేక కారణాలు లేకపోలేదు. ముఖ్యంగా చిన్న వయస్సు నుంచి అబ్బాయిల పట్ల వారికి ఏహ్యభావం ఉండటం. మరోవైపు.. అబ్బాయిలతో మాట్లాడినా.. చనువుగా నడుచుకున్నా ఈ సమాజం ఏం అనుకుటుందోనన్న భీతి వారి మనస్సుల్లో ఉంటుంది. 
 
అలాగే, చిన్నప్పటి నుంచి వారు పుట్టిపెరిగిన వాతావారణం కూడా అబ్బాయిలంటే అమ్మాయిలు అయిష్టత ప్రదర్శిస్తుంటారు. ఇలాంటివి ఎన్ని ఉన్నా... పెళ్లీడు వచ్చాక తమకు నచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకోక తప్పదు. తమకు ఇష్టంగానో.. తమ తల్లిదండ్రుల ఒత్తిడి కారణంగానో.. మరో కారణంగానో పెళ్లీడు వచ్చిన యువతి వివాహం చేసుకుని తీరాల్సి ఉంటుంది. 
 
ఇలాంటి వారి మనస్సులో అనేక సందేహాలు నిక్షిప్తమై ఉంటాయి. చిన్నప్పటి నుంచి అబ్బాయిలంటే బెరుకు, అయిష్టతను ప్రదర్శిస్తూ వచ్చిన తాము వివాహమైన తర్వాత ఏవిధంగా మసలుకోవాలనే ఆలోచనలు వారి మదిని తొలుస్తుంటాయి. ఇలాంటి వారు నిపుణులైన మానసిక వైద్యులు, సెక్సాలజిస్టులను సంప్రదించి తమ సందేహాలను నివృత్తి చేసుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. 
 
ప్రధానంగా పురుషులంతా ఒకేలా ఉండరన్న విషయాన్ని ప్రతి యువతి గ్రహించాల్సి ఉంటుందని చెపుతున్నారు. ఈ సమాజంలో ఉన్నత విలువతో కూడిన ప్రేమను అందించే వ్యక్తులు కూడా చాలా మందే ఉంటారనే విషయాన్ని గ్రహించాలంటున్నారు. ఇలాంటి వారిలో ఒకరు తమకు పతిగా రావొచ్చని, తమకు భర్తగా రాబోయే వ్యక్తి గుణగణాలను నేటి తరం ఆడపిల్లలు ముందుగానే తెలుసుకుంటూ నివృత్తి చేసుకునేవారు చాలా మందే ఉన్నారని చెపుతున్నారు. అందువల్ల తమ మనస్సుల్లో చిన్నప్పటి భావాలను తొలగించి.. నిపుణులైన వారితో కౌన్సెలింగ్ చేయించుకుంటే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని మానసిక వైద్యులు సలహా ఇస్తున్నారు. 

అన్నీ చూడండి

పిలేరు నుంచి తిరుపతికి అతివేగంగా వచ్చిన లారీ.. అదుపు తప్పి లోయలో..? (video)

అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడనీ ప్రియుడి సాయంతో భర్తను హత్య చేసిన భార్య

Auto Driver: పార్కింగ్ వివాదం.. ఆటో డ్రైవర్ హత్య

సౌదీ అంతర్జాతీయ విమానాశ్రయంపై క్షిపణి దాడి.. హైదరాబాద్ వ్యక్తి మృతి

హీరో బాలకృష్ణ గొప్ప మనసు - రోడ్డు విస్తరణకు ఇంటి స్థలం విరాళం

అన్నీ చూడండి

Medha: శ్రీకాంత్, ఊహల తనయ హీరోయిన్ కాబోతోందట..

Ranbir Kapoor : రామాయణ పార్ట్ 1 కు అడ్వాన్స్ బుకింగ్స్.. IMAX ఫార్మాట్‌లోనూ విడుదల

RT78 : మాస్ మహారాజా రవితేజ క్రైమ్ ను కూడా తులాభారం తో కొలుస్తున్నాడా !

Rajeev Kanakala: స్కూల్ లోనే పిల్లల భవిష్యత్ ఆధారపడుతుంది : రాజీవ్ కనకాల, వితికా షేరు

Gallery 5 NXTinAI: గ్యాలరీ5 NXTinAI: AI వెండితెరపైకి అడుగుపెడుతోంది

తర్వాతి కథనం
Show comments