సోమవారం, 2 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 2 ఆగస్టు 2016 (08:46 IST)

నేడు ఆషాఢ అమావాస్య.. ఈ అత్యంత అరుదైన రోజు మరో వందేళ్ల తర్వాతే

ఆగస్టు 2వ తేదీ మంగళవారం అత్యంత అరుదైన రోజు. ప్రతి వందేళ్ళకు ఓ సారి వచ్చే అత్యంత పవిత్రమైన రోజు. దీనికి కారణం మూడు శుభముహుర్తాలు ఒకేసారి రావడం వల్లే ఈ మంగళవారాన్ని అత్యంత అరుదైన రోజుగా జ్యోతిష్కులు పేర

ఆగస్టు 2వ తేదీ మంగళవారం అత్యంత అరుదైన రోజు. ప్రతి వందేళ్ళకు ఓ సారి వచ్చే అత్యంత పవిత్రమైన రోజు. దీనికి కారణం మూడు శుభముహుర్తాలు ఒకేసారి రావడం వల్లే ఈ మంగళవారాన్ని అత్యంత అరుదైన రోజుగా జ్యోతిష్కులు పేర్కొంటున్నారు. దీంతో ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. 
 
మంగళాన్ని కలిగించే ఆడి పెరుక్కు (ఆషాఢ అమవాస్య), పితృదేవతలకు తర్పణం వదలడానికి ఆషాఢ అమావాస్య, కోటి పుణ్యఫలం కలిగించే గురుపెయర్చి అనే మూడు కార్యక్రమాలు మంగళవారం జరగనున్నాయి. 
 
దక్షిణాయన పుణ్యకాల ప్రారంభ మాసమైన ఆషాఢంలో భూమాత అమ్మవారిగా అవతరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ మాసాన్ని అమ్మవారి మాసంగా కీర్తిస్తుంటారు. ఈ మాసంలో అమావాస్య, ఆషాడ పెరుక్కు విశేష దినాలు. 
 
అలాగే, అరుదుగా సంభవించే గురుపెయర్చి కూడా ఇదే రోజున రావడం మరో విశేషం. వందేళ్లకోసారి ఆషాఢ అమావాస్య, గరుపెయర్చి ఒకే రోజు రావడంతో భక్తులతో ఆలయాలు కిటకిటాలడనున్నాయి.