తిరుమల శ్రీవారి ఆలయంలో గరుడ మందిరం...

తిరుమల బంగారు వాకిలికి ఎదురుగా గరుడ మందిరం ఉంది. శ్రీ వేంకటేశ్వరస్వామివారికి అభిముఖంగా నమస్కార భంగిమలో రెక్కలు విప్పుకుని నిలిచి ఉన్న గరుత్మంతుని శిలామూర్తి ప్రతిష్టించబడింది. సుమారు ఆరు అడుగుల ఎత్తు

సోమవారం, 12 సెప్టెంబరు 2016 (12:14 IST)
తిరుమల బంగారు వాకిలికి ఎదురుగా గరుడ మందిరం ఉంది. శ్రీ వేంకటేశ్వరస్వామివారికి అభిముఖంగా నమస్కార భంగిమలో రెక్కలు విప్పుకుని నిలిచి ఉన్న గరుత్మంతుని శిలామూర్తి ప్రతిష్టించబడింది. సుమారు ఆరు అడుగుల ఎత్తు ఉంటుంది గరుడ విగ్రహం.
 
క్రీ.శ.1512 సంవత్సరం నాటి శాసనాల్లో ఈ గరుడ మందిరం యొక్క ప్రస్తావన ఉంది. ఈ మందిరంపై మూడు బంగారు కలశాలు గల గోపురం నిర్మించబడింది. వెండి వాకిట్లో నుంచి లోపలికి ప్రవేశిస్తూ ఉన్నప్పుడు గరుడ మందిరం వెలుపల, పక్కల వెనుక భాగంలో బంగారు పూతపూయబడిన రేకు తాపబడి ఉంటుంది. సరిగ్గా ఈ గరుడాళ్వార్‌ మందిరం యొక్క వెనుకభాగంలోని ప్రాకార కుడ్యంపై అంటే వెండివాకిలికి ఎదురుగా అమర్చబడిన శ్రీ రంగనాథుని బంగారు విగ్రహం కూడా ఉంది.
 
అలాగే ఆలయంలో నెలకొని ఉన్న మరికొన్ని గరుడ విగ్రహాల్లో రాముల వారి మేడలో ఉన్న చిన్నచిన్న పంచలోహ గరుడ విగ్రహం కూడా ఉంది. రంగనాయక మండపంలోని వెండి గరుడ వాహనం, బంగారు గరుడ వాహనం కూడా ఉన్నాయి. శ్రీ వేంకటేశ్వరస్వామివారు ప్రతి బ్రహ్మోత్సవంలో బంగారు గరుడునిపై ఊరేగే గరుడసేవ ఎంతో వైభవోపేత మహోత్సవం. 
 
శ్రీ స్వామివారి సమక్షంలో ఆజ్ఞ కోసం నిత్యం ఎదురుచూస్తూ విప్పుకొన్న విశాలమైన రెక్కలతో అనుక్షణం సిద్ధంగా ఉంటూ నిలిచి ఉన్న స్వామి భక్త పరాయణుడైన ఈ పక్షిరాజును ఒక్కసారి మనసారా ప్రార్థిద్దామా.... 

అన్నీ చూడండి

తెలుగు రాష్ట్రాల వెదర్ రిపోర్ట్

ప్రపంచ సంగీత దినోత్సవం సందర్భంగా ముజిగల్ అకాడమీ కూకట్‌పల్లి 700 మంది విద్యార్థుల నమోదు

లక్నోలోని కోచింగ్ సెంటర్‌లో అగ్ని ప్రమాదం.. 14మంది విద్యార్థులు మృతి (video)

తెలంగాణ పట్ల వైరం లేదు.. ప్రపంచ స్థాయి రాజధానిని నిర్మించడమే లక్ష్యం.. బాబు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు జూన్ 26 వరకు భారీ వర్ష సూచన

అన్నీ చూడండి

23-06-2026 మంగళవారం ఫలితాలు - మీ కష్టం ఫలిస్తుంది

22-06-2026 సోమవారం ఫలితాలు - ఎవరినీ నిందించవద్దు

21-06-2026 - ఆదివారం మీ రాశి ఫలితాలు - రుణవిముక్తులవుతారు

సత్వ గుణం అంటే ఏమిటి? భగవద్గీతలో కృష్ణుడు చెప్పిందేమిటి?

21-06-2026 నుంచి 27-06-2026 వరకు వార ఫలితాలు - మీ మాటకు తిరుగుండదు

తర్వాతి కథనం
Show comments