జూలై 9 గురుపూర్ణిమ... ఏం చేయాలి?

భారతీయ సంప్రదాయం ప్రకారం తల్లిదండ్రుల తర్వాత మళ్లీ అంతటి గొప్పస్థానం గురువుకే దక్కుతుంది. అందుకే 'ఆచార్య దేవో భవ' అన్నారు. అంతేకాకుండా త్రిమూర్తులు ఒక్కటై గురువుగా అవతరిస్తారని విశ్వాసం. అందుచేత ఆషాఢ శుద్ధ పూర్ణిమ (జూలై 9) రోజున విష్ణుమూర్తి, దత్తాత్

శనివారం, 8 జులై 2017 (20:25 IST)
భారతీయ సంప్రదాయం ప్రకారం తల్లిదండ్రుల తర్వాత మళ్లీ అంతటి గొప్పస్థానం గురువుకే దక్కుతుంది. అందుకే 'ఆచార్య దేవో భవ' అన్నారు. అంతేకాకుండా త్రిమూర్తులు ఒక్కటై గురువుగా అవతరిస్తారని విశ్వాసం. అందుచేత ఆషాఢ శుద్ధ పూర్ణిమ (జూలై 9) రోజున విష్ణుమూర్తి, దత్తాత్రేయ, సాయిబాబా పూజతో పాటు ఆదిశంకరాచార్యుల వారిని కూడా పూజించడం మంచిది.
 
వ్యాసపూర్ణిమ పర్వదినాన్ని ఆదిశంకరాచార్యుల వారు ఏర్పాటు చేసినట్లు పెద్దలు చెబుతారు. ఈ పర్వదినాన కొన్ని ఆలయాల్లో ఓ పూజ జరుగుతుంది. కొత్త అంగవస్త్రాన్ని పరిచి దాని మీద బియ్యం పోసి, ఆ బియ్యం మీద చుట్టూ నిమ్మకాయలుంచారు. ఆదిశంకరులు, ఆయన నలుగురు శిష్యులు వచ్చి వాటిని అందుకుంటారని విశ్వాసం. 
 
పూజ అయిన తర్వాత తలా ఓ పిడికెడు బియ్యం తీసుకుని తమ ఇళ్ళలోని బియ్యంలో కలుపుకుంటారు. బియ్యం, కొత్తవస్త్రం అనేవి లక్ష్మీదేవి చిహ్నాలని, నిమ్మపళ్ళు కార్యసిద్ధికి సూచకాలని పురోహితులు అంటున్నారు. అందుచేత గురుపౌర్ణమి రోజున పూజ చేసేటప్పుడు కుంకుమ మరియు విభూతి నుదుటన బెట్టి దేవతా స్తుతి చేయాలి.
 
ఇకపోతే.. గురుపౌర్ణమి రోజున నుదుట బొట్టు పెట్టకుండా దేవతా స్తుతి చేయకూడదని పురోహితులు సూచిస్తున్నారు. ఇంకా ఆ రోజు సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో ఆలయాల్లో ఆవునేతితో దీపమెలిగించే వారికి సుఖసంతోషాలు చేకూరుతాయని విశ్వాసం. అలాగే ఆలయాల్లో జరిగే పూజలను కళ్లారా వీక్షించేవారికి లేదా పూజలు జరిపేంచేవారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు చెబుతున్నారు.

అన్నీ చూడండి

నలుగురైదుగురు భార్యలని మాట్లాడి ఓ పార్టీ భూస్థాపితం, ఇదేనా జర్నలిజం: తెలంగాణ జనసేన

అమిత్ షా గారూ, ఆయన్ని అరెస్ట్ చేయరా: డిప్యూటీ సీఎం పవన్ డైలాగ్‌తో పగలబడి నవ్విన జనసైనికులు, వీడియో

Vijay : ఢిల్లీలో ప్రధానిని కలిసిన తమిళనాడు సీఎం విజయ్

రాగి శాసనాలను స్వదేశానికి తెప్పించిన ప్రధాని మోడీ.. ప్రశంసించిన సీఎం విజయ్

మమతా బెనర్జీకి షాకిచ్చిన బరాసత్ ఎంపీ... అన్ని పదవులకు రిజైన్

అన్నీ చూడండి

28-05-2026 గురువారం ఫలితాలు - ధనం మితంగా ఖర్చు చేయండి

మూడేళ్లకు ఒకసారి వచ్చే పద్మిని ఏకాదశి.. తులసి దళాలతో అర్చన చేస్తే?

27-05-2026 బుధవారం ఫలితాలు- దంపతుల మధ్య అకారణ కలహం

Eid Al-Adha 2026 date: తెలుగు రాష్ట్రాల్లో మే 28, 2026 గురువారం బక్రీద్.. సెలవు దినం

26-05-2026 మంగళవారం ఫలితాలు - ధనసహాయం తగదు

తర్వాతి కథనం
Show comments