ప్రతిరోజు ఇంటి ముందు దీపం పెట్టేముందు ఇలా చేయాలి...!

దీపం తేజస్ తత్వానికి ప్రతీక. రోజు రెండు సార్లు, ఉదయం సూర్యోదయానికి ముందు సంధ్యాకాలంలో, సాయంత్రం సూర్యాస్తమయం సంధ్యాకాలంలో తప్పకుండా దీపారాధన చేయాలి. దీపప్రజ్వలన అనకుండా దీపారాధన అనడంలోనే ఒక ప్రత్యేకత

శుక్రవారం, 10 మార్చి 2017 (13:11 IST)
దీపం తేజస్ తత్వానికి ప్రతీక. రోజు రెండు సార్లు, ఉదయం సూర్యోదయానికి ముందు సంధ్యాకాలంలో, సాయంత్రం సూర్యాస్తమయం సంధ్యాకాలంలో తప్పకుండా దీపారాధన చేయాలి. దీపప్రజ్వలన అనకుండా దీపారాధన అనడంలోనే ఒక ప్రత్యేకత ఉంది. దీపాన్ని వెలిగించండని చెప్పలేదు, దీపాన్నీ పూజించండి అన్నారు పెద్దలు. ఎందుకంటే దీపం పరబ్రహ్మస్వరూపం, ఆత్మస్వరూపం. మనలోనూ నిత్యం ఆత్మజ్యోతి ఒకటి వెలుగుతూ ఉంటుంది కనుకనే మనం జీవించి ఉన్నాం. దీపంలోనే దేవతలందరూ ఉంటారు. 
 
దీపం వెలిగించిన మరుక్షణమే ఆ ప్రాంతమంతా దైవీశక్తులతో నిండిపోతుంది. దీపం పెడితే చాలు దేవతలు వస్తారు. అటువంటి దీపారాధనకు ప్రత్యేక నియమాలు ఏమీలేవు. ఉదయం స్నానం చేసిన తర్వాత వెలిగించినట్టే, సాయంత్రం స్నానం చేసి దీపం వెలిగించాలి. సాయంత్రం స్నానం చేయలేని స్థితిలో కనీసం ముఖమూ, కాళ్ళూ, చేతులు, నోరు కడుక్కుని దీపారాధన చేయాలి. మాంసాహారం తినేవారు కూడా ప్రతిసారీ తలంటుస్నానం చేయనవసరంలేదు. మామూలు స్నానం సరిపోతుంది. ఇక దీపం వెలిగించి ప్రమిద బంగారం కానీ, వెండిది కానీ, ఇత్తడిది, మట్టిదైనా అయి ఉండాలి. స్టీలు, ఇనుప ప్రమిదలో ఎప్పుడు దీపం వెలిగించకూడదు. 

అన్నీ చూడండి

కాకినాడ చిన్నారి జానుని అప్పగిస్తే కేసు లేకుండా చూస్తాం: పోలీసులు ప్రకటన

వయనాడ్‌లో విరిగిపడిన కొండ చరియలు - వంద అడుగులు దూసుకొచ్చిన ఇంధన ట్యాంకర్ (వీడియో)

బెంగుళూరు ట్రిబుల్ ఐటీ విద్యార్థికి రూ.1.5 కోట్లతో ప్యాకేజీ

హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో కేసీఆర్.. మనవడు హిమాన్షుకు పరామర్శ (video)

Rental Girlfriend: ఢిల్లీలో ట్రెండ్ అవుతున్న రెంటల్ గర్ల్ ఫ్రెండ్ సేవలు

అన్నీ చూడండి

ఈ పంచ కన్యల శ్లోకం స్మరిస్తే మహాపాతకాలు పోతాయ్

07-07-2026 మంగళవారం ఫలితాలు - కార్యసిద్ధి, ధనయోగం ఉన్నాయి.. ఏ రాశికి?

జూలై 7, 2026: కాలాష్టమి.. తేనె రాసిన జిల్లేడు ఆకులు.. నైవేద్యంగా రెండు గులాబ్‌జామూన్‌లు..?

06-07-2026 సోమవారం ఫలితాలు - ఆర్థికలావాదేవీలతో సతమతమవుతారు...

05-07-2026 ఆదివారం ఫలితాలు- ఎవరినీ అతిగా నమ్మవద్దు

తర్వాతి కథనం
Show comments