Daily Horoscope
✕

భగవంతుని ముందు దీపం వెలిగిస్తే ఏమవుతుంది?

Written By ఐవీఆర్
Updated: మంగళవారం, 3 డిశెంబరు 2019 (22:09 IST)
దీపం జ్ఞాన చిహ్నం. నిర్లక్ష్యమన్న చీకటిని పారదోలే దివ్యజ్యోతి. ప్రతి ఇంట్లోనూ దేవుని ముందు ఉదయం, సాయంసంధ్యవేళ ఒకటి, రెండుసార్లు దీపారాధన చేయడం హైందవ ఆచారం. కొన్ని  ఇళ్ళల్లో ఎప్పుడూ దీపం వెలుగుతూనే ఉంటుంది. దీనిని "అఖండ" దీపం అంటాము. 
 
అన్ని పవిత్ర సందర్భాలలోనూ జ్యోతి వెలిగించి ప్రారంభించే సంప్రదాయం మనకు ఉంది. దీప కాంతి చీకటిని పారదోలినట్లే, జ్ఞానం నిర్లక్ష్య ధోరణిని నిర్మూలిస్తుంది. అందుకే అన్ని రూపాల్లోని సంపద అయిన గొప్ప జ్ఞానాన్ని సముపార్జించుకోవడం కోసం, అన్ని పవిత్ర సందర్భాలలోనూ మన ఆలోచనలకు, చర్యలకు సాక్ష్యంగా జ్యోతి వెలిగిస్తాము.
 
విద్యుత్‌దీపాల సంగతిని పక్కనుంచితే  సంప్రదాయబద్దంగా వెలిగించే నూనే దీపానికి ఆధ్యాత్మిక గుర్తింపు ఎక్కువుగా ఉంటుంది. దీపపు కుందిలో పోసే నెయ్యి లెదా నూనె, వత్తి మనలోని కోరికలు, అహంభావ ధోరణులకు సంకేతం. భగవంతుని ముందు దీపం వెలిగించగానే మనలోని కోరికలు నెమ్మదిగా ఆవిరవుతూ, అహం కాలిపోతూ వుంటుందని అర్థం చేసుకోవాలి. 

అన్నీ చూడండి

అక్టోబర్ 10 నుండి 20, 2026 వరకు ఇంటర్ విద్యార్థులకు దసరా సెలవులు

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. కమిటీల ఎంపిక.. పవన్ కల్యాణ్ ప్రకటన

ఎంగిలి పూల బతుకమ్మతో తెలంగాణలో వేడుకలు ప్రారంభం

MT GEM NO.2పై డ్రోన్ దాడి.. 22 మంది భారతీయ నావికులు సేఫ్

అక్టోబర్ 10, 2026: శనివారం నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుందంటే?

అన్నీ చూడండి

10-10-2026 శనివారం నాటి రాశి ఫలాలు... ఆర్థిక ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది

Ramanujacharya: నవరాత్రి బ్రహ్మోత్సవాలు... మాడ వీధులు.. రామానుజాచార్యుల ఏర్పాట్లు

తిరుమల బ్రహ్మోత్సవాలకు TNSTC ప్రత్యేక బస్సులు

09-10-2026 - శుక్రవారం నాటి రాశి ఫలాలు - ఆర్థిక లావాదేవీల్లో స్పష్టత పాటిస్తే..?

మహాలయ అమావాస్య రోజున చేయకూడని పనులు ఏంటంటే?

తర్వాతి కథనం
Show comments