Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

శ్రావణ ఆదివారం ఈ రెండు చేస్తే.. అప్పులుండవు.. కావాల్సిందల్లా బెల్లం మాత్రమే..

Written By సెల్వి
Updated: శనివారం, 26 జులై 2025 (21:10 IST)
Jaggery
శ్రావణ ఆదివారం రోజున సాయంత్రం ఆరు నుంచి 7 గంటల మధ్య కాలంలో బెల్లంతో ఈ పరిహారం చేస్తే అంతా శుభం జరుగుతంది. భూములు, బంగారం కొంటూనే వుంటారని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. అప్పులన్నీ తీరిపోతాయి. భూములు కొనే అవకాశాలు వస్తూనే వుంటాయి. 
 
మంచి యోగం సిద్ధిస్తుంది. కాబట్టి శ్రావణ ఆదివారం బెల్లంతో ఇలా చేయడం మరిచిపోకండి. శ్రావణ ఆదివారం ఈ బెల్లం పరిహారం చేయడం ద్వారా రాజయోగం తథ్యం. బెల్లంతో ఎలాంటి పరిహారాలు చేసినా మంచి ఫలితాలు వస్తాయి. బెల్లం పవిత్రమైన పదార్థం. అందుకే దీనితో స్వామికి నైవేద్యం సమర్పిస్తారు. 
 
శ్రావణ ఆదివారం కుందు బెల్లం కేజీగానీ, అరకేజీ తీసుకుని, కొంచెం కుంకుమను కూడా తీసుకుని.. ఆ కుంకుమలో నూనె కలిపి పేస్టులా చేసుకుని.. ఒక పుల్ల సాయంతో బెల్లం కుందు మీ కోరికను రాయండి. అంటే పేరు ముందు రాసి ఆ పేరు కింద మీ కోరికను రాయండి. ఇలా ఒక కోరికను మాత్రమే రాయాలనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఇలా మీ పేరు, కోరిక రాసిన తర్వాత ఈ బెల్లం ముక్కను ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో పెట్టేయాలి. 
 
పొలాల దగ్గర, కంపల్లాగా చెట్లు పెరిగిన చోట ఈ బెల్లాన్ని పడేయాలి. శ్రావణ ఆదివారం రోజు 6-7 మధ్యలో ఈ పరిహారాన్ని చేయాలి. బెల్లాన్ని పడేసేముందు మూడుసార్లు మీ కోరికను చెప్పుకోవాలి. ఇలా చేస్తే కచ్చితంగా త్వరలోనే మీరు కోరుకున్నది జరుగుతుంది. అలాగే ఆదివారం ఇంటి గుమ్మం వద్ద ఇలా చేస్తే ఈతిబాధలు, రుణబాధలు తొలగిపోతాయి. అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి. 
 
ఏం చేయాలంటే.. శ్రావణ ఆదివారం రోజు ఉదయం 5-6 గంటల మధ్యలో సూర్యుడు రాకముందే చిన్న గ్లాసులో స్వచ్ఛమైన నీరు తీసుకుని (రాగి, వెండి, స్టీల్, గాజు గ్లాసు ఏదైనా తీసుకోవచ్చు) అందులో పచ్చ కర్పూరం పొడి వేయాలి. దీంతో పాటు మీ ఇంట్లో అత్తరు వుంటే.. ఆ అత్తరును కూడా 5 చుక్కలు నీటిలో కలపండి. ముఖ్యంగా మల్లెపువ్వుల వాసన వచ్చే అత్తరు బెస్ట్. గులాబీ పూల వాసన వచ్చే అత్తరును గానీ కలిపినా మంచిది. ఇవి లేకపోతే రోజ్ వాటర్‌ని కలపడం మంచిది. 
 
ఈ నీటిని బాగా కలిపి బిర్యానీ ఆకుతో ఆ నీటిని గుమ్మం వద్ద చల్లండి. చల్లడం అంటే కలశం నీటిని ప్రోక్షణం చేసేట్లు చల్లాలి. ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఇలా చేయడం మంచిది. ఇలా చేస్తే ఇంట్లోని నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. 
 
శ్రావణ ఆదివారం ఇలా చేస్తే శ్రీ మహాలక్ష్మి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. తద్వారా రుణ సమస్యల నుంచి బయటపడతారు. అప్పులు తీర్చే మార్గాలు తెలుస్తాయి. ధన సంపాదన పెరుగుతుంది. ఏ పని చేసినా ఆ పనిలో కలిసివస్తుంది. ఎలాంటి సమస్యలున్నా ఈ పరిహారంతో దూరం చేసుకోవచ్చు అంటున్నారు ఆధ్యాత్మిక పండితులు.

అన్నీ చూడండి

విమానం గాల్లో ఎగురుతూ వుండగా భారతీయుడికి ఆస్తమా, కన్నుమూత

సీబీఎస్ఈ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న ఎస్వీఐఎస్ అండర్-14 బాలుర జట్టు

వందేభారత్ రైలు ఢీకొని యువకుడు మృతి.. రీల్స్ చూస్తూ.. బైకుకు తోసుకొచ్చాడా?

రోడ్డు ప్రమాదంలో వరంగల్ సర్పంచ్ మృతి... భర్త రవీందర్ పరిస్థితి విషమం

జార్ఖండ్: రూ. 2.20 కోట్ల రివార్డు.. సీపీఐ మావో నేత ఆకాష్ లొంగుబాటు

అన్నీ చూడండి

Meenakshi Temple: చారిత్రాత్మక ఘట్టం.. మధురై మీనాక్షి అమ్మవారి మహా కుంభాభిషేకం (video)

17-09-2020 గురువారం నాటి రాశి ఫలాలు - ఆర్థికంగా అనుకూలమైన రోజు

గురువారం ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని 108 సార్లు పఠిస్తే?

బుధవారం.. వినాయకుడిని, బుధ గ్రహాన్ని పూజిస్తే.. ఆకుపచ్చ రంగులో...?

16-09-2020 రాశి ఫలాలు - వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి

తర్వాతి కథనం
Show comments