Webdunia - Bharat's app for daily news and videos

Install App

శివునికి పరమ ప్రీతికరమైన 'కార్తీక సోమవారం'

కార్తీకమాసం ఆధ్యాత్మికపరమైన అనేక విశేషాల సమాహారం. ఈ మాసంలో ప్రతి రోజు ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తుంది. సాధారణంగా పరమశివుడికి సోమవారం ప్రీతికరమైన వారం. సోమ .. అంటే, స - ఉమ అనే అర్థం ఆవిష్కరించబడుతోంది. స- ఉమ అంటే ఉమతో కూడినవాడుగా శివుడు చెప్పబడు

Written By chj
Updated: శనివారం, 5 నవంబరు 2016 (19:21 IST)
కార్తీకమాసం ఆధ్యాత్మికపరమైన అనేక విశేషాల సమాహారం. ఈ మాసంలో ప్రతి రోజు ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తుంది. సాధారణంగా పరమశివుడికి సోమవారం ప్రీతికరమైన వారం. సోమ .. అంటే, స - ఉమ అనే అర్థం ఆవిష్కరించబడుతోంది. స- ఉమ అంటే ఉమతో కూడినవాడుగా శివుడు చెప్పబడుతున్నాడు. ఈ కారణంగానే సోమవారం రోజున చేసే పూజలు శివుడికి ప్రీతిని కలిగిస్తాయని అంటారు. ఈ నేపథ్యంలో కార్తీక మాసంలోని సోమవారాలు మరింత విశేషాన్ని కలిగినవిగా కనిపిస్తుంటాయి. 
 
ఈ వారంలో ముత్తైదువులు భక్తిశ్రద్ధలతో శివునిని కొలిస్తే మాంగల్య భాగ్యం చేకూరుతుందని విశ్వాసం. కార్తీక సోమవారాల్లో సూర్యోదయానికి ముందుగానే తలస్నానం చేసి, పూజా మందిరాన్ని అలంకరించాలి. భక్తిశ్రద్ధలతో శివలింగాన్ని అభిషేకించి, బిల్వ దళాలతో అర్చించాలి.
 
శివుడిని బిల్వ దళాలతో పూజించడం వలన మనోభీష్టం నెరవేరుతుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. పరమశివుడికి ఇష్టమైన పాయసాన్ని ఈ రోజున నైవేద్యంగా సమర్పించాలి. ఆ పాయసాన్ని ప్రసాదంగా స్వీకరించడం వలన కష్టాలు తొలగిపోతాయని స్పష్టంచేయబడుతోంది. ఈ రోజున శివాలయానికి వెళ్లి స్వామివారి సన్నిధిలో కార్తీక దీపాన్ని వెలిగించాలి. 
 
ఈ విధంగా శివాలయంలో దీపాన్ని వెలిగించడం వలన సమస్త దోషాలు నశిస్తాయి. ఉపవాస దీక్షను చేపట్టి ఈ నియమాలను పాటిస్తూ ఈశ్వరుడిని ఆరాధించడం వలన మోక్షానికి అవసరమైన అర్హతను పొందడం జరుగుతుంది. ఆదిదేవుడి అనుగ్రహాన్ని పొందాలనుకునే వాళ్లు, కార్తీకమాసంలో చివరిసోమవారాన్ని తప్పక ఉపయోగించుకోవాలి. ఆ రోజంతా సదాశివుడి సేవలో తరించాలి.

అన్నీ చూడండి

నాన్న నాపై అత్యాచారం చేస్తున్నాడు: సనత్‌నగర్ పోలీసులకు బాలిక ఫిర్యాదు

ఐరోపాలో తీవ్రమైన వేడిగాలులు... ఫ్రాన్స్‌లో కార్చిచ్చులు.. రవాణా వ్యవస్థలకు అంతరాయం

షరతులు లేకుండా మహిళా రిజర్వేషన్‌ బిల్లును అమలు చేయండి.. రాహుల్ గాంధీ

చెన్నై విమానాశ్రయంలో గుండెపోటుతో భవన నిర్మాణ కార్మికుడి మృతి

Telangana: తెలంగాణ జిల్లాల్లో సాయంత్రం నుండి భారీ వర్షాలు

అన్నీ చూడండి

08-08-2026 నాటి తెలుగు పంచాంగ వివరాలు ఎలా వున్నాయంటే?

08-08-2026 శనివారం ఫలితాలు - నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు...

విజయం ఆలస్యమైనదని బాధపడకు, ఎందుకంటే?

07-08-2026 నాటి రాశి ఫలితాలు.. ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటారు

తుమ్ములు వచ్చేటప్పుడు కూడా భగవన్నామ స్మరణ ఎందుకు..? యముడు చెప్పిన కథేంటి?

తర్వాతి కథనం
Show comments