మంగళవారం, 25 ఫిబ్రవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By ttdj
Last Updated : శనివారం, 6 ఆగస్టు 2016 (12:36 IST)

శ్రీనివాసునికి ఏయే ఆభరణాలు అలంకరిస్తారో తెలుసా...!

శ్రీనివాసుని సంపద వేల కోట్ల రూపాయలన్నది అందరికీ తెలిసిన విషయమే. స్వామివారు ధరించే ఆభరణాల విలువ కూడా కోట్ల రూపాయల్లో ఉంటుంది. ఎన్నో సంవత్సరాల క్రితం రాజులు సమర్పించిన వజ్ర, వైఢూర్యాలతో ఆభరణాలు స్వామివా

శ్రీనివాసుని సంపద వేల కోట్ల రూపాయలన్నది అందరికీ తెలిసిన విషయమే. స్వామివారు ధరించే ఆభరణాల విలువ కూడా కోట్ల రూపాయల్లో ఉంటుంది. ఎన్నో సంవత్సరాల క్రితం రాజులు సమర్పించిన వజ్ర, వైఢూర్యాలతో ఆభరణాలు స్వామివారికి ఇప్పటికీ ఉన్నాయి. పురావస్తు శాఖ అధికారులే స్వామివారికి ఉన్న ఆభరణాల విలువను వెలకట్టలేకపోతున్నారు. అదీ స్వామివారి మహత్యం. అసలు శ్రీవారికి ఏయే ఆభరణాలు అలంకరిస్తారో.. ఇప్పడు చూద్దాం...
 
1. శ్రీవారి పాదాల క్రింది పద్మపీఠం - బంగారు రేకుల పద్మపీఠం
2. బంగారు పాద కవచాలు రెండు 1.కుడిపాదం, 2.ఎడమ పాదం
3. స్వర్ణపీతాంబరం (బంగారు రేకు)
4. బంగారు ఖడ్గం అనబడే సూర్యకఠారి
5. వైకుంఠ హస్తమునకు అలంకరింపబడే బంగారు కవచం రేకు
6. వైకుంఠ హస్తమునకు అలంకరింపబడే పొడవైన బంగారు సాదారేకు
7. వైకుంఠ హస్తమునకు సాతుబడి అయ్యే బంగారు కుడి నాగాభరణం
8. వైకుంఠ హస్తనాగాభరణం క్రింద ఉండే కడియం
9. కటి హస్తమునకు అలంకరించే బంగారు సాదారేకు
10. కటి హస్తమునకు అలంకరింపబడే బంగారు కడియం
11. కటి హస్తమునకు అలంకరింపబడే పొడవైన బంగారు కవచం రేకు
12. బంగారు కటిహస్త కవచం బంగారు రేకు
13. కటి హస్తమునకు అలంకరింపబడే రత్నాలదస్తుబందు
14. ఎడమచేయి నాగాభరణం
15. బంగారు నాగాభరణం అనే వడ్డాణం
16. వక్షస్థలం అమ్మవార్ల బంగారు కంటె, రత్నాలతో
17. బంగారు సహస్రనామ సాలిగ్రామాలు
18. బంగారు తులసీహారం
19. కమ్మరపట్టె అనే బంగారు వడ్డాణం
20. ఆరుపోర్వల బంగారు యజ్ఞోపవీతం
21. బంగారు కాసుల దండ
22. నాలుగు పేటల బంగారు మొహరీల గొలుసు
23. భుజకీర్తులు రెండు
24. రత్నాలు పొదిగిన బంగారు శంఖం రేకు
25. రత్నాలు చెక్కిన బంగారు చక్రం రేకు
26. రత్నాలు చెక్కిన బంగారు ఎడమ కర్ణపత్రం
27. రత్నాలు చెక్కిన బంగారు కుడికర్ణపత్రం
28. రత్నాలు చెక్కిన బంగారు బావలీలు, కుడి, ఎడమ,
29. చంద్రవంక తరహా బంగారు కంటె
30. బంగారు గళహారం
31. బంగారు గంటల మొలతాడు
32. బంగారు రేకు కర్ణ పత్రముల జంట
33. బంగారు రెండు పేటల గొలుసు
34. బంగారు సాదాకంటెలు
35. బంగారు కిరీటం
36. కొత్తగా చేయించిన బంగారు శంఖ చక్రముల కవచరేకులు
37. బంగారు ఐదుపేటల గొలుసు
38. శ్రీ స్వామివారి మకరతోరణం
39. వక్షస్థలంలో తగిలించి ఉన్న భూదేవి ప్రతిమ
 
నిత్యం సమర్పణ అయ్యే ఈ ఆభరణాలన్నీ అర్చకుల ఆధీనంలో ఉంటాయి. వీటి విలువ కోట్ల రూపాయలన్న విషయం తెలిసిందే. వీటిలో కొన్ని స్వామివారికి అలంకరింపబడగా, మిగిలినవి శ్రీవారి ఆయలంలోనే భద్రపరచడం జరుగుతుంది. వజ్ర మకుట ధర గోవిందా.. గోవిందా...!