Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిన్న‌శేషుడిపై మలయప్పస్వామి చిద్విలాసం

Written By జె
Updated: శనివారం, 17 అక్టోబరు 2020 (19:03 IST)
శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు శ‌నివారం ఉద‌యం 9 నుండి 10 గంట‌ల వ‌రకు శ్రీ‌వారి ఆల‌యంలోని క‌ల్యాణ మండ‌పంలో శ్రీ మలయప్పస్వామివారు ఐదు తలల చిన్నశేష వాహనంపై నెమ‌లి పింఛం, గ‌ద‌తో దామోద‌ర కృష్ణుడి అలంకారంలో దర్శనమిచ్చారు. 
 
పురాణ ప్రాశస్త్యం ప్రకారం చిన్నశేషుడిని వాసుకి(నాగ‌లోకానికి రాజు)గా భావిస్తారు. శ్రీ వైష్ణవ సంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం. శేషవాహనం ఈ శేషిభావాన్ని సూచిస్తుంది. చిన్నశేష వాహనాన్ని దర్శిస్తే కుటుంబ శ్రేయ‌స్సుతోపాటు కుండలినీయోగ సిద్ధిఫలం లభిస్తుందని ప్రశస్తి. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు హంస వాహనంపై స్వామివారు ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు.
 
ఈ కార్యక్రమంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, టిటిడి ఈవో డా. కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి, పార్ల‌మెంటు స‌భ్యులు శ్రీ వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి, అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, బోర్డు స‌భ్యులు శ్రీ డిపి.అనంత‌, శ్రీ‌మ‌తి వేమిరెడ్డి ప్ర‌శాంతి, శ్రీ చిప్ప‌గిరి ప్ర‌సాద్‌, శ్రీ గోవింద‌హ‌రి, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, చీఫ్ ఇంజినీర్ శ్రీ ర‌మేష్‌రెడ్డి, ఆల‌‌య డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాథ్‌, పేష్కార్ శ్రీ జ‌గ‌న్‌మోహ‌నాచార్యులు ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

అన్నీ చూడండి

మమతా బెనర్జీ కారుపై దాడి - వీడియో వైరల్

ఫిట్నెస్ సీక్రెట్‌ను వెల్లడించిన రాహుల్ గాంధీ

అద్దెకు బాయ్‌ ఫ్రెండ్‌ ప్రకటనలపై హైదరాబాద్ సీపీ స్ట్రాంగ్ వార్నింగ్

నకిలీ గుర్తింపు కార్డుతో 25 వివాహాలు చేసుకున్న బీజేపీ ఎమ్మెల్యే అల్లుడు

ఆరిజోనాలో ప్రియురాలి హత్య : జర్మనీలో ప్రియుడి అరెస్టు

అన్నీ చూడండి

10-08-2026 సోమవారం ఫలితాలు - నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు...

09 ఆగస్టు 2026 ఆదివారం: తెలుగు పంచాంగ వివరాలు ఎలా వున్నాయి?

09-08-2026 ఆదివారం మీ రాశి ఫలితాలు- వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు..

09-08-2026 నుంచి 15-08-2026 వరకు వార ఫలితాలు నేడు సాధ్యం కానిది రేపు...?

08-08-2026 నాటి తెలుగు పంచాంగ వివరాలు ఎలా వున్నాయంటే?

తర్వాతి కథనం
Show comments