గురువారం, 5 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By chj
Last Updated : శనివారం, 25 జూన్ 2016 (12:37 IST)

కాలి మెట్టెలుకి గర్భాశయానికి సంబంధం ఉందా...? ఏంటది...?

భారతీయ సంప్రదాయంలో ప్రతి దానికి ఒక సైంటిఫిక్ కారణం ఉంటుంది. భారతీయ స్త్రీలు మెట్టెలు ధరించడం ఒక సంప్రదాయం. ఐతే ఈ మెట్టెలు ధరించడానికి, అందులోను కాలి రెండవ వ్రేలుకు ధరించడానికి కూడా చక్కని కారణాలు ఉన్న

భారతీయ సంప్రదాయంలో ప్రతి దానికి ఒక సైంటిఫిక్ కారణం ఉంటుంది. భారతీయ స్త్రీలు మెట్టెలు ధరించడం ఒక సంప్రదాయం. ఐతే ఈ మెట్టెలు ధరించడానికి, అందులోను కాలి రెండవ వ్రేలుకు ధరించడానికి కూడా చక్కని కారణాలు ఉన్నాయి. మెట్టెలు ధరించడం వల్ల ముందు ఆ స్త్రీకి వివాహం అయిందనే విషయం తెలుస్తుంది. ఇక ఆరోగ్య విషయానికొస్తే మెట్టెలు ధరించడం వల్ల గర్భశయానికి చాలా మంచిది. కాలి రెండవ వేలి నుండి గర్భాశయానికి ఒక నాడి అనుసంధానమై ఉంటుంది. గుండెను కూడా ఈ నాడీ కలుపుతుంది. 
 
కాలి వేలికి మెట్టెలు ధరించడం వల్ల గర్భాశయం దృఢపడుతుంది. రక్తప్రసరణను నియంత్రించి, శరీర క్రియలు సక్రమంగా జరిగేటట్లు చేసి ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. వెండితో చేసిన మెట్టెలను ధరించడం భారతీయ సంప్రదాయ పద్ధతి. వెండి మంచి ఉష్ణ వాహకం కావడం వల్ల భూమి నుండి ధృవావేశాలను గ్రహించి శరీర ఇతర అవయాలకు అందజేస్తుంది. కావున ఆధునిక పోకడలకు పోకుండా వివాహమైన స్త్రీలు మెట్టెలు ధరిస్తే , చక్కని ఆర్యోగ్యాన్ని పొందిన వారవుతారు.