సాయంత్రం పూట దీపం పెట్టేటప్పుడు.. ఏడ్వటం చేయకూడదు.. శత్రుపీడ విరగడ కోసం..?

శని ఆరాధనలో ఆవనూనె దీపం వెలిగించాలి. రాహు, కేతు గ్రహ శాంతి కోసం అవిసెనూనెతో దీపారాధన చేయాలి. ఏ దేవీ, దేవతా పూజలోనైనా ఆవునేతి దీపం, నువ్వుల నూనెదీపం తప్పక వెలిగించాలి. దుర్గాదేవి, జగదాంబ, సరస్వతీ దేవి

మంగళవారం, 24 జనవరి 2017 (10:13 IST)
శని ఆరాధనలో ఆవనూనె దీపం వెలిగించాలి. రాహు, కేతు గ్రహ శాంతి కోసం అవిసెనూనెతో దీపారాధన చేయాలి. ఏ దేవీ, దేవతా పూజలోనైనా ఆవునేతి దీపం, నువ్వుల నూనెదీపం తప్పక వెలిగించాలి. దుర్గాదేవి, జగదాంబ, సరస్వతీ దేవి కృప కోసం రెండు ముఖాల దీపం వెలిగించాలి. గణపతి అనుగ్రహం కోసం మూడు వత్తుల దీపం వెలిగించాలి.
 
ఆర్థిక లాభాలను ఆశించేవారు నియమపూర్లకంగా ఇంట్లో లేదా దేవాలయంలో స్వచ్ఛమైన నేతి దీపం వెలిగించాలి. శత్రుపీడ విరగడ కోసం భైరవస్వామికి ఆవనూనె దీపం వెలిగించాలి. సూర్య భగవానుని ప్రసన్నం కోసం నేతి దీపం వెలిగించాలి. అలాగే దీపాలు పెట్టేవేల ఇంటికి ముందు తలుపులు తెరిచి ఉంచాలని, వెనక తలుపులు మూసి వెయ్యాలని, దీపాలు పెట్టాక గోర్లు కత్తిరించకూడదని, ఏడ్వకూడదని, తల దువ్వకూడదని, సంధ్య సమయం లోపలే ఇంటిని శుభ్రం చేసుకోవాలని, ఇలా అనేకం చెబుతూ ఉంటారు. అయితే ఇవన్ని ఎందుకు చెబుతారు అనేది చాల మందికి తెలియదు. 
 
సాయంత్రం పూట జ్యేష్టాదేవి వెనుక ద్వారం నుంచి.. లక్ష్మీదేవి ముందు ద్వారం నుంచి ఇంట్లోకి ప్రవేశిస్తారు. అందుకని సంధ్య సమయం లోపు వెనక తలుపులను క్లోజ్ చేసి, ముందు తలుపులను తెరిచి ఉంచాలి. దాని వలన జ్యేష్టా దేవి ఇంట్లోకి రాకపోగా లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది. మన ఇంటికి ఎవరైన గెస్ట్ వస్తారు అంటేనే ఇంటిని శుభ్రంగా ఉంచి, మనం కూడా శుభ్రంగా తయారై, వాళ్ళు వచ్చే సమయం కోసం ఎదురుచూస్తుంటాం. 
 
అలాంటిది మన జీవితాలలో వెలుగును నింపడానికి ఆ లక్ష్మీ తల్లి వచ్చే సమయానికి మనం ఇంటిని శుభ్రపరచుకుని, మనం కూడా శుభ్రంగా ఉండి ఆతల్లిని ఆహ్వానిస్తే, వచ్చి మన ఇంట్లో కొలువై ఉంటుంది. అంతేకాని లక్ష్మీదేవి వచ్చే సమయంలో గోర్లు కత్తిరించడం, తల దువ్వడం, ఏడ్వటం చేయకూడదని పండితులు చెప్తున్నారు.

అన్నీ చూడండి

నలుగురైదుగురు భార్యలని మాట్లాడి ఓ పార్టీ భూస్థాపితం, ఇదేనా జర్నలిజం: తెలంగాణ జనసేన

అమిత్ షా గారూ, ఆయన్ని అరెస్ట్ చేయరా: డిప్యూటీ సీఎం పవన్ డైలాగ్‌తో పగలబడి నవ్విన జనసైనికులు, వీడియో

Vijay : ఢిల్లీలో ప్రధానిని కలిసిన తమిళనాడు సీఎం విజయ్

రాగి శాసనాలను స్వదేశానికి తెప్పించిన ప్రధాని మోడీ.. ప్రశంసించిన సీఎం విజయ్

మమతా బెనర్జీకి షాకిచ్చిన బరాసత్ ఎంపీ... అన్ని పదవులకు రిజైన్

అన్నీ చూడండి

మూడేళ్లకు ఒకసారి వచ్చే పద్మిని ఏకాదశి.. తులసి దళాలతో అర్చన చేస్తే?

27-05-2026 బుధవారం ఫలితాలు- దంపతుల మధ్య అకారణ కలహం

Eid Al-Adha 2026 date: తెలుగు రాష్ట్రాల్లో మే 28, 2026 గురువారం బక్రీద్.. సెలవు దినం

26-05-2026 మంగళవారం ఫలితాలు - ధనసహాయం తగదు

25-05-2026 సోమవారం ఫలితాలు - ఖర్చులు అదుపులో ఉండవు.. ముఖ్యుల కలయిక వీలుపడదు...

తర్వాతి కథనం
Show comments