బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By జె
Last Modified: మంగళవారం, 12 మార్చి 2019 (19:02 IST)

తులసి చెట్టు దగ్గర ఇలా చేస్తే అంతేసంగతులు...

హిందూ సాంప్రదాయంలో తులసీ మొక్కకు ఎంతో ప్రాధాన్యత ఉంది. హిందువుల్లో చాలామంది సాధ్యమైనంత వరకు తులసీ మొక్కలను ఖచ్చితంగా పెట్టుకుంటారు. రోజూ చెట్టుకు నీళ్లు పోసి పూజ చేస్తుంటారు. ఆదిపరాశక్తి అంశలలో ఒక అంశయే తులసిమాత. కాబట్టి తులసి చెట్టు విషయంలో పొరపాటున కూడా ఈ తప్పులు చేయకూడదట. సాధారణంగా మన ఇళ్ళలో రోజూ నీళ్ళు పోయడంతో పాటు తులసి దగ్గర నమస్కారం చేయడం.. దీపారాధన కూడా చేస్తుంటాం. 
 
అదేవిధంగా ఒక పని కూడా చేసి అమ్మవారి ఆగ్రహానికి గురి అవుతుంటాం. అదేంటంటే తులసి చెట్టుకు పూజలు చేయడం మహిళలకు ఎంత ధర్మమో అదేవిధంగా తులసి దళాలను అపవిత్రంగా ఉన్న సమయంలో తెంచడం కూడా అంతేపాపమట. తులసిమొక్కను ఎంతో పవిత్రంగా చూసుకోవాలి. అపవిత్రంగా ఉన్న స్త్రీ యొక్క నీడ కూడా తులసిమొక్క మీద పడకూడదట. అదేవిధంగా తులసి దళాలతో పూజ చేసేటప్పుడు తులసి మొక్కలను కోసి అస్సలు దేవుడికి పూజల చేయకూడదట. అలా చేస్తే మహాపాపానికి దారితీస్తుందట. 
 
దానివల్ల ధనం కూడా అంతరించిపోతుందట. లక్ష్మీదేవి ఆగ్రహానికి గురిఅవుతాం. కాబట్టి పక్కన వేరే తులసి మొక్కలు నాటి దాని నుంచి మాత్రమే దళాలను కోసి దేవతలకు అలంకరించారట. అంతేగానీ మీరు కుండీల్లో పెంచుకునే తులసి దళాలను పొరపాటున కూడా కోయకూడదట. 
 
చాలామంది చేసే పొరపాట్లు ఏంటంటే తులసి మొక్కలను పెట్టిన తరువాత బట్టలను ఆరవేయడానికి ఆరుబయట తీగలో తాడు లాంటివి కడుతుంటారు. వాటిపైన ఈ బట్టలు ఆరవేస్తుంటారు. ఇలా బట్టలు ఆరవేడం వల్ల వాటిలో నుంచి కారే నీటిచుక్కలు తులసి మొక్కపై  పడుతుంటాయి. ఇలా చేయడం చాలా తప్పట. దీనివల్ల అనర్థం జరుగుతుందట. అంతేగాకుండా తులసిని అగౌరపరిచినట్లు అవుతుందంట. లక్ష్మీదేవి స్వరూంగా ఉన్న తులసిదేవిని అగౌరవ పరచకుండా చూసుకోవాలని పండితులు చెపుతున్నారు.