Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుఖభోగాలను అనుభవించాలని కోర్కెలున్నంత కాలం...

సంసారంలో సుఖభోగాలను అనుభవించాలని కోర్కెలున్నంత కాలం కర్మ త్యాగం చేయలేము. సుఖభోగాలు అనుభవించాలన్న ఆశ ఉన్నంత వరకు కర్మ ఉండనే ఉంటుంది. కర్మలను పోగొట్టుకున్న తర్వాత వ్యక్తి ఎంత ప్రశాంతంగా ఉంటాడో ఈ పక్షి కథ ద్వారా తెలుసుకుందాం. ఒక పక్షి గంగానదిలో లంగరు ది

Written By chj
Updated: బుధవారం, 19 సెప్టెంబరు 2018 (21:25 IST)
సంసారంలో సుఖభోగాలను అనుభవించాలని కోర్కెలున్నంత కాలం కర్మ త్యాగం చేయలేము. సుఖభోగాలు అనుభవించాలన్న ఆశ ఉన్నంత వరకు కర్మ ఉండనే ఉంటుంది. కర్మలను పోగొట్టుకున్న తర్వాత వ్యక్తి ఎంత ప్రశాంతంగా ఉంటాడో ఈ పక్షి కథ ద్వారా తెలుసుకుందాం. ఒక పక్షి గంగానదిలో లంగరు దించివున్న ఓడ స్తంభంపై పరధ్యానంగా వ్రాలింది. ఓడ గంగానది నుండి క్రమక్రమంగా సముద్రంలోపలికి ప్రవేశించింది. అప్పుడు పక్షికి ఎరుక వచ్చి చూసేసరికి నలువైపులా ఎక్కడా తీరం కనిపించలేదు. తీరం చేరుకోవాలని అది ఉత్తరం వైపుగా ఎగిరిపోయింది. 
 
కాని అలా ఎంతదూరం పోయినా దానికి తీరం కనిపించలేదు. అందువల్ల అది తిరిగి వచ్చి ఓడ స్తంభం పైనే కూర్చుంది. కాసేపటి తర్వాత అది తూర్పు దిశగా ఎగిరిపోయింది. ఆ దిశలో కూడా దానికి తీరం కానరాలేదు. ఆ పక్షి నలువైపులా చూసింది. కేవలం అనంత జలరాశి మాత్రమే కనిపించింది. అప్పుడది ఎంతగానో అలసిపోయి తిరిగి వచ్చి ఓడ స్తంభం పైనే వ్రాలింది. ఈ విధంగా చాలాసేపు విశ్రాంతి తీసుకున్న పిదప అది మళ్లీ దక్షిణ దిశగా వెళ్లింది. అదేవిధంగా పడమటి వైపుగా కూడా వెళ్లింది.
 
తీరం ఎక్కడా కానరావటం లేదని గ్రహించిన తర్వాత అది తిరిగి వచ్చి ఆ ఓడ స్తంభం పైనే వ్రాలింది. మళ్లీ తిరిగి లేవలేదు. ఎలాంటి ప్రయత్నమూ చేయకుండా అలాగే ఉండిపోయింది. ఆ తరువాత దాని మనస్సులో ఎటువంటి అలజడి, అశాంతి చోటుచేసుకోలేదు. సంసారులు సుఖభోగాల నిమిత్తం నలువైపులా తిరుగుతుంటారు. అయితే వారికి అవి ఎక్కడా లభించవు. అలా తిరుగుతూ చివరకు వారు అలసిపోతారు.
 
కామినీ కాంచనాల పట్ల వారికి ఉన్న ఆశక్తి ద్వారా కేవలం దుఃఖాన్ని మాత్రమే పొందినప్పుడు వారికి వైరాగ్యం కలుగుతుంది. త్యాగభావన జనిస్తుంది. చాలామందికి సుఖభోగాలు అనుభవింపనిదే త్యాగబుద్ధి కలుగదు.

అన్నీ చూడండి

విమానం గాల్లో ఎగురుతూ వుండగా భారతీయుడికి ఆస్తమా, కన్నుమూత

సీబీఎస్ఈ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న ఎస్వీఐఎస్ అండర్-14 బాలుర జట్టు

వందేభారత్ రైలు ఢీకొని యువకుడు మృతి.. రీల్స్ చూస్తూ.. బైకుకు తోసుకొచ్చాడా?

రోడ్డు ప్రమాదంలో వరంగల్ సర్పంచ్ మృతి... భర్త రవీందర్ పరిస్థితి విషమం

జార్ఖండ్: రూ. 2.20 కోట్ల రివార్డు.. సీపీఐ మావో నేత ఆకాష్ లొంగుబాటు

అన్నీ చూడండి

Meenakshi Temple: చారిత్రాత్మక ఘట్టం.. మధురై మీనాక్షి అమ్మవారి మహా కుంభాభిషేకం (video)

17-09-2020 గురువారం నాటి రాశి ఫలాలు - ఆర్థికంగా అనుకూలమైన రోజు

గురువారం ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని 108 సార్లు పఠిస్తే?

బుధవారం.. వినాయకుడిని, బుధ గ్రహాన్ని పూజిస్తే.. ఆకుపచ్చ రంగులో...?

16-09-2020 రాశి ఫలాలు - వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి

తర్వాతి కథనం
Show comments