Dharma Sangrah
✕

నీ భర్త బ్రతకాలంటే ఈ ఔషధం మింగి నువ్వు చనిపోవాలి... మరి భార్య ఏమన్నదంటే?

ఒక గురువు తన శిష్యునితో ఇలా అన్నాడు. సంసారం అనేది మిధ్య... నువ్వు నాతోపాటు వచ్చేయి అన్నారు. దాంతో శిష్యుడు, అయ్యా... మా అమ్మానాన్న, భార్య-వీరందరూ నన్ను ఇంతగా ప్రేమిస్తున్నారు. వీరిని వదిలి నేనెలా రాగలను అన్నాడు. అందుకు గురువు అతనితో నువ్వు.. నావాళ్లు

Written By chj
Updated: గురువారం, 20 సెప్టెంబరు 2018 (18:10 IST)
ఒక గురువు తన శిష్యునితో ఇలా అన్నాడు. సంసారం అనేది మిధ్య... నువ్వు నాతోపాటు వచ్చేయి అన్నారు. దాంతో శిష్యుడు, అయ్యా... మా అమ్మానాన్న, భార్య-వీరందరూ నన్ను ఇంతగా ప్రేమిస్తున్నారు. వీరిని వదిలి నేనెలా రాగలను అన్నాడు. అందుకు గురువు అతనితో నువ్వు.. నావాళ్లు, నావాళ్లు అంటున్నావు, నిన్ను ప్రేమిస్తున్నారంటున్నావు. అయితే ఇదంతా నీ భ్రమే. నేను నీకొక కిటుకు నేర్పుతాను. దాని ద్వారా వారు నిన్ను నిజంగా ప్రేమిస్తున్నారా లేదా అన్న విషయం నీకు అర్థమవుతుంది అన్నారు. 
 
ఇలా పలికి గురువు శిష్యునికి ఒక గుళిక ఇచ్చి ఇంటికి వెళ్లాక దీనిని మింగు, దీని ప్రభావంతో నువ్వు పీనుగు వలె బిగుసుకుపోతావు. అయితే నీకు స్పృహ తప్పదు. చుట్టూ జరిగేదంతా వినగలవు, చూడగలవు. నేను వచ్చాక మళ్లీ క్రమంగా సాధారణ స్థితికి వచ్చేస్తావు అని చెప్పారు. శిష్యుడు ఇంటికి వెళ్లి గురువుగారు చెప్పినట్లే చేశాడు. శవంలా పడిపోయాడు. ఇంట్లో ఏడ్పులు, పెడబొబ్బలు మొదలయ్యాయి. తల్లి, భార్య  ఇంకా తక్కినవారందరూ గుండెలు బాదుకుంటూ నేలపై పడి దొర్లుతూ విలపిస్తున్నారు. 
 
అదే సమయంలో ఒక బ్రాహ్మణుడు అక్కడకు వచ్చి ఏమైందని అడిగాడు. ఇతడు చనిపోయాడు అన్నారు వారందరు. బ్రాహ్మణుడు శిష్యుని నాడిని పరీక్షించి... అరె ఇదేమిటి ఇతడు చనిపోలేదు. నేనొక ఔషధం ఇస్తాను. అది పుచ్చుకోగానే మామూలు మనిషైపోతాడు అన్నారు. ఆ మాట వినగానే ఇంట్లోని వారందరి ఆనందానికి అంతు లేకుండా పోయింది. స్వర్గం భువికి దిగి వచ్చినట్లు వారికి తోచింది. 
 
కానీ మీకొక సంగతి చెప్పాలి అంటూ బ్రాహ్మణుడు ఇలా అన్నాడు... ఈ ఔషధాన్ని ముందుగా మరో వ్యక్తి సేవించాలి. ఆ తరువాత మిగిలిన దానిని ఇతడు సేవించాలి. అయితే ఔషధాన్ని ముందుగా సేవించిన వ్యక్తి మరణిస్తాడు. మీరందరూ ఇతనికి కావలసినవారే కదా... అందులో తల్లి, భార్య గుండెలు బాదుకుంటూ విలపిస్తున్నారే... నిస్సంశయంగా వీరు ఆ ఔషధాన్ని పుచ్చుకుంటారు అన్నారు.
 
ఆ మాట వినగానే అందరూ ఏడుపు మాని ముఖముఖాలు చూసుకోసాగారు. ఆ వ్యక్తి తల్లి ఇంత పెద్ద సంసారమే.... నేను పోతే దీనినంతా ఎవరు చూసుకుంటారు అంటూ చింతాక్రాంతురాలయ్యింది. అతని భార్య, నేను పోతే పసిపిల్లల్ని ఎవరు చూస్తారు అని ఊరకుండిపోయింది. శిష్యుడు ఇదంతా చూస్తూ వింటున్నాడు. అతడు వెంటనే లేచి నిలబడి గురువుతో ఇలా అన్నాడు. గురువర్యా..... పదండి వెళ్దాం. నేను కూడా మీతో వచ్చేస్తాను అని గురువు వెంట బయలుదేరాడు.
 
- శ్రీరామకృష్ణ పరమహంస

అన్నీ చూడండి

లక్ష దాటిన విజయవాడ జనసేన మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ మెజారిటీ

అపుడు ఈవీఎంలను నిందించారు.. ఇపుడు ఎవరిని నిందిస్తారు? వైకాపాకు పవన్ ప్రశ్న

జగ్గయ్యపేటలో జనసేన అభ్యర్థి వాసిరెడ్డి మేఘన విజయం

ప్రతిపక్షాలకు పోటీ చేసే అవకాశం ఇవ్వకుండా గెలిచారు.. బాబుపై జగన్ ఫైర్

ఆదోనీ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన రెబల్ ఘన విజయం (Video)

అన్నీ చూడండి

పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. బుధవారం హనుమంతుడికి తమలపాకుల మాలను..?

03-11-2026 మంగళవారం ఫలితాలు - మీ సాయంతో ఒకరికి మేలు జరుగుతుంది...

02-11-2026 సోమవారం ఫలితాలు - పనుల్లో శ్రమ, చికాకులు అధికం...

01-11-2026 ఆదివారం నాటి రాశి ఫలితాలు- ఆ మొత్తంలో కొంత దాచుకోవడం మంచిది..

01-11-2026 నుంచి 07-11-2026 వరకు వార ఫలితాలు - మీ కష్టం ఫలిస్తుంది

తర్వాతి కథనం
Show comments