Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏకాదశి వ్రతమాచరించేవారు ఇవి తినరాదు...

ఆషాఢమాస తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే లేచి, శుచిగా స్నానమాచరించి, శ్రీహరి నిష్ఠ నియమాలతో పూజించాలి. పూజ గదిని శుభ్రం చేసుకుని విష్ణుమూర్తి ప్రతిమకు లేదా పటానికి పసుపు, కుంకుమలు పెట్టి పుష్పాలతో అలంకరించుకోవాలి. తర్వాత చక్కెర పొంగలిని నైవేద్యం

Written By JSK
Updated: గురువారం, 14 జులై 2016 (22:38 IST)
ఆషాఢమాస తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే లేచి, శుచిగా స్నానమాచరించి, శ్రీహరి నిష్ఠ నియమాలతో పూజించాలి. పూజ గదిని శుభ్రం చేసుకుని విష్ణుమూర్తి ప్రతిమకు లేదా పటానికి పసుపు, కుంకుమలు పెట్టి పుష్పాలతో అలంకరించుకోవాలి. తర్వాత చక్కెర పొంగలిని నైవేద్యంగా పెట్టి కర్పూర హారతివ్వాలి.
 
ఏకాదశి వ్రతమాచరించే వారు కాల్చి వండినవి, మాంసాహారం, పుచ్చకాయ, గుమ్మడి కాయ, చింతపండు, ఉసిరి, ఉలవలు, మినుములు తీసుకోకూడదు. అదేవిధంగా మంచంపై శయనించడం చేయకూడదని మన పురాణాలు చెబుతున్నాయి.
 
ఏకాదశి అంటే పదకొండు అని అర్థం. ఐతే, ఈ ఏకాదశి విశిష్టతను గురించి పద్మ పురాణంలో వివరించారు. అష్టకష్టాలతో తల మునుకలౌతున్న మానవజాతిని ఉద్ధరించటానికి సాక్షాత్ శ్రీహరే ఈ ఏకాదశిని ఏర్పాటు చేసాడనీ, ఈ వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించిన వారు సమస్త వ్యధల నుంచీ విముక్తి పొందగలరనీ, మరణానంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుందనీ పద్మ పురాణంలో పేర్కొన్నారు. ఇది ముఖ్యంగా రైతుల పండుగ. ఏరువాక లాగే తొలి ఏకాదశిని వేడుక చేసుకుంటారు. అతివృష్టి, అనావృష్టి లాంటి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకోకూడదని, పైరుకు ఏ రకమైన తెగుళ్ళు సోకకూడదని, ఇతరత్రా ఏ సమస్యలూ ఎదురవకూడదని దణ్ణం పెట్టుకుంటారు.
 
తొలి ఏకాదశి పండుగ నాడు మొక్కజొన్న పేలాలను మెత్తటి పొడిగా దంచి, అందులో నూరిన బెల్లం కలిపి దేవుడికి నైవేద్యంగా సమర్పించి, ప్రసాదంగా తీసుకుంటారు. తొలి ఏకాదశినాడు ఈ పేలపిండిని తప్పకుండా తినాలని విశ్వసిస్తారు.

అన్నీ చూడండి

August 23, 2026: ఆదివారం నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుందంటే?

5 నిమిషాల స్నానం వల్ల రూ. 1.30 లక్షల జరిమానా, ఇది ఎలా జరిగింది?

బొద్దింక సీజేపి అశుతోష్ రంకా ఏడుస్తున్నాడు, నాకు నవ్వొస్తోంది: ఢిల్లీ పోలీసు సోదరి వ్యాఖ్య

టాలెంట్ అంటే ఇదే.. బాబా రాందేవ్‌లా అద్భుత యోగాసనాలు.. వీడియో వైరల్

గుడివాడ చిరంజీవి పుట్టినరోజు వేడుకల్లో కొడాలి నాని.. ఏం జరుగుతోంది?

అన్నీ చూడండి

23-08-2026 ఆదివారం నాటి మీ రాశి ఫలితాలు-అనుకూలతలు అంతంత మాత్రమే

22-08-2026 శనివారం నాటి మీ రాశి ఫలితాలు - బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు

ఇంద్రకీలాద్రి కొండపై భోజనశాల.. లడ్డూ పోటు భవనాలు

21-08-2026 శుక్రవారం నాటి మీ రాశి ఫలితాలు - అనవసర విషయాలకు దూరంగా ఉండండి

Varalakshmi Vratham 2026: వరలక్ష్మీ వ్రతం ఆచరిస్తున్నారా? బ్రహ్మముహూర్తంలో..?

తర్వాతి కథనం
Show comments