Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

ఇతరులకు సహాయం చేస్తే లక్ష్మీ దేవి ఇంట్లో అడుగుపెడుతుందా? లేదా?

ప్రతి ఒక్కరికి డబ్బు చాలా అవసరం. ఆ డబ్బు కోసం అనేక కష్టాలను పడతాము. కష్టపడి పనిచేస్తాం కాని ఫలితం సరిగా వుండదు. అంటే వారి ఇంట లక్ష్మీదేవి లేదన్నమాట. మన ఇల్లు సుఖశాంతులతో సంతోషాలతో నిండిపోవాలంటే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టాలి. లక్ష్మీదేవి అడుగుప

Written By chj
Updated: శుక్రవారం, 23 ఫిబ్రవరి 2018 (21:05 IST)
ప్రతి ఒక్కరికి డబ్బు చాలా అవసరం. ఆ డబ్బు కోసం అనేక కష్టాలను పడతాము. కష్టపడి పనిచేస్తాం కాని ఫలితం సరిగా వుండదు. అంటే వారి ఇంట లక్ష్మీదేవి లేదన్నమాట. మన ఇల్లు సుఖశాంతులతో సంతోషాలతో నిండిపోవాలంటే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టాలి. లక్ష్మీదేవి అడుగుపెట్టిన ఇంట్లో ధనంతో పాటు దేనికి కొదవ వుండదు. అయితే సరైన పద్ధతిలో లేని ఇంటికి లక్ష్మీదేవి రాదట. అది ఏమిటో తెలుసుకొని జాగ్రత్త పడితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువుతీరే అవకాశం ఉందని శాస్త్రం చెబుతుంది. 
 
1. ఎక్కువగా స్త్రీలు లక్ష్మీదేవిని పూజిస్తూ ఉండాలి. దేవికి ప్రత్యేకంగా కొన్ని వారాలు అంటే చాలా ఇష్టం. మంగళ, గురు, శుక్రవారాలు అంటే ఇష్టం. ఈ మూడు వారాలలో శుక్రవారం అంటే ఏంతో ప్రీతి. ఈ రోజున స్త్రీలు ఉదయాన్నే లేచి వాకిళ్ళు శుభ్రం చేసి ముగ్గులు పెట్టాలి. గుమ్మాలు తుడిచి పసుపు రాసి కుంకుమ, గంధం బొట్టులను పెట్టాలి. అంతేకాదు దేవికి తెల్లపూలు అంటే చాలా ఇష్టం. ఈ పూలతో అష్టోత్తరం చేయడం వలన మంచి ఫలితం వుంటుంది. మనకు తెలియకుండా కొన్ని పనులు చేస్తాము. వాటి వలన కూడా లక్ష్మీదేవి దూరం అవుతుంది. 
 
2. తులసిని పూజించని చోట, పెద్దవారిని దూషించిన చోట, ఇతరుల తప్పులను ఏకరువు పెట్టిన చోట, వాకిట్లో ముగ్గు లేని చోట, లక్ష్మీదేవి నివశించదు. ఇల్లు కళకళలాడుతూ, పేదవారికి సహాయం చేస్తూ, మంగళ, శుక్రవారాలలో దేవిని పూజిస్తూ, పశుపక్షులను ప్రేమించే చోట, అందరూ సంతృప్తిగా వుండే చోట లక్ష్మీదేవి ఇష్టంగా ఉంటుంది. సాయంసంధ్యావేళలో ముఖద్వారాలను మూసి వేయకూడదు. గుమ్మంపై కూర్చోరాదు. ఇంటిలో ఆడవారు కన్నీరు పెట్టకూడదు. అలాంటి ఇళ్ళలో లక్ష్మీదేవి కొలువు ఉండదు. సంపద మన ఆధీనంలోఉండాలి కాని మనం సంపద ఆధీనంలో ఉండకూడదు. ఇతరులకు సహాయం చేయడం వలన సంపద పెరుగుతుంది. మనం తృప్తిగా సంతోషంగా ఉంటాము.

అన్నీ చూడండి

కడుపు నొప్పి... హీలియం గ్యాస్ పీల్చి 36 ఏళ్ల టెక్కీ ఆత్మహత్య

సైబర్ నేరగాళ్ల డిజిటల్ అరెస్టు : యువతి ఆత్మహత్య

ఏపీలో స్థానిక సమరం : నేడు మేయర్ స్థానాలపై కసరత్తు

అనగనగా ఓ బిచ్చగాడు... ఆయనకు 21 మంది భార్యలు.. ఎక్కడ?

పెళ్లయిన మూడో రోజే భర్త - అత్త మామల హత్యకు భోజనంలో విషం పెట్టిన భార్య

అన్నీ చూడండి

12-10-2026 సోమవారం రాశిఫలాలు - ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. పందెపు పోటీల్లో విజయం...

11-10-2026 ఆదివారం మీ రాశి ఫలాలు - ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది

11-10-2026 నుంచి 17-10-2026 వరకు మీ వార రాశి ఫలితాలు.. ఏ విషయాన్నీ..?

Sabarimala: శబరిమల యాత్రికుల కోసం QR కోడ్‌లు, సమాచార కేంద్రాల ఏర్పాటు

10-10-2026 శనివారం నాటి రాశి ఫలాలు... ఆర్థిక ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది

తర్వాతి కథనం
Show comments