Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేవాలయాల్లో ఇచ్చే తీర్థప్రసాదాన్ని నెత్తికి రాసుకుంటున్నారా? కాస్త ఆగండి

గుడిలో తీర్థాన్ని పంచామృతంతో తయారు చేస్తారు. అందులోని పంచదార, తేనే వంటివి మన జుట్టుకు మంచిది కాదు. తులసి తీర్థం కూడా తీసుకున్నప్పుడు తలకు రాసుకోవడం మంచిది కాదని పండితులు సూచిస్తున్నారు. ఇంకా తీర్థం తీ

Written By Selvi
Updated: మంగళవారం, 14 ఫిబ్రవరి 2017 (18:33 IST)
దేవాలయాలకు వెళ్తే కుంకుమ ప్రసాదం తీసుకుంటాం. తీర్థ ప్రసాదం తీసుకుంటాం. కుంకుమను నుదుటన పెట్టుకుంటాం. అదే తీర్థాన్ని స్వీకరిస్తాం. అంతటితో ఆగకుండా ఆ చేతిని తలపై రాసుకుంటాం. అయితే ఈ పద్ధతి మంచిది కాదని పండితులు అంటున్నారు.

చేతులతో ప్రార్థనలు చేస్తే సరికానీ తీర్థాన్ని తీసుకున్న తరువాత చేతులను తలపై రాయకూడదని శాస్త్రాలు చెప్తున్నాయట. ముఖ్యంగా గంగా జలంతో అభిషేకం చేసిన తీర్థాన్ని మాత్రమే తలపై రాసుకోవచ్చునని పండితులు అంటున్నారు. అంతేకానీ గుడిలో ఇచ్చే తీర్థాన్ని నెత్తిపై రాసుకోవడం మంచిది కాదు.
 
సాధారణంగా గుడిలో తీర్థాన్ని పంచామృతంతో తయారు చేస్తారు. అందులోని పంచదార, తేనే వంటివి మన జుట్టుకు మంచిది కాదు. తులసి తీర్థం కూడా తీసుకున్నప్పుడు తలకు రాసుకోవడం మంచిది కాదని పండితులు సూచిస్తున్నారు. ఇంకా తీర్థం తీసుకున్న తర్వాత చేతికి ఎంగిలి అంటుకుంటుంది. ఆ చేయినే తలకు రాసుకోవడం మంచి ఫలితాలను ఇవ్వదని వారు చెప్తున్నారు.

అందుచేత తీర్థం తీసుకున్న చేతిని సాధారణంగా నీటితో కడుక్కోవాలని ఆధ్యాత్మిక పండితులు సెలవిస్తున్నారు. తీర్థం తీసుకున్న తర్వాత ఆ చేతిని నెత్తికి రాసుకోవడం చేయకూడదు. దోషమవుతుంది. జేబు రుమాలుతో తుడుచుకుని తీసుకోవాలి. లేదా కండువాతో తుడుచుకోవాలని వారు సూచిస్తున్నారు. 

అన్నీ చూడండి

మరికావలస గిరిజన పాఠశాల తరలింపు.. చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు

Amalapuram: పవన్ కళ్యాణ్ పుట్టినరోజు... ఫ్లెక్సీని ఏర్పాటు చేస్తుండగా అభిమాని మృతి

Narayanpet: వివాహ వేడుకలో విషాదం.. డీజే డ్యాన్స్ చేస్తూ యువకుడి మృతి

పవన్ కళ్యాణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు

గంగిగోవు పాలు గరిటడైనను చాలు.. ఇదీ పవన్ కళ్యాణ్ రాజకీయం

అన్నీ చూడండి

Tirumala: సర్వ దర్శన్ టోకెన్ల జారీని రద్దు చేసిన టీటీడీ

02-09-2026 బుధవారం రాశి ఫలితాలు... సమయపాలన అవసరం

ఇంట్లో నల్లటి గ్లాస్ టాప్ గ్యాస్ స్టవ్ వాడటం మంచిది కాదా?

krishna Jayanti 2026 worship: శ్రీ కృష్ణుని జయంతి రోజున ఈ ఐదు విషయాలు పాటిస్తే...?

01-09-2026 మంగళవారం రాశి ఫలితాలు... ఇతరుల మాటలను నమ్మి తొందరపడి..?

తర్వాతి కథనం
Show comments