శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ivr
Last Modified: శనివారం, 29 అక్టోబరు 2016 (18:22 IST)

దేవాలయాలకు దూపదీప నైవేద్యం... రాష్ట్రంలోని 1371 వేల ఆలయాలకు నిధులు

రాష్ట్రంలోని దేవాలయాలకు జవజీవాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇప్పటికే రాష్ట్రంలోని ఎన్నో దేవాలయాల జీర్ణోద్ధరణకు చర్యలు చేపట్టని రాష్ట్ర ప్రభుత్వం మరెన్నో కార్యక్రమాలను నిర్వహించాలని భావిస్తోంది. దేవాలయాల్లో ప్రవేశపెట్టిన దూపదీప నైవ

రాష్ట్రంలోని దేవాలయాలకు జవజీవాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇప్పటికే రాష్ట్రంలోని ఎన్నో దేవాలయాల జీర్ణోద్ధరణకు చర్యలు చేపట్టని రాష్ట్ర ప్రభుత్వం మరెన్నో కార్యక్రమాలను నిర్వహించాలని భావిస్తోంది. దేవాలయాల్లో ప్రవేశపెట్టిన దూపదీప నైవేద్యం కార్యక్రమం సత్ఫలితాలనిస్తోంది. రాష్ట్రంలోని పలు దేవాలయాలు సౌకర్యాల లేమితో సతమతమవుతున్నాయ్. అలాంటి వాటిలో కనీస సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టింది. ముఖ్యంగా దూపదీప నైవేద్యం కార్యక్రమంతో అటు అర్చకుల్లోనూ, అటు భక్తుల్లోనూ సదాభిప్రాయాన్ని కలిగిస్తోంది. 
 
దేవాలయాలకు దూపదీప నైవేద్యం
రాష్ట్రంలో ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలతో దేవాదాయశాఖలో సమూల మార్పులను తీసుకొస్తున్నరాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని దేవాలయాల బాగోగులను చూసుకుంటోంది. ఎక్కడైతే దేవాలయాల్లో  దూపదీప నైవేద్యం సమర్పించలేని పరిస్థితి, అర్చకులకు వేతనాలు చెల్లించలేని పరిస్థితులు ఉన్నాయో... ఆయా ప్రాంతాల్లోని మందిరాలకు దేవాదాయ శాఖ సహాయసహకారాలు అందిస్తోంది. 
 
సాయం కోసం విజ్ఞప్తులు
రాష్ట్రంలోని పలు దేవాలయాలకు సాయం చేయాలంటూ ప్రభుత్వానికి, దేవాదాయ శాఖకు అందిన విజ్ఞాపనల మేరకు రాష్ట్ర ప్రభత్వం అనేక చర్యలు చేపట్టింది. వాటిలో భాగంగా ఇబ్బందులెదుర్కొంటున్న1371 దేవాలయాలకు నెలకు రూ. 5 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది. చెల్లించే రూ. 5 వేల మొత్తంలో రెండు వేల రూపాయలను దూపదీప నైవేద్యం కోసం వినియోగిస్తుండగా...  మరో రూ. 3000 అర్చకులకు గౌరవ వేతనం కింద చెల్లిస్తున్నారు. తొలుత రెండున్నర వేల రూపాయలను మాత్రమే ఈ పథకం కింద చెల్లించగా... ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు ఈ పథకానికి అందిస్తున్న మొత్తం 2015 ఆగస్టు నుంచి రెట్టింపు చేశారు. ప్రస్తుతం దూపదీప నైవేద్యం కింద ఎంపిక చేసిన దేవాలయాలకు నెలకు రూ. 5 వేల చొప్పున నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. 
 
ఏటా రూ. 8 కోట్ల మేర సాయం
గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న దేవాలయాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. దూపదీప నైవేద్యం కార్యక్రమం నిర్వహణతో ఆయా ఆలయాల్లో సందడి వాతావరణ నెలకొంటోంది. క్రమేణ ఆయా ఆలయాలు సుసంపన్నమయ్యే అవకాశముందున్న అభిప్రాయం కలుగుతోంది. రాష్ట్రప్రభుత్వం నిర్వహిస్తున్న దూపదీప నైవేద్యం కార్యక్రమం కోసం నెలకు  67 లక్షల మొత్తాన్ని వెచ్చిస్తున్నారు. ఏటా ఈ పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 8 కోట్లకు పైగా ఖర్చు చేస్తోంది. 
 
దూపదీప నైవేద్యం కోసం ఆలయాలకు చెల్లిస్తున్న మొత్తం పూర్తిగా సద్వినియోగమయ్యేలా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. ఆయా ఆలయాలకు అందిస్తున్న సాయం మొత్తాన్ని నెల నెల ఆయా దేవాలయాల అకౌంట్లోకి జమ చేస్తోంది. ఆన్ లైన్ చెల్లింపుల ద్వారా అటు అర్చకులలో జవాబుదారీ తనాన్ని తీసుకురావాలని దేవాదాయ శాఖ భావిస్తోంది. దేవాలయాలకు రోజువారీ నిర్వహించే కార్యక్రమాలకు కాకుండా, పండుగ రోజుల్లో ఏర్పాటు చేసే ప్రత్యేక కార్యక్రమాలకు సైతం దేవాదాయ శాఖ సాయమందిస్తోంది. అటు భక్తుల నుంచి పెద్ద ఎత్తున స్పందన రావడం ద్వారా వచ్చే రోజుల్లో దేవాలయాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని శాఖ ఆలోచిస్తోంది.
 
దేవాలయాల పరిరక్షణకు సర్కారు చర్యలు
రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో ఉన్న దేవాలయాల స్థితిగతులపై రాష్ట్ర ప్రభుత్వం లోతుగా పరిశీలిస్తోంది. ఆయా ఆలయాల సమర్థవంతమైన నిర్హహణకు చేపట్టాల్సిన చర్యలపై ప్రభుత్వం పలు ప్రతిపాదనలు చేస్తోంది. ఇప్పటికే దేవాలయాల పరిరక్షణకు పూర్తి స్థాయిలో మద్దతిస్తూనే... ఆయా ఆలయాలకు కావాల్సిన అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తోంది.
 
అర్చకులకు సహకారం
దేవాలయాల్లో పనిచేసే నిరుపేద బ్రహ్మాణుల స్థితిగతులపై అనేక పర్యాయాలు అధ్యయనం చేసిన ప్రభుత్వం పలు సందర్భాల్లో సాయం చేసేందుకు దేవాలయాల ఆదాయంలో మూడు శాతం వినియోగించేందుకు ఆమోదం తెలిపింది. వారి అవసరాలను బట్టి అనేక విధాలుగా ఆయా కుటంబాలకు ఆర్థిక సహాయాన్ని అందించే వ్యవస్థను దేవాలయాల్లో ఏర్పాటు చేశారు.
 
భక్తుల్లో సంతోషం
ప్రభుత్వం నిర్వహిస్తున్న దూపదీప నైవేద్యం కార్యక్రమం పట్ల భక్తుల్లో పెద్ద ఎత్తున సంతోషం వ్యక్తమవుతోంది. ఆయా దేవాలయాలు వెళ్లేందుకు ప్రభుత్వ తీసుకుంటున్న నిర్ణయాలు ఆనందాన్ని కలిగిస్తున్నాయని భక్తులు అభిప్రాయపడుతున్నారు. తమకు చేతనంత రీతిలో దేవాలయాల జీర్ణోద్ధరణకు సాయపడుతున్నట్టు వారు చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి సాయం అందడంతో తాము కూడా దేవాలయాల అభివృద్ధికి సహకారం అందిస్తున్నట్టు ఆయా ప్రాంతాల్లోని భక్తులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.