శుక్రవారం, 28 ఫిబ్రవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ttdj
Last Modified: శుక్రవారం, 10 జూన్ 2016 (13:40 IST)

తిరుమ‌ల‌లో అగ్నిప్ర‌మాదం... త‌గ‌ల‌బ‌డిన నెయ్యి ట్యాంకులు(Video)

తిరుమల: తిరుమలలోని శ్రీవారి లడ్డు ప్రసాలు తయారుచేసే బూందీ తయారీ కేంద్రంలో అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని మాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని, మంటలు ఆర్పారు. సుమారు 20 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఓవర్‌హీట్ కారణంగా నూన

తిరుమల: తిరుమలలోని శ్రీవారి లడ్డు ప్రసాలు తయారుచేసే బూందీ తయారీ కేంద్రంలో అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని మాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని, మంటలు ఆర్పారు. సుమారు 20 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఓవర్‌హీట్ కారణంగా నూనె, నెయ్యి ట్యాంకులకు మంటలు అంటుకుని ప్రమాదం జరిగిందని టీటీడీ అధికారులు చెబుతున్నారు. ఘటనా స్థలిని తిరుమల జేఈఓ శ్రీనివాసరాజు.... ఇతర అధికారులు పరిశీలిస్తున్నారు.