Webdunia - Bharat's app for daily news and videos

Install App

కల్పవృక్షవాహనంపై ఊరేగిన గోవిందరాజస్వామి

Written By ttdj
Updated: మంగళవారం, 17 మే 2016 (15:53 IST)
తిరుపతి గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగవైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి, అమ్మవార్లు కల్పవృక్ష వాహనంపై వూరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. వాహనం ముందు గజరాజులు ఠీవీగా కదులుతుండగా భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలు, కేరళ కళాకారుల డ్రమ్స్, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. 
 
కల్పవృక్ష వాహన ప్రాశస్త్యాన్ని పరికిస్తే... ప్రకృతికి శోభను సమకూర్చేదే చెట్టు. అనేక విధాలైన వృక్షాలు సృష్టిలో ఉన్నాయి. అందులో మేటి కల్పవృక్షం. ఇతర వృక్షాలు తమకు కాచిన ఫలాలను మాత్రమే ప్రసాదిస్తాయి. అలా కాకుండా కల్పవృక్షం వాంఛిత ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. సముద్ర మథనంలో సంకల్ప వృక్షంగా ఆవిర్భవించిన దేవతావృక్షం కల్పవృక్షం. భక్తుల కోరికలు తీర్చే కోనేటిరాయుడు ఈ కల్పవృక్షాన్ని అధిరోహించి భక్తులను అనుగ్రహించడమే ఈ వాహన్ ప్రత్యేకతగా చెప్పుకుంటారు. 

అన్నీ చూడండి

గద్గద స్వరంతో కన్నీటి పర్యంతమవుతూ మృతుల వివరాలను వెల్లడించిన సద్గురు, మిన్నంటిన రోదనలు, వీడియో

మా ఆయన నీ ప్రియురాలితో తిరుగుతున్నాడు: జిమ్ ట్రైనర్‌ను గొంతులో పొడిచి హత్య

Nallari Kiran Kumar Reddy: నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి గవర్నర్ పదవి దక్కనుందా?

నాన్న తాగే ప్రోటీన్ షేక్‌లో రసాయనాలు కలిపి చంపేశాడు.. అమ్మను హింసించాడు..

మద్యం మత్తులో ముగ్గురు మహిళలు ఇద్దరు యువకులపై..?

అన్నీ చూడండి

శబరిమల ఆలయంలో బంగారం మాయం.. ప్రశాంత్‌కు మెదడులో రక్తస్రావం

27-08-2026 రాశి ఫలితాలు, కీలక పత్రాలు అందుకుంటారు

కైలాస మానససరోవర యాత్ర ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఆధ్యాత్మిక యాత్ర, ఎందుకు?

26-08-2026 ఫలితాలు - ధన సమస్యలు ఎదురవుతాయి

లడ్డూ ప్రసాదానికి సంబంధించిన వీడియోలను షేర్ చేయవద్దు.. టీటీడీ

తర్వాతి కథనం
Show comments