సోమవారం, 2 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By జె
Last Modified: మంగళవారం, 25 ఆగస్టు 2020 (19:22 IST)

ఆ ట్రస్టుకు డబ్బులు కడితే చాలు... శ్రీవారి దర్శనం సులువు, ఎక్కడ పొందాలి?

శ్రీవాణి ట్రస్టును టిటిడి అమలు చేస్తున్న విషయం తెలిసిందే. 10 వేల రూపాయలు ఏ భక్తుడు చెల్లించినా వారికి శ్రీవాణి ట్రస్టు ద్వారా దర్సన భాగ్యాన్ని కల్పిస్తారు. మొదట్లో ఈ ట్రస్టు ద్వారా ఎంతోమంది భక్తులు స్వామివారిని దర్సించుకున్నారు. అయితే కరోనా పుణ్యమా అని భక్తుల సంఖ్య తగ్గడం.. దాంతో పాటు శ్రీవాణి ట్రస్టు ద్వారా దర్సనం చేసుకునే భక్తుల సంఖ్య తగ్గిపోయింది.
 
అయితే మళ్ళీ టిటిడి ఈ ట్రస్టు ద్వారా భక్తులకు దర్శనాన్ని కల్పించేందుకు సిద్ధమైంది. శ్రీవాణి ట్రస్టు దాతల సౌకర్యార్థం 2020 సెప్టెంబర్ నెలలో ప్రతిరోజు వంద ఆన్‌లైన్ బ్రేక్ దర్సనం టిక్కెట్ల కోటాను టిటిడి అందుబాటలో ఉంచింది. ఇందులో భాగంగా దాతలు శ్రీవాణి ట్రస్టు ద్వారా 10,000 ఆన్లైన్‌లో లేదా తిరుమలలోని అదనపు ఈఓ కార్యాలయంలో కరెంట్ బుకింగ్ ద్వారా చెల్లించి ఉదయం బ్రేక్ దర్సనం టిక్కెట్లు పొందవచ్చు.
 
అయితే సెప్టెంబర్ 19వ తేదీ శ్రీవారి నవాహ్నిక వార్షిక బ్రహ్మోత్సవాలకు ధ్వజారోహణం, సెప్టెంబర్ 23వ తేదీన గరుడసేవ ఉన్న కారణంగా ఈ రెండురోజుల పాటు టిక్కెట్లను టిటిడి రద్దు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విసృతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో దాతల విజ్ఞప్తి మేరకు జూలై 30వ తేదీ నుంచి శ్రీవాణి ట్రస్టు ద్వారా 10 వేలు చెల్లించి టిక్కెట్లు పొందిన దాతల దర్సన కాలాన్ని ప్రస్తుతం ఉన్న ఆరు నెలల కాలపరిమితిని సంవత్సరానికి టిటిడి పెంచింది.