శ్రీవారు నాకు మరో ఏడాది అవకాశం ఇచ్చారు.... సీఎం బాబు ఆ పని చేస్తారని నాకు తెలుసు... టిటిడి ఛైర్మన్‌

ప్రపంచ నలుమూలల నుంచి తిరుమలకు వచ్చే సామాన్య భక్తులకు మరిన్ని సేవలను అందించడానికి శ్రీవారు మరో యేడాది తనకు అవకాశం ఇచ్చారన్నారు టిటిడి పాలకమండలి ఛైర్మన్‌ చదలవాడ క్రిష్ణమూర్తి. టిటిడి పాలకమండలిని మరో యేడాది కొనసాగిస్తూ దేవదాయ శాఖ ముఖ్యకార్యదర్శి జె.ఎస్‌

మంగళవారం, 3 మే 2016 (13:44 IST)
ప్రపంచ నలుమూలల నుంచి తిరుమలకు వచ్చే సామాన్య భక్తులకు మరిన్ని సేవలను అందించడానికి శ్రీవారు మరో యేడాది తనకు అవకాశం ఇచ్చారన్నారు టిటిడి పాలకమండలి ఛైర్మన్‌ చదలవాడ క్రిష్ణమూర్తి. టిటిడి పాలకమండలిని మరో యేడాది కొనసాగిస్తూ దేవదాయ శాఖ ముఖ్యకార్యదర్శి జె.ఎస్‌.వి.ప్రసాద్ నుంచి జిఓ పత్రాలు ఛైర్మన్‌ చేతికి అందగానే ఒక్కసారిగా కన్నీటి పర్యంతమయ్యారు చదలవాడ. 
 
టిటిడి పాలకమండలి అధ్యక్షుడిగా మరో యేడాది సిఎం తనను పొడిగిస్తారన్న నమ్మకం తనకు ఎప్పటినుంచో ఉందని చెప్పారు చదలవాడ. గత సంవత్సర కాలంలో తమ పాలకమండలి సామాన్య భక్తులకు అవసరమైన ఎన్నో నిర్ణయాలను తీసుకున్నామని గుర్తుచేసుకున్నారు. తిరుమలకు ఎంత రద్దీ వచ్చిన అందరికీ ఒక్కరోజులోనే దర్శనభాగ్యం కల్పిస్తున్నామంటే అదంతా తమ పాలకమండలి తీసుకున్న నిర్ణయాలేనన్నారు టిటిడి ఛైర్మన్‌.
 
విఐపిలకు ఎప్పుడు తాను వ్యతిరేకమన్నారు. విఐపిలకు పెద్దపీట వేసే నిర్ణయాలు ఎప్పుడూ తీసుకోలేదని, ఇక మీదట కూడా తీసుకోబోమని కూడా చెప్పారు. లడ్డూ ధరను పెంచే ఆలోచన కూడా ఇప్పట్లో లేదన్నారు చదలవాడ క్రిష్ణమూర్తి.

అన్నీ చూడండి

శుద్ధి చేసిన యురేనియంను మాకు ఇస్తారా లేదా నాశనం చేస్తారా? ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్

Ebola : ఆఫ్రికాలో ఎబోలా-విజయవాడ ఎయిర్‌పోర్టులో పరీక్షా కేంద్రం

తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయిన మావో అగ్రనేత నరహరి

సొంత పార్టీ మంత్రి కందుల దుర్గేశ్‌కు ముచ్చెమటలు పోయించిన డిప్యూటీ సీఎం పవన్ (వీడియో)

వైవీ సుబ్బారెడ్డి పీఏ చిన్నప్పపై ఏసీబీ అక్రమాస్తుల కేసు- తిరుమల నెయ్యి కల్తీలోనూ..

అన్నీ చూడండి

Eid Al-Adha 2026 date: తెలుగు రాష్ట్రాల్లో మే 28, 2026 గురువారం బక్రీద్.. సెలవు దినం

26-05-2026 మంగళవారం ఫలితాలు - ధనసహాయం తగదు

25-05-2026 సోమవారం ఫలితాలు - ఖర్చులు అదుపులో ఉండవు.. ముఖ్యుల కలయిక వీలుపడదు...

24-05-2026 ఆదివారం ఫలితాలు - సంతోషకరమైన వార్త వింటారు

24-05-2026 నుంచి 30-05-2026 వరకు ఫలితాలు - రుణ ఒత్తిళ్లతో మనశ్శాంతి ఉండదు

తర్వాతి కథనం
Show comments