Webdunia - Bharat's app for daily news and videos

Install App

తితిదే ఆన్‌లైన్‌లో 54,421 సేవా టిక్కెట్ల విడుదల - 10 నిమిషాల్లో హాంఫట్

తిరుమల తిరుపతి దేవస్థానం సర్వర్‌ను హ్యాక్ చేసేస్తున్నారు దళారీలు. ఆన్లైన్లో సేవా టిక్కెట్లను పెట్టడమే తరువాయి. ఇంటర్నెట్ ముందు వందలమంది కూర్చుని సేవా టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసేస్తున్నారు. భక్తుల దగ్గర ముందే డబ్బులు తీసుకునే దళారీలు వందల టిక్కెట్లను డ

Written By TJ
Updated: శుక్రవారం, 5 మే 2017 (16:09 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం సర్వర్‌ను హ్యాక్ చేసేస్తున్నారు దళారీలు. ఆన్లైన్లో సేవా టిక్కెట్లను పెట్టడమే తరువాయి. ఇంటర్నెట్ ముందు వందలమంది కూర్చుని సేవా టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసేస్తున్నారు. భక్తుల దగ్గర ముందే డబ్బులు తీసుకునే దళారీలు వందల టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసేస్తున్నారు. 
 
తితిదే ఆన్‌లైన్‌లో ఉదయం 11 గంటల సమయంలో 54,421 సేవా టిక్కెట్లను విడుదల చేస్తే 10 నిమిషాల్లో ప్రధాన ఆర్జిత సేవా టిక్కెట్లన్నీ హాం ఫట్ అయ్యాయి. టిటిడి అధికారులే ఇది చూసి ఆశ్చర్యపోతున్నారు. ఆన్‌లైన్ సైట్‌ నుంచి ఎవరైనా డౌన్ లోడ్ చేసుకునే అవకాశం ఉండడంతో రెచ్చిపోతున్నారు దళారీలు.
 
తితిదే విడుదల చేసిన సేవా టిక్కెట్ల వివరాలను చూస్తే సుప్రభాతం 1,550, అష్టదళపాద పద్మారాధన 120, నిజపాద దర్శనం 800, ఆగష్టు నెలకు సుప్రభాతం 7,956, తోమాలసేవ - 140, అర్చన 140, విశేషపూజ - 1,125, అష్టదళపాదపద్మారాధన - 300, నిజపాద దర్శనం - 1,727, కళ్యాణోత్సవం - 9,750, ఊంజల్ సేవ - 2,600, ఆర్జిత బ్రహ్మోత్సవం - 5,590, వసంతోత్సవం - 10,750, సహస్రదీపాలంకరణ సేవ - 11,875 సేవాటిక్కెట్లను ఆన్‌లైన్‌లో ఉంచారు. సుప్రభాతం, తోమాలసేవ, అర్చన, నిజపాద దర్శనం టిక్కెట్లు 10 నిమిషాల్లోనే ఖాళీ అయ్యాయి. మరి సామాన్య భక్తులకు న్యాయం ఎలా జరుగుతుంది? లక్షకుపైగా టిక్కెట్లు విడుదల చేసిన మొదటి 10నిమిషాల్లో వ్యవధిలోనే ప్రధాన ఆర్జిత సేవా టిక్కెట్లు మొత్తం అయిపోయాయి.

అన్నీ చూడండి

ఆగష్టు 7, 2026 నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణ సూచన ఎలా వుందంటే..?

అస్సాంలో పదవ తరగతి విద్యార్థిపై హత్యాచారం.. ఫంక్షన్‌కు వెళ్లిన తల్లి.. మంచంపై విగతజీవిగా..?

పొగాకు రైతుల ప్రయోజనాలను కాపాడటంలో సర్కారు విఫలం.. వైఎస్ జగన్

ప్రేమ పేరుతో మోసం చేశాడు.. నేను ఏడు నెలల గర్భిణి.. న్యాయం కావాలి (video)

ఆగస్టు 15న కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయనున్న తెలంగాణ సీఎం

అన్నీ చూడండి

07-08-2026 నాటి రాశి ఫలితాలు.. ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటారు

తుమ్ములు వచ్చేటప్పుడు కూడా భగవన్నామ స్మరణ ఎందుకు..? యముడు చెప్పిన కథేంటి?

06-08-2026 నాటి రాశి ఫలితాలు.. శ్రమ అధికం, ఫలితం శూన్యం

Bhadrachalam: గోదావరి పుష్కరాలకు ముందే భద్రాద్రి పునరుద్ధరణ పనులు పూర్తి

05-08-2026 నాటి రాశి ఫలితాలు... ఈ రోజు అనుకూలదాయకమే

తర్వాతి కథనం
Show comments