సోమవారం, 18 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. 2016 రౌండప్
Written By DV
Last Updated : గురువారం, 29 డిశెంబరు 2016 (16:31 IST)

2016... టాలీవుడ్ హీరోయిన్లు ఏం చేశారంటే...?

సినిమారంగంలో గ్లామర్‌కే పెద్ద పీట వేస్తారు. అందుకు హీరోయిన్లనే దర్శక నిర్మాతలు, హీరోలు ఎంచుకుంటారు. పురుషాధిక్య సమాజంలో స్త్రీకి సరైన పాత్రలు దొరకడం కష్టమని.. ఆ మధ్య రకుల్‌ప్రీత్‌ సింగ్‌ వంటివారు వ్యా

సినిమారంగంలో గ్లామర్‌కే పెద్ద పీట వేస్తారు. అందుకు హీరోయిన్లనే దర్శక నిర్మాతలు, హీరోలు ఎంచుకుంటారు. పురుషాధిక్య సమాజంలో స్త్రీకి సరైన పాత్రలు దొరకడం కష్టమని.. ఆ మధ్య రకుల్‌ప్రీత్‌ సింగ్‌ వంటివారు వ్యాఖ్యానించారు కూడా. తను గీతా ఆర్ట్స్‌లో కొన్ని చిత్రాలు చేసింది. ఈ ఏడాది హీరోయిన్ల కెరీర్‌ను పరిశీలిస్తే.. దాదాపు అందరూ హీరోకు సపోర్ట్‌గా వుండాలి కనుక అలాంటి పాత్రలే దక్కాయి. ఒకరిద్దరి సమాన స్థాయి పాత్ర లభించడం విశేషం. ఇందులో 'అ..ఆ'లో సమంతకు చివరివరకు హీరోతో కనెక్ట్ అయ్యే పాత్ర దొరికింది. ఇక కొంతమంది హీరోయిన్లుగా చేస్తూ.. మరో హీరో సినిమాలో ప్రత్యేక సాంగ్‌పేరుతో లాగించేశారు. అందుకు భారీగా రెమ్యునరేషన్‌ తీసుకున్నా... వున్నంతలో వచ్చిన అవకాశాన్ని సద్దినియోగం చేసుకోవడం ఇప్పటి కథానాయికల తీరుగా కనబడుతుంది.
 
అయితే 2016లో తెలుగు చిత్రసీమలో రాణించిన కథానాయికలందరూ అలా పాత్రల్లో ఒదిగిపోయిన వారే. కొందరు తమ పాత్ర వరకూ మెప్పించినా కొన్ని కథలు ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. కానీ పాత్రేదిచ్చినా అభినయించడంలో ఎవరికి వారే సాటి అన్నట్టు చేశారు. నయనతార నుంచి ఇప్పుడిప్పుడే స్టార్‌గా ఎదుగుతున్న లావణ్య త్రిపాఠి వరకూ అందరూ భలే మెప్పించారు. ఒక్కసారి 2016లో ఆయా హీరోయిన్ల పరిస్థితి ఎలా ఉందో చూద్దాం.
 
రెండుసార్లు అథితిగానే అనుష్క
 
అనుష్క విషయానికి వస్తే.. నాయిక ప్రాధాన్యతగల కథలు, కమర్షియల్‌: దేనికైనా సరితూగగలదు. పదేళ్లుగా అగ్రనటిగా కొనసాగుతోంది. 2015లో కాల్షీటు ఖాళీలేదు. బాహుబలి, రుద్రమదేవి, సైజ్‌ జీరో.. బిజీగా వుండేది. కానీ ఈ ఏడాది కాస్త విరామం తీసుకుంది. సోగ్గాడే చిన్నినాయన, ఊపిరి చిత్రాల్లో తళుక్కుమని మెరిపించింది. అయితే పూర్తిస్థాయి పాత్రలు కాకపోవడం ప్రత్యేకత.
 
బాహుబలిలో కత్తియుద్ధాలు, గుర్రపుస్వారీ నేర్చుకున్న ఆమె.. తాజాగా నాగార్జున, కె. రాఘవేంద్రరావు కలకయితో.. 'ఓం నమో వేంకటేశాయ'లో కృష్ణమ్మగా విశిష్ట పాత్రను పోషించింది. 'సింగం 3' విడుదల కావాల్సి ఉంది. సాంకేతిక కారణావల్ల వచ్చే ఏడాదికి వెళ్ళింది. ఇంకోవైపు 'భాగమతి'పై ఆశలు పెంచకుంది. నాయిక ప్రాధాన్యత వుంది. తన కెరీర్‌లో మరో మలుపు తిరుగుతుందని ఆశిస్తోంది.
 
పెళ్లి గురించి..
బెంగుళూరుకు చెందిన వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోనున్నట్లు గుసగుసలు వినిపించాయి. త్వరలో పెల్లికి సిద్ధమేనంటూ. సరైన సమయం రాలేదంటూ చెబుతోంది. వచ్చే ఏడాదినైనా పెళ్లి చేసుకుంటుందని సినీవర్గాలు చెబుతున్నాయి.

ఆమెను రామ్ చరణ్ పట్టుబట్టి తీసుకున్నాడు...
ఈమె హీరోయిన్‌గా వుండాలని.. పట్టుబట్టి.. రామ్‌చరణ్‌ 'ధృవ'లో తీసుకున్నాడు. అంతకుముందు బ్రూస్‌లీలో నటించింది. ప్రస్తుతం వున్న గ్లామర్‌ హీరోయిన్లలో ఈమె పేరు ముందంజలో వుంది. తను మూడు సినిమాల్లో నటించింది. 'నాన్నకు ప్రేమతో', 'సరైనోడు', 'ధృవ'లో నటించింది. అయితే 'ధృవ'లో కాస్త అందాలను ఆరబోసింది. ఓ సాంగ్‌లో తన గ్లామర్‌ను చూపించడానికి రెండు రోజులపాటు ఏవీ తినకుండా పొట్టను కంట్రోల్‌ చేసుకన్నట్లు వివరించింది కూడా. ప్రస్తుతం విన్నర్‌, సంభవామి, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందేదొకటి, నాగచైతన్యతో చేసే సినిమా, మరో హిందీ చిత్రంలోనూ చేస్తుంది.
 
బిజీగా రెజీనా....
దాదాపు ఏడెమినిది సినిమాల్లో రెజీనా బిజీ అయింది. శౌర్య, జ్యో అచ్యుతానంద, శంకర.. సినిమాల్లో నటించింది. ప్రస్తుతం తమిళ్‌లో ఆరు సినిమాల్లో కథానాయికగా చేస్తుంది. త్వరలో 'నక్షత్రం'లో మెప్పించబోతుంది.
 
రాశీ ఖన్నా.. బెల్లం శ్రీదేవి
తను చేసిన పాత్ర నలుగురిలో నానడంతో ఈమెకు అచ్చివచ్చిందని చెప్పవచ్చు. సుప్రీమ్‌ సినిమాలో చేసిన బెల్లం శ్రీదేవి పాత్రకు పేరు వచ్చింది. అంతకుముందు బొద్దుగా వుండే గ్లామర్‌ భామ 'హైపర్‌'లోనూ తన అభినయం సూపర్‌ అనిపించింది. అయితే అది అంతగా పేరు రాకపోవడంతో.. ఇప్పుడు 'ఆక్సిజన్‌'లోనూ, తమిళ్‌లో రెండు సినిమాలు చేస్తుంది. ఇవి తనకు మంచి గుర్తింపు తెస్తాయంటోంది. ఈ ఏడాది తన బరువును కూడా తగ్గించుకుని మరింత గ్లామర్‌గా చేయాలని ఆశిస్తోంది.

కాజల్‌ హవా కోసం
టాప్‌ ఒన్‌ హీరోయిన్‌గా పేరుపొందిన కాజల్‌ అగర్వాల్‌.. ప్రస్తుతం ఆ పేరు కోసం చూడ్డంలేదు. సినిమాలు వస్తే చాలనేంతగా ఆమెకు ఈ ఏడాది గడిచింది. ఎందుకంటే ఒకప్పటి సక్సెస్‌లు ప్రస్తుతం లేవు.  పవన్‌తో చేసిన 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌', 'బ్రహ్మూత్సవం' ఆమెకు పెద్దగా పేరు తేలేకపోయాయి. అయితే హిందీలో రంగప్రవేశం చేసింది. హీందీలో 'దో లఫ్‌జోన్‌ కి కహానీ' తమిళ్‌లో 'కవలై వేదమ్‌'లో చేసింది. ఇందులో అన్నింటా నిరాశే ఎదురైంది. అందుకే.. ఆమెను 'జనతా గ్యారేజ్‌'లో ఐటెమ్‌ సాంగ్‌ కోసం తీసుకోవాల్సివచ్చింది. అయితే ఇది ఐటం సాంగ్‌ కాదని ప్రత్యేక పాటని దర్శకుడు చెప్పాడనుకోండి.. అయినా.. తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు చిరంజీవితో 'ఖైదీ నంబర్‌ 150'లో నటించింది. ఏడాది ఆమె నటించిన చివరి చిత్రం.
 
మిల్కీ బ్యూటీ తమన్నా
'ఊపిరి',లో గ్లామర్‌డాల్‌గా నటించి మెప్పించిన తమన్నా... ఈ ఏడాది ఐదు సినిమాల్లో నటించింది. 'అభినేత్రి'గా నిరాశపర్చింది. 'ఒక్కడొచ్చాడు', 'స్పీడున్నోడు' తమిళ్‌లో 'ధరమ్‌ దురై'లో కథానాయికగా చేసింది. త్వరలో 'క్వీన్‌' రీమేక్‌లో రాణిగా తెలుగు, తమిళ్‌లో చేయబోతుంది. దీంతో పాటు తమిళ్‌లో మరో చిత్రం చేస్తుంది.
 
సమంత పెళ్లిపైనే చర్చ
ఈ ఏడాది అంతా సమంత పెండ్లి చుట్టే చర్చ జరిగింది. నాగచైతన్యను పెళ్లి చేసుకుంటుందని వార్తలు వచ్చేశాయి. 'మనం' తర్వాత ఆ కుటుంబంతో మమేకమైపోయింది. అందుకే వచ్చే ఏడాది ముహూర్తం కూడా పెట్టేశారు. రెండు తమిళ చిత్రాల్లో నటిస్తోంది. తెలుగులో రెండు మాత్రమే.. 'సావిత్రి' జీవిత కథతో కన్పించనున్నదని ప్రచారం. పెళ్లయ్యాక కూడా నటిస్తానని.. సినిమాలకు దూరంగా కానని చెప్పడం ఆమె అభిమానులకు ఊరట. కాగా, తెలుగు, తమిళంలో కలిసి ఎక్కువ చిత్రాలు చేసిన నటి ఈమె. బ్రహ్మూత్సవం, 'అ..ఆ', 'జనతా గ్యారేజ్‌', తమిళ్‌లో చేసిన 24, తెరి, 'బేంగూర్‌ నాటకల్‌' విజయం సాధించాయి. ఇప్పుడు తమిళ్‌లో రెండు సినిమాల్లో నటిస్తుంది. తెలుగులో కూడా ఓ చిత్రంలో చేయనుంది.

శ్రుతి హాసన్‌
నటన, డాన్స్‌, గ్లామర్‌ను కలబోసిన శ్రుతిహాసన్‌.. ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పవన్‌తో 'గబ్బర్‌సింగ్‌' హిట్‌ కొట్టిన ఈమె.. మరలా పవన్‌తో.. హిట్‌ కోసం ప్రయత్నం చేస్తోంది. గత ఏడాది ఆరు చిత్రాల్లో నటించిన ఈమె ఈసారి రెండు సినిమాలే చేసింది. హిందీలో 'రాక్‌ హ్యాండ్‌సమ్‌', తెలుగులో 'ప్రేమమ్‌' చిత్రాల్లో చేసింది. లెక్చరర్‌గా ప్రేమమ్‌లో మెప్పించింది. ఇప్పుడు సింగమ్‌ 3, శభాష్‌ నాయుడు, కాటమరాయుడు చిత్రాల్లో కథానాయికగా చేస్తుంది. 
 
నయనతార
తమిళ్‌ చిత్రాల్లో ఎక్కువగా నటిస్తున్న కథానాయిక నయనతార. 2016లో నయన తమిళ్‌లో ఐదు, మలయాళం, తెలుగు భాషల్లో ఒక్కొక్కటీ చేసింది. వెంకటేష్‌తో చేసిన 'బాబు బంగారం'లో చాలా స్టయిలిస్‌గా కనిపించింది. ప్రస్తుతం తమిళ్‌లో నాలుగు చిత్రాల్లో చేస్తుంది.
 
నిత్యా మీనన్‌
సక్సెస్‌కు పేరున్న నిత్యా మీనన్‌ ఈసారి '24', రాజాది రాజా, ఒక్క అమ్మాయి తప్ప, జనతా గ్యారేజ్‌ చిత్రాల్లో చేసింది. ఇవి కాకుండా తమిళ్‌ కన్నడలో రెండు సినిమాల్లో నటించింది. తెలుగులో చేసిన 'ఒక్క అమ్మాయి తప్ప', 'జనతా గ్యారేజ్‌' చిత్రాలు మంచి విజయాలు నమోదు చేసుకున్నాయి. 
 
లావణ్య త్రిపాఠి
ఈ ఏడాది మూడు సినిమాల్లో చేసింది. 'సోగ్గాడే చిన్ని నాయనా'లో భలే మెప్పించిందని ప్రేక్షకుల నుంచి ప్రశంసలు లభించాయి. 'శ్రీరస్తు శుభమస్తు, లచ్చిందేవికి ఓ లక్కుంది' చిత్రాల్లో చేసింది. ఇప్పుడు తమిళ్‌లో రెండు చిత్రాలు, తెలుగులో 'మిస్టర్‌'లోనూ చేస్తుంది.