బాంబే స్టాక్ మార్కెట్ : నష్టాలతో ముగిసిన సెన్సెక్స్

బుధవారం, 18 మే 2016 (17:26 IST)
బాంబే స్టాక్ మార్కెట్‌‌ బుధవారం ట్రేడింగ్‌లో నష్టాలను చవిచూసింది. ఫలితంగా సెన్సెక్స్ సూచీ 69 పాయింట్లను కోల్పోయి 25,705 పాయింట్ల వద్ద స్థిరపడింది. అలాగే, నిఫ్టీ 21 పాయింట్లు నష్టపోయి 7,870 పాయింట్ల వద్ద ముగిసింది.
 
డాలరుతో రూపాయి మారకం విలువ రూ.66.98 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీలో ఎస్‌బీఐ సంస్థ షేర్లు అత్యధికంగా 1.78 శాతం లాభపడి రూ.180 వద్ద ముగిశాయి. వీటితోపాటు ఓఎన్‌జీసీ, లుపిన్‌, లార్సెన్‌ అండ్‌ టూబ్రో, హెచ్‌సీఎల్‌ టెక్‌ సంస్థల షేర్లు లాభాలు గడించాయి.
 
అలాగే బాష్‌ లిమిటెడ్‌ సంస్థ షేర్లు అత్యధికంగా 2.47 శాతం నష్టపోయి రూ.21,070 వద్ద ముగిశాయి. వీటితోపాటు జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, బజాజ్‌ ఆటో, హీరో మోటో కార్ప్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా సంస్థల షేర్లు నష్టపోయాయి.

అన్నీ చూడండి

72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో రెండు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు అందుకున్న బ్రహ్మయుగం

New Delhi: 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల విజేతల ప్రకటన వెలువడింది

L.B. Sriram: ఆలస్యంగా గుర్తించినందుకు అవమానంగా ఉంది : ఎల్. బి. శ్రీరామ్

Ali: బద్రి లోని హే చికీతా పాట పెద్ద హిట్ అయిందో ఈ సినిమా హిట్ : అలీ

Soori: సుహాస్, సూరి నటించిన మండాడి చిత్రాన్ని విడుదలచేస్తున్న మైత్రి డిస్ట్రిబ్యూటర్స్

తర్వాతి కథనం
Show comments