1. వార్తలు
  2. బిజినెస్
  3. సెన్సెక్స్
Written By
Last Updated : సోమవారం, 23 సెప్టెంబరు 2019 (11:24 IST)

రికార్డు స్థాయిలో వృద్ధి చెందిన స్టాక్ మార్కెట్లు.. పదేళ్ల తర్వాత అదుర్స్

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు పదేళ్ల తర్వాత రికార్డు స్థాయిలో అదరగొట్టాయి. సోమవారం ఆసియా మార్కెట్లు లాభాలను ఆర్జించడం ద్వారా, కార్పొరేట్ పన్ను రేట్లను తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో పదేళ్ల తర్వాత స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల వైపు దూసుకెళ్లాయి. ఫలితంగా బీఎస్ఈ సెన్సెక్స్ 1,331.39 నుంచి 39,346.01 పాయింట్ల మేర లాభపడింది. 
 
నిఫ్టీ కూడా 11,666.35 నుంచి 392.15 పాయింట్ల మేరకు పరుగులు పెట్టింది. ఐటీ, బ్యాకింగ్, ఆటో, కన్జ్యూమర్ గూడ్స్ షేర్ల్ లాభాల బాట పట్టాయి. ఈ క్రమంలో ఐటీసీ, లార్సెన్ అండ్ టర్బో, ఇండస్‌లాండ్ బ్యాంక్, బ్రిటానియా, ఐసీఐసీఐ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్ సంస్థలు లాభాలను నమోదు చేసుకున్నాయి. 
 
గత శుక్రవారం సెన్సెక్స్ సూచీ 1921.15 పాయింట్లతో 5.32 శాతం పెరిగి 38,014.62 వద్ద ముగిసింది. తాజాగా సోమవారం సెన్సెక్స్ గత పదేళ్లలో ఉత్తమ రికార్డును సొంతం చేసుకుంది. ఏకంగా 39,346.01 పాయింట్ల మేర లాభపడింది.