శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. సెన్సెక్స్
Written By
Last Updated : మంగళవారం, 3 సెప్టెంబరు 2019 (17:13 IST)

ఆరేళ్ళ కనిష్టానికి జీడీపీ రేటు... బ్యాంకు షేర్లూ పతనం

దేశ ఆర్థిక రంగం సంక్షోభంలో కూరుకున్నట్టుగా ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారానికి మరింత ఊతమిచ్చేలా దేశ డీజీపీ వృద్ధిరేటు ఆరేళ్ళ కనిష్టానికి దిగజారింది. గత కేంద్ర ఆర్థిక శాఖ జీడీపీ వృద్ధిరేటు డేటాను విడుదల చేసింది. దీని ప్రభావం మంగళవారం మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపింది. 
 
ఈ డేటా విడుదల తర్వాత వరుసగా మూడు రోజుల పాటు సెలవులు వచ్చాయి. ఈ క్రమంలో మంగళవారం షేర్ మార్కెట్ ప్రారంభంకాగానే జీడీపీ వృద్ధిరేటు ప్రభావం తీవ్రంగా కనిపించింది. జీడీపీ వృద్ధి రేటు ఆరేళ్ల కనిష్ఠ స్థాయికి పడిపోవడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతింది. దీంతో, వారు అమ్మకాలకు మొగ్గుచూపారు. 
 
దీనికితోడు పలు బ్యాంకులను విలీనం చేయనున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖామంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీంతో ఆమె బ్యాంకు షేర్లు కూడా భారీగా పతనమయ్యాయి. ఈ రెండు అంశాల కారణంగా ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి మార్కెట్లు పతనమవుతూనే వచ్చాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 769 పాయింట్లు నష్టపోయి 36,562కి పడిపోయింది. నిఫ్టీ 225 పాయింట్లు కోల్పోయి 10,797కు దిగజారింది.
 
బీఎస్ఈ సెన్సెక్స్ లోని 30 కంపెనీలలో కేవలం రెండు మాత్రమే లాభాల్లో ముగిశాయి. టెక్ మహీంద్రా (1.24%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (0.62%). ఐసీఐసీఐ బ్యాంక్ (-4.45%), టాటా స్టీల్ (-3.93%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-3.89%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-3.67%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (-3.40%) వంటి కంపెనీల షేర్లు భారీగా పతనమయ్యాయి.