suvichar
✕

మార్కెట్‌పై బీహార్ ఎన్నికల రిజల్ట్స్ ఎఫెక్ట్.. 600 పాయింట్లకు పైగా సెన్సెక్స్ నష్టం

Written By pnr
Updated: సోమవారం, 9 నవంబరు 2015 (11:13 IST)
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బాంబే స్టాక్ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపాయి. ఫలితంగా సోమవారం ఉదయం ప్రారంభమైన స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌లో సెన్సెక్స్ సూచీ ఏకంగా 600 పాయింట్ల మేరకు నష్టపోయింది. ఆ తర్వాత అంటే 10:45 గంటల సమయంలో 325 పాయింట్ల నష్టంలో ఉంది. 
 
బీహార్ ఎన్నికల్లో నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ విజయం సాధిస్తే, పలు కీలక బిల్లులు, సంస్కరణల అమలుకు మార్గం సుగమమవుతుందని పెట్టుబడిదారులు భావించడమే ఇందుకు కారణం. అయితే, బీజేపీ ఘోర పరాభవంతో గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ నుంచి బీమా సంస్కరణలు, భూసేకరణ, వివిధ రంగాల్లో ఎఫ్డీఐ పెంపు వంటి ముఖ్యమైన బిల్లులిప్పడు విపక్షాల నుంచి మరింత అడ్డంకులను ఎదుర్కోనున్నాయి. 
 
మరోవైపు 'మేకిన్ ఇండియా' అంటూ మోడీ చేపట్టిన ప్రపంచవ్యాప్త ప్రచారం అనంతరం, విదేశీ ఇన్వెస్టర్లు సైతం బీహార్ ఎన్నికలను నిశితంగా పరిశీలించారు. వీరంతా ఇప్పుడు దేశానికి పెట్టుబడులు పెట్టాలంటే మరోసారి ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక వచ్చే సంవత్సరం కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ సహా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. బీహార్‌లో గెలిచి, ఆ రాష్ట్రాల్లో సత్తా చాటాలని భావించిన బీజేపీకి చుక్కెదురు కావడం కూడా ఇన్వెస్టర్ల మనోభావాలను దెబ్బతీయడంతో మార్కెట్ ట్రేడ్ నష్టాల్లో ప్రారంభమైంది.
About Author
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... Read More

అన్నీ చూడండి

సరైన వ్యక్తి తారసపడితే పెళ్లి చేసుకుంటా : నిత్యా మేనన్

Varanasi postponed? : వారణాసి ఏరియల్ షాట్ లీక్, పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యం, విడుదల వాయిదా .?

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రవి కిషన్, నగ్మా లవ్ స్టోరీ

ఊర్వశి రౌతేలాకు తగ్గుతున్న క్రేజ్.. నోరా ఫతేహికి పెరుగుతున్న క్రేజ్

Vishwak Sen : మా జీవితమే ఈఎన్‌ఈ రిపీట్, యూఎస్‌లో బ్రేక్ ఈవెన్ :విశ్వక్ సేన్

Show comments