స్టాక్ మార్కెట్ : 55 పాయింట్ల మేరకు లాభపడిన సెన్సెక్స్

బుధవారం, 5 నవంబరు 2014 (18:27 IST)
బాంబే స్టాక్ మార్కెట్‌లో సెన్సెక్స్ సూచీ 55 పాయింట్ల మేరకు లాభపడి, 27,916 వద్ద ముగియగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 14 పాయింట్ల లాభంతో 8,338 వద్ద స్థిరపడింది. విదేశీ నిధుల నిరంతర ప్రవాహం, రిటైల్ పెట్టుబడిదారుల స్థిరమైన కొనుగోళ్లు, ప్రభుత్వం చేపట్టిన ఆర్థిక సంస్కరణలపై మరింత ఉత్సాహం, బ్లూ చిప్ కంపెనీలు ఊహించిన దానికంటే ఎక్కువగా లాభాలు ఆర్జించడం వంటి అంశాలు సూచీలను పైస్థాయికి తీసుకెళ్లినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. 
 
బుధవారం జరిగిన ట్రేడింగ్‌లో యాక్సిస్ బ్యాంక్, బీపీసీఎల్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, హెచ్‌సీఎల్‌టెక్, ఎస్‌బీఐ తదితర షేర్లు లాభాల బాటలో పయనించగా, కెయిర్న్ ఇండియా, జిందాల్ స్టీల్, సెసా స్టెరిలైట్, హిందాల్కో, ఎన్ఎండీసీ తదితర కంపెనీల షేర్లు నష్టాలను చవిచూశాయి. 

అన్నీ చూడండి

Sandeep Kishan : సిగ్మా మా జీవితంలో ఎంతో ప్రత్యేకమైన ప్రయాణం : సందీప్ కిషన్, జేసన్ సంజయ్

కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలు, సినీ నటుడు ఉపేంద్ర కర్నాటక సీఎం అవుతారా?

KajaL Agarwal: ఎప్పటికీ అంతం కాని బంధంగా కాజల్ అగర్వాల్, సమంత రూత్ ప్రభు

Samantha: రాజ్ నిడిమోరు విజయవంతమైన దర్శకుడే కాదు, భర్త కూడా!

Mahesh Babu :మహేష్ బాబు 1: నేనొక్కడినే 4K ఫార్మెట్ లో వారణాసిలో ముందస్తు షోలు

Show comments