బుధవారం, 8 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 30 డిశెంబరు 2016 (14:48 IST)

పెళ్ళికూతురు కాబోతున్న సెరెనా విలియమ్స్.. అలెక్స్ అదృష్టవంతుడు..

సెరెనా విలియమ్స్ త్వరలో పెళ్ళి కూతురు కాబోతోంది. టెన్నిస్ సూపర్ స్టార్‌గా రాణించిన ఈ నల్లకలువకు రెడ్డిట్‌ సహ వ్యవస్థాపకుడు అలెక్సిస్‌ ఒహానియన్‌తో తన నిశ్చితార్థం జరిగినట్లు గురువారం ప్రకటన వచ్చింది. స

సెరెనా విలియమ్స్ త్వరలో పెళ్ళి కూతురు కాబోతోంది. టెన్నిస్ సూపర్ స్టార్‌గా రాణించిన ఈ నల్లకలువకు రెడ్డిట్‌ సహ వ్యవస్థాపకుడు అలెక్సిస్‌ ఒహానియన్‌తో తన నిశ్చితార్థం జరిగినట్లు గురువారం ప్రకటన వచ్చింది. సెరెనా వయసు 35 సంవత్సరాలు కాగా అలెక్స్‌ వయసు 33 సంవత్సరాలు. అయితే వివాహ తేదీ ఎప్పుడు అనేది ఇంకా తెలియరాలేదు. 
 
రోమ్‌లో అనుకోకుండా కలిసిన ఈ జంట మధ్య ప్రేమ చిగురించిందని.. ఆపై పెళ్ళి ప్రతిపాదన కూడా రావడంతో సెరెనా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆమె అంగీకారం తనని ఈ ప్రపంచంలోనే అదృష్టవంతుడిని చేసిందంటూ అలెక్స్‌ వెంటనే సమాధానం ఇచ్చాడు. విలియమ్స్‌ కెరీర్‌లో అత్యధిక భాగం ఆక్రమించిన డబ్ల్యూటీఏ టూర్‌ వెంటనే స్పందించింది.

ఈ జంటకు ట్విట్టర్‌ ద్వారా అభినందనలు తెలిపింది. విలియమ్స్‌ ఈ ఏడాది వింబుల్డన్‌ గెలుచుకున్న సంగతి తెలిసిందే. అది ఆమె కెరీర్‌లో 71వ సింగిల్స్‌ టైటిల్‌. 186 వారాలు వరసగా వరల్డ్‌ నంబర్‌ వన్‌ స్థానంలో కొనసాగిన ఘనత కూడా సెరెనా విలియమ్స్‌దే.