suvichar

సేమియా కేసరి ఎలా చేయాలో తెలుసా..?

Updated: బుధవారం, 7 నవంబరు 2018 (14:23 IST)
సేమియాలో ప్రోటీన్స్, న్యూట్రియన్స్ పుష్కలంగా ఉన్నాయి. సేమియా అజీర్తి సమస్యను తొలగిస్తుంది. దీనిలోని యాంటీ బ్యాక్టీయల్ గుణాలు  ఆకలి నియంత్రణకు చాలా ఉపయోగపడుతాయి. దాంతో పాటు మధుమేహ వ్యాధిని అదుపులో ఉంచుతుంది. రక్తంలోని గ్లూకోజ్ లెవల్స్ కంట్రోల్ ఉంటాయి. ఇలాంటి సేమియాతో కేసరి ఎలా చేయాలో చూద్దాం..
 
కావలసిన పదార్థాలు:
సేమియా - 1 కప్పు
నీరు - 2 కప్పులు
చక్కెర - 1 కప్పు
నెయ్యి - 3 స్పూన్స్
ఫుడ్ కలర్ - కొద్దిగా
యాలకుల పొడి - అరస్పూన్
బాదం, జీడిపప్పు - పావుకప్పు
 
తయారీ విధానం:
ముందుగా బాణలిలో నెయ్యి వేసి బాదం, జీడిపప్పు దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు అదే బాణలిలో నెయ్యి వేసి సేమియాను చిన్నమంటపై వేయించి ఆ తరువాత కొద్దిగా నీరు పోసి కాసేపు ఉడికించాలి. ఆ తరువాత పంచదార వేసి అడుగంటకుండా గరిటెతో తిప్పుతూ కరగనివ్వాలి. పంచదార కరిగిన తరువాత యాలకుల పొడి, ఫుడ్‌ కలర్ వేసి బాగా కలపాలి. చివరగా వేయించిన బాదం, జీడిపప్పులు వేసి మరోసారి కలిపి దించేయాలి. అంతే... టేస్టీ అండ్ స్వీటీ సేమియా కేసరి రెడీ.

అన్నీ చూడండి

చెంబూరులో అలాంటి స్థితిలో 20 పిల్లులు మృతి.. సమాచారం ఇస్తే రూ.50వేలు కానుక

ఇంద్రాయణీ నదీ తీరం వద్ద పిచ్చకొట్టుడు కొట్టుకున్న హిజ్రాలు, వీడియో

స్కూల్ లీవ్ ఇస్తారని తోటి విద్యార్థిని చంపబోయిన స్టూడెంట్స్...ఎక్కడ?

తోతాపురి మామిడి రైతులకు ఏపీ సర్కారు శుభవార్త.. అదేంటంటే?

TGSRTC, ఆటోను తప్పించబోయి పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన బస్సు, వీడియో

అన్నీ చూడండి

బిగ్ బాస్ తెలుగులో బిగ్ ట్విస్ట్, ఏంటది?

ఈ వారం డిజాస్టర్ గా నిలిచిన సర్దార్ 2, మందాడి, మారెమ్మ చిత్రాలు

Deepika Padukone :దువా రెండవ పుట్టినరోజున గర్బిణీ ఫొటోలను పంచుకున్న దీపికా పడుకోన్

సినిమాలను వదులుకుంటానన్న సమంత.. వద్దని మా ఇంటి బంగారం చేసిన రాజ్

ది ప్యారడైజ్ షూటింగ్ పూర్తి- శరవేగంగా పోస్ట్-ప్రొడక్షన్ పనులు - సెప్టెంబర్ 24న రిలీజ్

తర్వాతి కథనం
Show comments